1. బాబా దయ అనిర్వచనీయం!
2. నమ్ముకుంటే మనతోపాటు మన కుటుంబసబ్యుల క్షేమం కూడా చూస్తారు బాబా
బాబా దయ అనిర్వచనీయం!
అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణిమ. నేను చిన్నప్పటి నుండి బాబా భక్తురాలిని. ప్రతి గురువారం సాయంత్రం బాబా గుడిలో హారతికి తప్పకుండా వెళ్ళేదాన్ని. నేను ఆయన్ని నా తండ్రిగా భావిస్తాను. నా సంతోషం, బాధ అన్నీ సాయితో పంచుకుంటాను. నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా బాబా నాకు అండగా ఉన్నారు. నా చిన్నప్పటి నుండి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు నాకు చాలాసార్లు కడుపునొప్పి వస్తుంటే డాక్టర్లు, 'అపెండిసైటిస్' అని, "ఆపరేషన్ చేయాల"ని అన్నారు. అప్పుడు నేను నా సాయితండ్రిని వేడుకున్నాను. బాబా అధ్బుతం చేశారు. ఆపరేషన్ చేయడానికి నన్ను స్ట్రేచర్‌పై పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్ ద్వారం వరకు తీసుకెళ్ళాక నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వచ్చి నా పొట్టపై వత్తి చూసి, "నొప్పి ఉందా?" అని అడిగారు. ఆశ్చర్యంగా నాకు నొప్పి తెలియలేదు. అందువల్ల నేను, "నొప్పి లేదు" అని చెప్పాను. వెంటనే డాక్టర్, "నొప్పి లేనప్పుడు ఆపరేషన్ ఎందుకు? మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు రండి. అప్పుడు ఆపరేషన్ చేస్తాను" అని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు నా వయస్సు 45 సంవత్సరాలు. నా తండ్రి బాబా దయవల్ల ఇప్పటివరకు నాకు మళ్ళీ ఆ నొప్పి రాలేదు. ఆ రోజు డాక్టర్ రూపంలో బాబానే ఆపరేషన్ కాకుండా కాపాడారు.
నాకు 24 ఏళ్ళకి వివాహమైంది. పదేళ్ల వరకు నాకు పిల్లలు పుట్టలేదు. బాబా దయవల్ల 11వ సంవత్సరంలో నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాడు. మా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మా బాబుకి 3 ఏళ్ళు వయసున్నప్పుడు 2016లో మావారి హార్ట్‌లో వాల్వ్ ప్రాబ్లెమ్ ఉందని నిర్ధారణ అయింది. డాక్టరు సర్జరీ చేయాలని చెప్పారు. మాకు చాలా భయమేసింది. "బాబా! ఈ గండం నుండి గట్టెకించు" అని వేడుకున్నాను. మళ్ళీ బాబా మా మీద తన కరుణ చూపించారు. డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేసి, "వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. మందులు మాత్రం తప్పకుండా వాడాలి" అని చెప్పారు. బాబా దయ అనిర్వచనీయం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నమ్ముకుంటే మనతోపాటు మన కుటుంబసబ్యుల క్షేమం కూడా చూస్తారు బాబా
సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు మానస. నా చెల్లి ఒక గైనకాలజిస్ట్. తను చైన్నైలోని ఒక హాస్పిటల్లో పని చేస్తుంది. ఆ మధ్య చైన్నైలో బాగా వర్షాలు పడినప్పుడు రోజూ హాస్పిటల్‌కి వెళ్ళడానికి మా చెల్లికి బాగా ఇబ్బంది అయింది. ఆ సమయంలో ఒకరోజు తను నాకు ఫోన్ చేసి, "అక్కా! ఇక్కడ విపరీతమైన వర్షం కురిసి రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంద"ని చెప్పి పెట్టేసింది. ఆ తర్వాత మేము తనకి ఫోన్ చేస్తే, తన ఫోన్ పని చేయడం లేదని వచ్చింది. మరుసటిరోజు కూడా ఫోన్ కలవలేదు, నాట్ రీచబుల్ అని వచ్చింది. మరోపక్క న్యూస్ చానెల్స్‌లో వర్షంలో నీటి ప్రవాహానికి చాలామంది కొట్టుకుపోయారని చూసి మాకు చాలా భయమేసింది. నేను కంగారుపడి, "బాబా! చెల్లి జాగ్రత్తగా తిరిగి తన రూముకి చేరుకోవాలి, ఫోన్ చేసి మాతో మాట్లాడాలి" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత మా చెల్లి ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే తను వేరే ప్రదేశంలో ఉన్నానని, విపరీతమైన వర్షం వల్ల రూముకి వెళ్లలేకపోతున్నామని, సాయంత్రం రూముకి వెళ్ళాక ఫోన్ చేయిస్తానని చెప్పారు. అలాగే తను సాయంత్రం రూముకి వెళ్లి మా చెల్లి చేత ఫోన్ చేయించారు. మా చెల్లి, "మేము సురక్షితంగా ఉన్నాము. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడ విద్యుత్త సరఫరా నిలిచిపోయినందున మీకు ఫోన్ చేసి విషయం చెప్పలేకపోయాను అక్క" అని చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబాని నమ్ముకుంటే నమ్ముకున్న మనతోపాటు మన కుటుంబసబ్యుల క్షేమం కూడా చూస్తారు. "బాబా! నేను సదా మీకు కృతజ్ఞురాలినై ఉంటాను".
🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం సాయి రామ్🌹🌹🌹🙏🙏🙏
ReplyDeleteఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓం సాయి రామ్🌹🌹🌹🙏🙏🙏🙏
ఓం సాయి🙏🙏🙏🙏
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteJaisai Ram Sai Tandri kapadu Jai Sai Ram Omsaisri Sai Jai Jai Sai
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteSai Baba maa madava bharam antha meede baba.tammudiki kuda manchi udyogam ravali baba.
ReplyDeleteBaba, maa problem solve ayyela chudandi baba please.....roju roju ki bayam vachesthundi.... evaru adigina em cheppali kuda ardam kavatam ledu..... Kapadandi baba mee padale naku dikku ...naa valla evaru ebbandi padakunda ee problem solve ayyela chudandi baba please 🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba mammulanu tondaraga kalupu baba 🙏😅🙏😅😅om sairam🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm sairam 🙏 🙌
ReplyDeleteBaba please nenu padutuna baada miku telusu please na valla avaru ibandi padavaddu baba mire naku tandri,daivam baba
ReplyDeleteOme Sainathaya
ReplyDeleteOmesairam ❤
ReplyDeleteSri sadguru sai nath maharaj ki jai🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDelete