1. ఆరోగ్య విషయంలో బాబా చూపిన దయ
2. దివ్యపూజ పూర్తయ్యేలోపు ఉద్యోగం అనుగ్రహించిన బాబా
ఆరోగ్య విషయంలో బాబా చూపిన దయ
సాయిబంధువులందరికీ నమస్కారం, నా పేరు ఆశదీప్తి. 2024, జనవరి నెల మొదటివారంలో మావారికి జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, విపరీతమైన నీరసం ఉండటంతో మావారు చాలా ఇబ్బందిపడ్డారు. రెండు రోజులు టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. దాంతో మూడో రోజు మావారు డాక్టర్ దగ్గరకి వెళ్లారు. డాక్టర్ పరీక్ష చేసి, "వైరల్ ఫీవర్‌లా ఉంది" అని కొన్ని మందులు ఇచ్చి, "దగ్గు తగ్గకపోతే, చెస్ట్ ఎక్స్రే తీయించుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ రండి" అని అన్నారు. రెండు రోజులు మందులు వాడాక జ్వరం కాస్త నెమ్మదించింది కానీ, దగ్గు మాత్రం విపరీతంగా ఉండింది. దాంతో మావారు చెస్ట్ ఎక్స్రే తీయించుకొని రెండు రోజుల తర్వాత మళ్లీ డాక్టర్ దగ్గరకి వెళ్లారు. ఆయన కొన్ని మందులు మార్చి, నెబులైజర్ కూడా ఇచ్చారు. కొత్త మందుల హై పవర్ వల్ల మావారికి నీరసం విపరీతంగా పెరిగిపోయి రెండు రోజులు మంచం దిగలేదు. దగ్గు కూడా ఏమాత్రం తగ్గలేదు. అలా వారం రోజులు గడిచిపోయాయి. మావారు జలుబు, దగ్గు, విపరీతమైన నీరసం, ఒళ్ళునొప్పులతో చాలా బలహీనపడిపోయారు. ఈ బ్లాగులో చెప్పినట్లు బాబా ఊదీ కలిపిన నీళ్లు మావారికి ఇద్దామంటే, ఆయన సాయిని పెద్దగా నమ్మరు. అందువల్ల ఊదీ నీళ్లు తీసుకోవడానికి ఒప్పుకోరు. నేను సాయిని అనుగ్రహంతో తమపై మావారికి నమ్మకాన్ని కలిగించి తమ బిడ్డగా చేసుకోమని ఎన్నోసార్లు వేడుకున్నాను. కానీ ఇంతవరకు నా ఆ కోరిక తీరలేదు. త్వరలోనే సాయి ఆ విషయంలో నన్ను అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, మావారు సాయిని నమ్మకపోయినా నాకు మాత్రం అన్నీ సాయిబాబానే కాబట్టి, "బాబా! మావారికి జ్వరం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ మరుసటిరోజు మేము సంక్రాంతి సెలవులకి మా ఊరు వెళ్లాల్సి ఉంది. మావారు ఒక్కరే అంత దూరం కారు డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి. అందువల్ల ఇంత నీరసంతో అదంతా ఎలా జరుగుతుందా అని నేను చాలా ఆందోళన పడ్డాను. మావారు నిద్ర పోతున్నప్పుడు నెమ్మదిగా ఆయన నుదుటను కొంచెం ఊదీ పెట్టాను. బాబా దయవల్ల మావారి ఆరోగ్యం కుదుటపడింది. మేము క్షేమంగా మా ఊరు వెళ్లి ఊరిలో అందరితో పండగ సెలవులు సంతోషంగా గడిపి హైదరాబాద్ తిరిగి వచ్చాం. అప్పటికి మావారి దగ్గు కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇంకో విషయం మేము సంక్రాంతి పండగ రోజు బందర్ బీచ్‌కి వెళ్లి తిరిగి వస్తుంటే, రోడ్డు మీద ఎవరో తాగేసి హఠాత్తుగా కారుకి అడ్డంగా వచ్చేసాడు. అదృష్టవశాత్తు మావారు కారుని పక్కకు తప్పించారు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలేవీ రాకపోవడంతో ఎవరికీ ఎటువంటి అపాయం లేకుండా బయటపడ్డాం. ఖచ్చితంగా బాబానే రక్షించారని నా నమ్మకం. "ఎప్పుడూ మా వెన్నంటే ఉండి నడిపిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. ఇలాగే ఇక మీదట కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రీ".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
