ఈ భాగంలో అనుభవాలు:
- బాబా అనుగ్రహంతో గృహప్రవేశం - అందరూ క్షేమం
- శరీరానికి, మనసుకి కావల్సిన శక్తినిచ్చి కరోనా నుండి బయటపడేసిన సాయి స్మరణం
- పాదుకల రూపంలో మా ఇంటికొచ్చి ఆటంకాలు తొలగించిన బాబా
బాబా అనుగ్రహంతో గృహప్రవేశం - అందరూ క్షేమం
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
నేను గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను.
అనుకున్న సమయానికి గృహప్రవేశ వేడుక జరిపించిన బాబా:
బాబా కృపతో మేము ఒక ఇల్లు కొన్నామనే విషయం నా మునుపటి అనుభవంలో మీతో పంచుకున్నాను. 2020, అక్టోబరులో ఆ ఇంటి రిజిస్ట్రేషన్, గృహప్రవేశం చేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాము. కానీ డబ్బు సర్దుబాటు కాకపోవటం వలన అనుకున్న సమయానికి మేము గృహప్రవేశం చేసుకోలేకపోయాము. ఆ విషయమై నేను ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 5 వారాల సాయిబాబా పూజను రెండుసార్లు చేశాను. బాబా ఆశీస్సులతో అనుకోకుండా నేను, నా సోదరి, సోదరుడు ముగ్గురం కలిసి కొన్న ఒక స్థలానికి మంచి ధర వచ్చింది, దాన్ని అమ్మడానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ఆ స్థలం అమ్మడం ద్వారా నాకు 7 లక్షల రూపాయలు వచ్చాయి. అంతేకాదు, మా అమ్మ ఆస్తిలో వాటాగా నా సోదరుడు దాదాపు 8 లక్షల రూపాయలు నాకు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని నేను ఇంటి యజమానికి ఇచ్చి, 2021 ఫిబ్రవరి 7న రిజిస్ట్రేషన్, ఫిబ్రవరి 13న గృహప్రవేశం పెట్టుకుందామని అనుకున్నాను. కానీ కొన్ని పత్రాల కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయలేకపోయాము. అయినప్పటికీ ఇంట్లో పూజ, హోమం వాయిదావేయడం ఇష్టం లేక దాని గురించి నేను పంతులుతో చర్చించి, "పూజ, హోమం చేసుకోవచ్చా?" అని అడిగాను. అతను 'చేసుకోవచ్చ'ని అన్నారు. అందుకు కారణమేమిటంటే, మేము గత 4 సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్నాము. అయితే ఒక వారం వ్యవధిలో పెయింటింగ్ పని, వడ్రంగి పని మరియు ఇతర చిన్న చిన్న ప్లంబింగ్ పనులు పూర్తి చేయించాలి. ఆ పనులన్నీ 13వ తేదీకల్లా అవుతాయా, లేదా అని నేను ఆందోళన చెందాను. కానీ బాబా దయవలన ఇరుగుపొరుగు సహాయంతో పెయింటింగ్, ప్లంబింగ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా కొద్దిపాటి వడ్రంగి పనులు కూడా పూర్తయ్యాయి. నేను అనుకున్నట్లే 13వ తేదీన గృహప్రవేశ కార్యక్రమాన్ని బాబా బాగా జరిపించారు. హైదరాబాద్ నుండి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధిర నుండి పంతులుగారు వచ్చారు. అతనితో మా కుటుంబానికి స్నేహపూర్వకమైన అనుబంధం ఉంది. అయితే చాలా రోజులుగా కాంటాక్ట్‌లో లేరు. అకస్మాత్తుగా 7 సంవత్సరాల తరువాత అతను మాతో సంప్రదించి, కేవలం నా కోసమే పూజలు నిర్వహించడానికి సొంత కారులో అంతదూరం నుండి హైదరాబాదులోని మా ఇంటికి వచ్చారు. అంతా బాబా దయ. మేము 13వ తేదీన సామాజిక దూరాన్ని పాటిస్తూ కొద్దిమందితో ఆనందంగా పూజ జరిపించాము. కానీ కరోనా వలన నా మనసులో అనేక సందేహాలు, భయాలు ఉండటంతో, "మా ఇంటి శుభకార్యానికి వచ్చినవారికి, అలాగే మా కుటుంబానికి ఏమీ కాకూడద"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారు.
మరో అనుభవం: నవంబరులో మా అమ్మాయి పుట్టినరోజు, మార్చిలో మా అబ్బాయి పుట్టినరోజు వచ్చాయి. ఆ వేడుకలను 20, 25 మందితో చిన్నగా జరుపుకున్నాము. ఆ రెండు సందర్భాలలో కూడా నేను మా కుటుంబానికి, ఆ వేడుకలలో పాల్గొన్నవారికి ఏమీ కాకూడదని, అందరూ బాగుండాలని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అందరూ సురక్షితంగా ఉన్నారు.
