1. దరఖాస్తు చేసుకోకుండా ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
2. బాబా దయ
దరఖాస్తు చేసుకోకుండా ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు రచన. మా అమ్మకే ఏ చిన్న కష్టమొచ్చినా బాబానే తలుచుకుంటుంది. నేను కూడా నా చిన్నప్పటినుంచి సాయిబాబానే పూజిస్తున్నాను. 9 సంవత్సరాల క్రితం నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను బాబానే ప్రార్ధించి, ఆయన చరిత్ర చదివాను. బాబా ఆ చరిత్ర ద్వారా నాకు ఒక సూచన ఇచ్చారు. కానీ నేను నా దురదృష్టం కొద్దీ బాబా సూచనను పెడచెవిన పెట్టాను. అయినా బాబా నా చేయి వదలలేదు. 2023, ఆగష్టు 23 నుండి నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. తీరని సమస్యల వల్ల నిద్ర ఉండేది కాదు, తినాలనిపించేది కాదు. అటువంటి సమయంలో బాబా నాకు ఉద్యోగం చూపించారు. నేను పనిలో పడి సమస్యలు గురించి ఆలోచించడం మానేసాను. అంత మాత్రం నాకు ఆ ఉద్యోగం ద్వారా ఊరట లభించింది. కానీ నాకు తెలియని ఒక ఫీల్డు గూర్చి నేర్చుకుంటున్నాను అన్నమాటేగాని చేస్తున్న పనికి నాకు డబ్బులు మాత్రం అంతగా వచ్చేవి కావు. అటువంటి సమయంలో ఈ బ్లాగు నాకు కనిపించింది. ఇక నేను బాబా భక్తుల అనుభవాలు చదువుతూ రోజూ బాబాని, "నాకు ఒక ఉద్యోగం చూపించండి. నేను బయటకి వెళ్లి ఉద్యోగాలకు అప్లై చేయలేని పరిస్థితి. కాబట్టి మీరే నాకు ఉద్యోగం వచ్చేలా చేయండి" అని వేడుకున్నాను. బాబా చేసిన అద్భుతం వర్ణించలేనిది. ఒకరోజు కలలో మా బంధువుల ఒకరు కనిపించి నాకు ఒక కార్డు ఇచ్చారు. నాకు అదేమిటో అర్ధం కాలేదు. ఆ విషయం అలా ఉంచితే, మేము బాబా గుడికి వెళదామనుకున్నప్పటికీ చాలారోజులు వెళ్లలేకపోయాము. చివరికి అనుకోకుండా 2024, ఫిబ్రవరి నెలలో ఒక గురువారంనాడు బాబా గుడికి వెళ్లి ధునిలో కొబ్బరికాయ వేసి, బాబాకి నైవేద్యం పెట్టి వచ్చాం. ఆ మరుసటిరోజు మా బంధువుల అమ్మాయి ఫోన్ చేసి మాటల్లో, "మా ఆఫీసులో ఒక పోస్ట్ ఉంది. దానికోసం సరైన వ్యక్తి కోసం ఒక నెల నుండి ప్రయత్నిస్తున్నాం" అని చెప్పింది. అప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం గురించి తనతో చెప్పాను. అది కాస్త ఆమె చెప్పిన ఉద్యోగానికి రిలేటెడ్‌గా ఉంది. అందువల్ల నేను ఆ సమయంలో చేస్తున్న ఉద్యోగం తాలూకు ఆఫర్ లెటర్ తీసుకొని మా బంధువుల అమ్మాయి చెప్పిన జాబ్ ఇంటర్వ్యూకి సోమవారం వెళ్లాను. నన్ను అయితే సెలెక్ట్ చేసుకున్నారు కానీ, "ఇంకొక ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తారు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఫైనల్ చేస్తాం" అని నన్ను హోల్డ్‌లో ఉంచారు. తర్వాత వచ్చిన ఇద్దరిలో ఒకరిని కూడా ఒకే చేసారు. అప్పుడు నేను, "బాబా! ఈ ఉద్యోగం నాకు వచ్చేలా చూడండి. నాకు ఈ ఉద్యోగం వస్తే మీ అనుగ్రహాన్ని మీ అద్బుతమైన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, ఆ కంపెనీవాళ్ళు మంగళవారం ఫోన్ చేసి, "బుధవారం నుంచి రండి" అని చెప్పారు. బాబా దయవల్ల ఇప్పుడు నేను ఆ ఉద్యోగానికి వెళ్తున్నాను. "ధన్యవాదాలు బాబా. నాకు ఇంకా చాలా సమస్యలున్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించి ఈ సమస్యల కష్టకాలం నుండి బయటపడేయండి బాబా. ఎల్లప్పుడూ నా మీద, నా కుటుంబం మీద మీ కృప ఉండాలని కోరుకుంటున్నాను బాబా".
బాబా దయ
సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు నందకిషోర్. ఒకసారి నేను నా కుటుంబంతో బెంగుళూరు విహారయాత్రకు వెళ్తున్నప్పుడు సైబర్ నేరగాళ్లు నా బ్యాంకు అకౌంట్‌లో డబ్బు కాజేశారని నా ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. నేను బాబా మీద భారమేసి విహారయాత్రను పూర్తి చేశాను. పోయిన డబ్బు గురించి బాబాని వేడుకొని ఆ డబ్బు గురించి ఆన్లైన్‌లో సైబర్ క్రైం సైట్‌లో కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఆ కంప్లైంట్‌ను సదరు బ్యాంక్‌కి, పోలీస్ స్టేషన్‌కి ఫార్వర్డ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు డబ్బు రావడానికి మూడు నెలల సమయం పడుతుందని చెప్పారు. కానీ బాబా దయవల్ల ఒక నెలలోనే నా డబ్బు నా అకౌంటులో జమ చేసారు బ్యాంకువాళ్ళు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jaii 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam🙏
ReplyDeleteOm sairam 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteSai Tandri Raksha Raksha omsaisri Jai Jai Sai kapadu Tandri omsaisri Jai Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సాయిరాం
ReplyDeleteBaba na wife manasu marchi mamnulani okati cheyyandi baba na kodukunu kuda na daggariki vachela cheyyandi baba 🙏🙏🙏🙏Memu siridi tappaka vastamu baba ma kutumbam anta,, 🙏🙏🙏🙏ninnu Darshinchukuntamu Baba 🙏🙏🙏🙏om sairam 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయి రామ్
Deleteఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sri sairam 🙏
ReplyDeletePlease baba poina item dorakali baba please🙏🙏take care of my child baba 🙏 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sai Raksha🙏
ReplyDeletebaba, madava pechi pettakunda school ki vellelaga chudu tandri
ReplyDeleteBaba ,maa problem solve chesi evariki ebbandi rakunda chudandi please 🙏🙏 🙏🙏🙏....Naku help chesina vallu ippudu avasaram lo vunna kuda nenu em cheyleni situation lo vundatam chala bhada gaa vundi baba 🙏🙏🥺🥺🥺🥺..... Please mammalni ee kastam nundi mede kapadandi naku chala bayam vesthundi....naku mee padale dikku 😔😔😔😔😔
ReplyDelete