దివ్యపూజ పూర్తయ్యేలోపు ఉద్యోగం అనుగ్రహించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మా అబ్బాయి అమెరికాలో రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. తను 2022 నుంచి ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నాడు. కాని అక్కడ పరిస్థితులు బాగుండకపోవటం మూలంగా తనకి ఇంటర్వ్యూ పిలుపు కూడ రాలేదు. దానితో ఒక్కోసారి అబ్బాయి చాలా చికాకుగా ఉండేవాడు. 2023, సెప్టెంబర్లో ఒకసారి తను నా దగ్గర బాధపడితే నేను తనతో, 'సాయి దివ్యపూజ' గురించి చెప్పి ఐదు గురువారాలు చేస్తాననుకొని, పూజ చేయమని చెప్పాను. తను సరేనని అమెరికాలో వెంటనే పూజ మొదలుపెట్టాడు. అదే సమయంలో నేను అబ్బాయి ఉద్యోగం గురించి బాబా పారాయణ పుస్తకం తీసి అందులోని ఒక పేజీ చదివాను. అందులో శిరిడీ వెళ్ళి, రమ్మని వచ్చింది. అప్పుడు నేను, "మేము ఎప్పుడు శిరిడీ వెళ్తాము? అబ్బాయికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది బాబా?" అని అనుకున్నాను. అంతలో అమెరికా నుంచి మా సిస్టర్ ఫోన్ చేసి, "మేము ఇండియా వస్తున్నాము. శిరిడీ వెళదామా?" అని అడిగింది. నాకు అది బాబా లీల అనిపించింది. అదేరోజు మేము శిరిడీలో హారతికి టిక్కెట్లు బుక్ చేసాము. చిత్రమేమిటంటే, మా సిస్టర్ వాళ్ళు అమెరికా నుండి రాలేకపోయారు. మేము మాత్రమే శిరిడీ వెళ్ళొచ్చాము. అక్కడ మా అబ్బాయి మూడోవారం దివ్యపూజ చేసేసరికి ఒక మంచి కంపెనీ నుండి తనకి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. మా అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు. ఐదు గురువారాల పూజ పూర్తయ్యేలోపు తనకి ఉద్యోగం కూడా వచ్చింది. 2023, నవంబర్ 13న తను కొత్త ఉద్యోగంలో జాయినయ్యాడు. ఇలాంటివి బాబా మాకు చాలా చేశారు. "చాలా ధన్యవాదాలు సాయితండ్రీ. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి తండ్రీ".
Om Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOme Sai ram 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha Sai Tandri Raksha Raksha
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam 🙏
ReplyDeletesaibaba maa bangaru tandri sai madava bharam antha meede baba. tammudini kuda kapadu baba.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram 🙏❤️💐💐❤️❤️
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sri Sai Ram baba ma abbyi parekasha pass ayyela choodu
ReplyDeleteOm Sri Sainathaya Namah
ReplyDeleteBaba mdedayato memu tondaraga okati ayyela cheyyi baba 🙏🙏🙏🙏🙏🙏Om sairam 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba maa problem solve ayyela chudandi.... nannu nammukuni vachina evariki ebbandi lekunda chudandi please baba 🙏🥺🥺🥺🥺
ReplyDeleteMee padale naku dikku 🥺🥺🥺🥺🥺....Please baba 🙏🥺🥺🥺🥺 emaina thappu chesthe kashaminchi mammalni anugrahinchandi baba
Delete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sai ram
ReplyDeleteSai ram🙏
ReplyDelete