ఇంకో అనుభవం: మేము అమ్మిన ఆస్తి విషయంగా రిజిస్టర్ కార్యాలయంలో పత్రాలపై సంతకం చేయడానికి నేను 2021, మార్చి 1న మహబూబాబాద్ వెళ్లాల్సి ఉండి రైలు టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే తిరుగు ప్రయాణానికి మధ్యాహ్నం 3 లేదా 6 గంటలకు 2 రైళ్లు మాత్రమే ఉన్నాయి. నేను ఆ విషయమై మా ఆస్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తులతో మాట్లాడితే, "మధ్యాహ్నం 3 గంటల రైలుకు టికెట్ బుక్ చేసుకోండి. ఆ సమయం కన్నా ముందే పనిపూర్తయ్యేలా చూస్తామ"ని చెప్పారు. నేను అలాగే మధ్యాహ్నం 3 గంటల రైలుకి బుక్ చేసుకున్నాను. కానీ వాళ్ళు చెప్పినట్లు జరగలేదు. మాకు టోకెన్ నంబర్ 34 వచ్చింది. అంటే మధ్యాహ్నం 3 తర్వాత మమ్మల్ని పిలిచే అవకాశం ఉంది. దాంతో నేను చాలా టెన్షన్ పడి, "బాబా! నేను 3 గంటల రైలును మిస్ కాకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే, వెంటనే 6 గంటల రైలుకి నేను టికెట్ పొందలేను" అని బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహం వలన మాకన్నా ముందున్న టోకెన్ సభ్యులు కొందరు హాజరు కాకపోవటంతో మా నెంబరును ముందుగానే పిలిచారు. దాంతో పని పూర్తయి నేను, నా సోదరి మధ్యాహ్నం 3 గంటల రైలు అందుకోగలిగాము. అయితే రైలులో చాలా రద్దీగా ఉంది. కొంతమంది వ్యక్తులు సామాజిక దూరాన్ని అస్సలు పాటించడంలేదు, పైగా గుట్కా వంటివి నములుతున్నారు. అందువలన నేను, నా సోదరి కరోనా దృష్ట్యా చాలా ఆందోళనపడ్డాము. "నాకు, నా సోదరికి ఏమీ జరగకూడద"ని నేను బాబాను ప్రార్థించాను. సాయి దయవల్ల మేము ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నాం. త్వరలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఇంతలా మాపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తున్న బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.. సెలవు.
శరీరానికి, మనసుకి కావల్సిన శక్తినిచ్చి కరోనా నుండి బయటపడేసిన సాయి స్మరణం
పాదుకల రూపంలో మా ఇంటికొచ్చి ఆటంకాలు తొలగించిన బాబా
సాయిభక్తురాలు శ్రీమతి అరుణదేవి తమకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ముందుగా ‘సాయి మహరాజ్ సన్నిధి’ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. సాయి భక్తకోటికి నా నమస్కారాలు. నా పేరు అరుణదేవి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి మేము క్రొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుని పని ప్రారంభించాము. అయితే, ఇంటిపని మొదలుపెట్టిన దగ్గరనుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ మమ్మల్ని మానసికంగా వేదనకు గురిచేస్తుండేవి. దానివల్ల కుటుంబంలో మనశ్శాంతి లేదు. దాంతో ఒక గురువారంరోజున మావారు బాబా గుడికి వెళ్ళి, తన వేదనంతా బాబాకు చెప్పుకుని, “మీరు రండి బాబా!” అని ఎంతో ఆర్తిగా బాబాను వేడుకున్నారు. ఆ సమయంలోనే ఎవరో భక్తులు బాబా పాదాలు (పాదుకలు) గుడిలో సమర్పించుకున్నారు. ఆశ్చర్యకరంగా పూజారిగారు ఆ పాదాలు మావారికి ఇచ్చి, “తీసుకువెళ్ళి ఇంటిలో పెట్టుకో!” అన్నారట. ఆ విధంగా ఆ పాదాల రూపంలో బాబా మా దగ్గరకు వచ్చారు. ఆ పాదాలను మేము కట్టుకునే ఇంటి దగ్గర పెట్టుకున్నాము. బాబా దయవల్ల అప్పటినుంచి ఇంక ఏ ఇబ్బందీ లేకుండా ఇంటిపని జరుగుతోంది. బాబా మాపై చూపించిన ప్రేమకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుతం నేను కోవిడ్‌తో బాధపడుతున్నాను. బాబా త్వరలోనే నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తారు. “బాబా! తల్లిలా మమ్మల్ని అనుక్షణం కాపాడుతూ, మా మీద దయ చూపిస్తున్నారు. మేము ఏ విధంగా మీ ఋణం తీర్చుకోవాలి తండ్రీ! మీకు శతకోటి వందనాలు బాబా!”
Om Sairam
ReplyDeleteSai always be with me
743 days
ReplyDeletesairam
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽🌹❤️👏
ReplyDeleteOm Sai ram padukalu is Sai’s blessings.I also have Sai padukas in my house.I worship it.if padukalu is there Sai is present there only.🙏🏽🙏🏽🙏🏽👏❤️🌹
ReplyDelete🙏🙏🙏⚘🌼⚘OmSaiRam⚘🌼⚘🙏🙏🙏
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri please
ReplyDelete