సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబాను దర్శించిన కొంతమంది భక్తులు



పార్సీ మతస్థుడైన ఒక పెద్దమనిషికి పిచ్చివాడైన ఒక కొడుకు ఉండేవాడు. కొడుకు పరిస్థితి చాలా దయనీయంగా మారడంతో ఆ తండ్రి కొడుకును ఆ స్థితిలో చూడటం భరించలేకపోయాడు. అందువల్ల కొడుకుని తీసుకెళ్లి మానసిక రోగుల వైద్యశాలలో ఉంచాడు. ఆ తరువాత అతను సాయిబాబా కీర్తి విని బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాడు. బాబా అతనిని ఆశీర్వదించి, "వెళ్ళు, నీ కొడుకుకి నయమవుతుంది. అతన్ని ఇంటికి తీసుకెళ్ళు" అని అన్నారు. అయితే, తన కొడుకును ఇంటికి తీసుకెళ్లడానికి వైద్యశాల అధికారులు అంగీకరిస్తారో, లేదో అతనికి తెలియలేదు. ఆశ్చర్యంగా, అతను శిరిడీ నుండి ఇంటికి చేరుకునేసరికి వైద్యశాల అధికారుల వద్ద నుండి వచ్చిన ఒక లేఖ అతని కంటపడింది. ఆ లేఖలో అతని కొడుకు బరువు కోల్పోతున్న కారణంగా అతన్ని వేరేచోట ఎక్కడైనా చేర్చడం మంచిదని అధికారులు పేర్కొన్నారు. దాంతో అతను బాబా ఆదేశానుసారం తన కొడుకును ఇంటికి తీసుకురావచ్చని చాలా ఆనందించాడు. వెంటనే బయలుదేరి వెళ్ళి కొడుకును ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చాక బాబా ఆశీస్సులతో అతని కొడుకు పరిస్థితి చాలా త్వరగా మెరుగుపడి, కొన్నిరోజులకు పూర్తిగా కోలుకొని వ్యాపారంలో తండ్రికి సహాయం చేయసాగాడు.

ఒకసారి ఒక ముస్లిం వైద్యుడు శిరిడీ వచ్చాడు. అతను శిరిడీలో ఉండగా ఎవరో అతనిపై ఒక క్రిమినల్ కేసు పెట్టి సమన్లు శిరిడీకి  పంపారు. కేసు విచారణ రేపనగా ఆ ముందురోజు ఆ వైద్యుడు, 'ఆరోజే బయలుదేరితే మరుసటిరోజు కేసుకి హాజరు కావచ్చ'నే ఉద్దేశ్యంతో బాబాకు వద్దకు వెళ్లి శిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అతనితో, "మరుసటిరోజు వెళ్ళమ"ని చెప్పారు. బాబా ఆదేశానుసారం అతను అలాగే చేసి, నిర్ణయించిన తేదీన కాకుండా మరుసటిరోజు కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అప్పుడు, 'ముందురోజు మేజిస్ట్రేట్ బిజీగా ఉన్నందున తన కేసు విచారణకి రాలేద'ని అతనికి తెలిసింది. తరువాత ఫిర్యాదిని, అతని తరపున సాక్షులను విచారించిన మీదట వైద్యుడిపై ఆరోపించబడిన కేసు బూటకమని కోర్టువారు ఆ కేసును కొట్టేశారు.

ఒకప్పుడు అనంత్ మహాదేవ్ కులకర్ణి భాషా సంబంధితమైన ఒక పరీక్ష వ్రాశాడు. పరీక్షా ఫలితం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అతను తన తండ్రితో కలిసి 1914లో సాయిబాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాడు. బాబా కీర్తి, దయ గురించి విన్న అనంత్ బాబాను, "నేను పరీక్షలో ఉత్తీర్ణుడనవుతానా?" అని అడిగాడు. అందుకు బాబా, "నువ్వు 114వ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధిస్తావు" అని అన్నారు. తరువాత అతను బయలుదేరబోతున్నప్పుడు బాబా అతనికి పేడాను ప్రసాదంగా ఇచ్చారు. కొన్నిరోజుల తరువాత పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. బాబా చెప్పినట్లే అతను 114వ ర్యాంకు సాధించాడు.

ఒకప్పుడొక పోలీసు అధికారిపై డబ్బు కాజేశాడనే నేరారోపణ చేయబడింది. అతను బాబాను శరణువేడి, "తన నిర్దోషిత్వం నిరూపణైతే, దర్శనానికి శిరిడీ వస్తాన"ని వాగ్దానం చేశాడు. బాబా కృపవలన అతను ఆ కష్టం నుండి బయటపడ్డాడు. దాంతో అతను తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 1910, డిసెంబరు 8న శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. బాబా అతనిని ఆశీర్వదించారు.

సోర్స్: సాయిబాబా బై శ్రీసాయిశరణానంద.

8 comments:

  1. Om sai baba nice sai leela.we don't know this story.nice story.om sai ram ❤❤❤❤

    ReplyDelete
  2. Om sairam
    Om sairam
    Om sairam
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om sai ram baba amma ki tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  4. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sai ram baba save me baba

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo