సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 777వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' స్మరణతో చేకూరిన ఆరోగ్యం
  2. బాబా కృపతో స్కిన్ అలర్జీ, జ్వరం నుండి ఉపశమనం

'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' స్మరణతో చేకూరిన ఆరోగ్యం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు  తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి బృందానికి నా ధన్యవాదాలు. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మొదటి అనుభవం:


కొన్ని రోజుల క్రితం నాకు ఉన్నట్టుండి విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. ఇంకా కాళ్లలో కూడా నడవలేనంత నొప్పి మొదలైంది. అప్పుడు బాబాను తలచుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోసాగాను. వేరే ఏ మందూ వేసుకోలేదు. బాబా దయవలన రెండు రోజుల్లో నొప్పి మాయమైంది.


రెండవ అనుభవం:


ఒకసారి నాకు గొంతునొప్పి, విపరీతమైన తలనొప్పి వచ్చాయి. తలనొప్పి వచ్చిందంటే, టైఫాయిడ్ వస్తుందేమోనని నాకు భయం. ఎందుకంటే, గతంలో ఒకే నెలలో రెండుసార్లు నాకు టైఫాయిడ్ వచ్చింది. అందువలన మళ్ళీ వస్తుందేమోనన్న భయంతో వెంటనే బాబా ఊదీ నుదుటన ధరించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అని స్మరిస్తూ టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. కొంతసేపటికి నొప్పి ఇంకా ఎక్కువైంది. అంతేకాకుండా, కళ్ళు తిరుగుతున్నట్లు కూడా అనిపించింది. నా భయం ఇంకా పెరిగి, "బాబా! ఉదయానికల్లా నా ఆరోగ్యం బాగుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా అనుగ్రహించారు. ఉదయానికల్లా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

 

మూడవ అనుభవం:


మేము ఇటీవల మా ఇంటికి పెయింటింగ్స్ వేయాలని అనుకున్నాము. అప్పుడు నేను, "ఎలాంటి ఆటంకం లేకుండా పెయింటింగ్ పూర్తయ్యేలా చూడమ"ని బాబాను వేడుకున్నాను. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా బాబా దయవలన పని పూర్తయింది. "చాలా చాలా ధన్యవాదములు బాబా. ఈ కరోనా నుంచి ప్రజలందరినీ కాపాడు తండ్రీ. ప్రతి నిమిషం ఏమి జరుగుతుందోనని భయభయంగా మా జీవితాలను సాగిస్తున్నాము. మీరే మమ్మల్ని కాపాడాలి తండ్రీ".


బాబా కృపతో స్కిన్ అలర్జీ, జ్వరం నుండి ఉపశమనం


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సాయి బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారం. బాబాకు నేనొక చిన్న భక్తురాలిని. నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుండి కొన్ని అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


ఈమధ్య నాకు గొంతుపైన స్కిన్ ఎలర్జీ లాగా వచ్చింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “ఈ స్కిన్ ఎలర్జీ తొందరగా తగ్గిపోయేలా అనుగ్రహించండి బాబా. ఎలర్జీ తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని వేడుకున్నాను. తరువాత ప్రతిరోజూ బాబాను స్మరించుకుంటూ, ఉదయం పూట బాబా ఊదీని, రాత్రిపూట ఆయింట్‌మెంట్‌ని ఎలర్జీ ఉన్న చోట రాయడం ప్రారంభించాను. బాబా దయవల్ల ఎలర్జీ తొందరగానే తగ్గిపోయింది. “బాబా! నీకు శతకోటి వందనాలు తండ్రీ!”


ఒకసారి నాకు జ్వరం వచ్చింది. కరోనా విజృంభించివున్న ఈ సమయంలో జ్వరం రావడంతో నాకు చాలా భయమేసింది. దాంతో నేను బాబాకు నమస్కరించి, “బాబా! నాకు జ్వరం త్వరగా తగ్గిపోయేలా చేయి తండ్రీ!” అని వేడుకున్నాను. బాబా దయతో మూడు రోజులకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. “బాబా! నీకు ధన్యవాదములు తండ్రీ. బాబా! నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, మా అమ్మకి వున్న ఆరోగ్య సమస్యను తొందరగా నయం చేయి తండ్రీ. తన సమస్య తీరి అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అలాగే నాకు వేరే సమస్య ఒకటి వుంది, దానిని కూడా పరిష్కరించు తండ్రీ. మాకు ఎల్లప్పుడూ రక్షగా వుండి మమ్మల్ని కాపాడు తండ్రీ”.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


6 comments:

  1. Om sai ram evert day i read this blog every day.in present swesuvation any disease may fear us.with baba blessings we can cure.udi is the best medicine to devotees.om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om sai ram baba amma arogyam bagundali thandri please

    ReplyDelete
  3. నీ కొడుకుకి నయమవుతుంది. అతన్ని ఇంటికి తీసుకెళ్ళు

    ReplyDelete
  4. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo