- బాబా అనుగ్రహం ఎంత గొప్పది!
- బాబాపై ఆధారపడితే మన క్షేమం ఆయన చూసుకుంటారు
బాబా అనుగ్రహం ఎంత గొప్పది!
సాయిభక్తురాలు శ్రీమతి రేవతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రేవతి. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్నిటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మొదటి అనుభవం:
మాది శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు. లాక్‌డౌన్ సమయంలో మావారిని సీతంపేటలోని ITDA (Integrated Tribal Development Agency) ఆఫీసులో వర్క్ చేయడానికి రమ్మన్నారు. కరోనా సమయంలో ఆఫీసుకు వెళ్ళడం మవారికి ఇష్టం లేకపోయినా ప్రాజెక్ట్ ఆఫీసరుగారి ఆర్డర్ కాబట్టి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. మొదటి రెండు రోజులు వర్క్ బాగానే జరిగినా మూడవరోజు మాత్రం రాత్రి 9 గంటల వరకు వర్క్ కొనసాగింది. అనుకోకుండా ఆ సమయంలోనే మావారి బండి రిపేరుకు వచ్చింది. ఆ సమయంలో బండి రిపేర్ చెయ్యడం కుదరదు. తనతో పనిచేసే టీచర్స్ అందరూ పాలకొండ వెళ్ళవలసినవారే గానీ కొత్తూరుకు వచ్చేవారు ఎవరూ లేరు. పైగా ఆ సమయంలో ఆటోలు, బస్సులు కూడా ఉండవు. మావారు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను బాబాకు నమస్కరించుకుని, ఏదో ఒక దారి చూపమని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇంతలో ఒక కానిస్టేబుల్ మావారి వద్దకు వచ్చి, “నేను కొత్తూరు వెళుతున్నాను, మీరు వస్తారా?” అని అడిగారట. మావారు సంతోషంగా అందుకు అంగీకరించి అతనితో కలిసి క్షేమంగా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి సమయంలో బాబానే ఆ కానిస్టేబుల్‌ని పంపించి మావారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. “నిజంగా చాలా చాలా ధన్యవాదాలు బాబా!”
రెండవ అనుభవం:
ఈమధ్య మావారు కుడిభుజం దగ్గర నొప్పితో బాధపడ్డారు. మందులు వాడినా నొప్పి తగ్గలేదు. నేను మావారి భుజంనొప్పి తగ్గించమని బాబాను ప్రార్థించి, ప్రతిరోజూ ఆ మందులతో పాటు బాబా ఊదీ కలిపిన నీళ్ళను నొప్పి ఉన్న చోట రాసి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని జపించేదాన్ని. బాబా దయవల్ల నాలుగు రోజులలో మావారి భుజంనొప్పి తగ్గిపోయింది. ఇలాగే మా ఇంట్లో ఎవరికి అనారోగ్యంగా ఉన్నా బాబా ఊదీ కలిపిన నీటిని త్రాగించి, కొంచెం ఊదీ పెట్టి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తుంటాను. బాబా అనుగ్రహంతో వారికి నయమవుతుంది. “థాంక్యూ బాబా, థాంక్యూ సో మచ్”.
బాబాపై ఆధారపడితే మన క్షేమం ఆయన చూసుకుంటారు
సాయిభక్తురాలు శ్రీమతి శ్వేత తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము బెంగళూరులో ఉంటాము. స్కూల్స్‌కి సెలవులు ప్రకటించాక నేను, మా పిల్లలు కలిసి మా అమ్మావాళ్ళ ఇంటికి వెళదామని టికెట్స్ బుక్ చేసుకున్నాము. అయితే, ఉన్నట్టుండి కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని విని ప్రయాణాన్ని రద్దు చేసుకుందామని అనుకున్నాము. కానీ మా అమ్మ మా కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తోంది. దాంతో, ఏదైతే అది అయిందని అనుకుని, బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ పైనే భారం వేసి బయలుదేరుతున్నాము. మేము క్షేమంగా అమ్మావాళ్ల ఇంటికి చేరుకునేలా అనుగ్రహించండి” అని వేడుకుని పిల్లలను తీసుకుని ఊరికి బయలుదేరాను. ప్రయాణంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా బాబా మమ్మల్ని క్షేమంగా మా ఊరికి చేర్చారు. కానీ ఊరికి చేరుకున్నాక మా అబ్బాయికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. కరోనా విజృంభించివున్న ఈ సమయంలో డాక్టర్ దగ్గరకు వెళ్ళాలన్నా భయంగా ఉంది. అందువల్ల, ‘బాబుకి వాంతులు, విరోచనాలు తగ్గేలా అనుగ్రహించమని’ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని మా అబ్బాయి నుదుటికి పెట్టి, కొంచెం ఊదీని తన నోట్లో వేశాను. ఇంతలో బాబానే పంపించినట్టుగా, డాక్టరైన మా కజిన్ బ్రదర్ మమ్మల్ని కలవడానికి మా ఇంటికి వచ్చారు. తను మా అబ్బాయిని పరీక్షించి మందులు సూచించారు. ఆ మందులు వేసుకోగానే మా అబ్బాయికి వాంతులు, విరోచనాలు తగ్గటం మొదలైంది. బాబా దయవల్ల త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతుడైనాడు. “బాబా, మీ కరుణ మా పైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మమ్మల్ని తిరిగి క్షేమంగా బెంగళూరులోని మా ఇంటికి చేర్చండి బాబా. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాబా!”
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om sai ram udi is the medicine all time.baba u only kill corona virus���� from India.many people are suffering from virus.you spread atta around the world to save your devotees.udi is gift from baba, om sai ram ❤❤❤��������
ReplyDeleteOm sai ram,, corona ni thagginchandi baba
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteJai sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
721 days
ReplyDeletesairam
Om sai ram baba Amma arogyam bagundali thandri please
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete