1. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?2. కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా
బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సామాన్య సాయిభక్తురాలిని. బాబా నా జీవితంలోకి నా చిన్నప్పుడే వచ్చారు. అప్పటినుండి ఆయన లీలలు తరచూ నాకు అనుభవమవుతూ ఉన్నాయి. 2024, ఫిబ్రవరి నెలాఖరులో నేను, మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఒక షాపులో నుండి బయటకు రాగానే అకస్మాత్తుగా మా వారికి నడుము నొప్పి వచ్చింది. దానితో ఆయన నడవలేక అక్కడే షాపు ముందు కూర్చుండిపోయారు. ఆ సమయంలో నేను, "బాబా! ఆయనకి నడుము నొప్పి తగ్గేలా చేయండి" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, ఒక 15 నిమిషాల తర్వాత మావారు లేచి, "తగ్గిపోయింది. ఇక వెళదాం" అని బండి ఆయనే నడిపించారు. అంతలా ఉంటాయి బాబా లీలలు.
2024, ఫిబ్రవరి నెలాఖరులోనే ఒకరోజు నా పొత్తికడుపులో బాగా నొప్పి వచ్చింది. ఆ రాత్రంతా నేను ఆ నొప్పిని అలానే భరిస్తూ పడుకున్నాను. మరుసటిరోజు ప్రొద్దున్న బాబా ఊదీ నీళ్లలో కలిపి తీసుకున్నాను. అంతే, రాత్రి నుంచి ఉన్న నొప్పి కొద్దికొద్దిగా తగ్గడం మొదలై రెండవరోజు రాత్రికి పూర్తిగా తగ్గిపోయింది. బాబాను మనసారా కోరుకుంటే జరగనిదేముంటుంది?
మా అపార్టుమెంటులో వాటర్ లీకేజీ ప్రాబ్లం ఉంది. ప్లంబర్ 2 రోజులు చెక్ చేసి మా ఇంటి బాల్కనీ నుండి లీకు అవుతుందని, కానీ బాల్కనీలో ఉన్న సింక్ వల్లనో, వాషింగ్ మెషీన్ దగ్గర ఉండే ఔట్లెట్ వల్లనో చెప్పలేనని, ఒకవేళ సింక్ వలన సమస్య అయితే కనుక చిన్నదే కానీ, వాషింగ్ మెషీన్ దగ్గర అయితే మాత్రం చాలా పెద్ద సమస్య, బాల్కనీ టైల్స్ అన్నీ పగలగొట్టి చూడాలన్నాడు. అప్పుడు నేను, "బాబా! సమస్య చిన్నదే అయ్యేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వాచ్మెన్ వచ్చి సింక్ నుండి లీకేజీ అవుతుందని చెప్పాడు. అది విని నాకు ఎంతో సంతోషమనిపించింది. సమస్య చిన్నదానితో తీరిపోయేలా చేసిన బాబాకు ధన్యవాదాలు తప్ప ఏమి చెప్పగలను? "ఎంతోకాలంగా ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను సాయి. త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేయండి సాయి".
కోరుకున్నట్లే అనుగ్రహించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సునీత. 2024 ఫిబ్రవరి నెలలో ఒకరోజు మా అత్తయ్య, మావయ్య చెకప్ కోసం హాస్పటల్‌కి వెళ్లారు. డాక్టర్ మా అత్తయ్యకి అంజియోగ్రామ్ చేయాలని చేశారు. ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో మా అత్తయ్య గుండె వేగం ఎక్కువైనందువల్ల మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తుందేమో, రేపు చెప్తాము అన్నారు. టెస్ట్ అనంతరం ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య చాలా నీరసంగా ఉన్నారు, చెయ్యి కూడా చాలా నొప్పిగా ఉందని అన్నారు. నాకు చాలా టెన్షన్‌గా, బాధగా అనిపించి, "బాబా! మిమ్మల్నే నిత్యం పూజించే అత్తయ్యకి ఎటువంటి సమస్య లేకుండా చూడండి. అలాగే మళ్ళీ టెస్ట్ చేయాలని డాక్టర్ చెప్పకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే డాక్టర్, "టెస్ట్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి సమస్య లేదు" అని చెప్పారు. బాబా దయవల్ల చిన్న నొప్పితోనే పెద్ద సమస్యేమీ లేకుండా చేశారు. అనుకున్న వెంటనే మన కష్టాలు తీర్చే సాయితండ్రికి నా శతకోటి నమస్కారాలు. ఇలానే నాకు, నా కుటుంబానికి అన్నివేళలా తోడుగా ఉండండి బాబా.
Baba nannu na kutumbanni meere kapadali thandri. Jai Sairam!!
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sairam🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
maa bangaru tandri sai madava bharam antha meede baba. tammudu kuda settle avvali baba.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba chest pain rakunda chudu baba please
ReplyDeleteBaba,naa situations naa problems mee padale daggara vadilesthunna....nannu mere daggara vundi nadipinchandi....naa valla nammina vallu evaru ebbandi padakunda chudandi please baba 🙏🥺🥺🥺🥺....naku mere dikku Mee padale Naku raksha🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteBaba please bless my child baba 🙏
ReplyDeleteBaba please na sisters nato matladela chay baba 🙏 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete