ఈ భాగంలో అనుభవాలు:
- బాబా దయతో సమసిపోయిన భయాలు
- సాయినాథుడు అనుగ్రహించిన సేవ - సాయి దివ్యపూజ
బాబా దయతో సమసిపోయిన భయాలు
యూరప్ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తులందరికీ, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న బృందానికి నా నమస్కారములు. నేను ఇంతకుముందు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను.
మొదటి అనుభవం: నాకు బాబా అంటే చాలా ఇష్టం. మా కుటుంబమంతా చిన్ననాటినుండి బాబా భక్తులం. ఈ సంవత్సరం (2021) ఉగాది, శ్రీరామనవమి పండుగల సమయంలో నాకు నెలసరి వచ్చే అవకాశం ఉండటంతో నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఈ పండుగల సమయంలో నాకు నెలసరి సమస్య రాకుండా చూడండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవలన ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేను ఆ రెండు పండుగలను సంతోషంగా జరుపుకున్నాను. "థాంక్యూ బాబా".
రెండవ అనుభవం: నాకు పద్దెనిమిది నెలల వయసున్న ఒక బాబు ఉన్నాడు. తన పేరు సాయి. ఒకసారి తను డిష్‌వాషర్‌లో వేసే టాబ్లెట్‌ని నోటిలో పెట్టుకొని కొరికేశాడు. అది ప్రమాదకరమైనదైనందున నాకు చాలా భయమేసింది. వెంటనే తన నోరంతా శుభ్రపరిచాను. కానీ అదేమైనా కడుపులోకి పోయిందేమో, బాబుకి ఏదైనా అవుతుందేమోననని చాలా భయపడి, హఠాత్తుగా వచ్చిన ఈ కష్టం గురించి బాబాకు చెప్పుకొని, "బాబుకి ఏమీ కాకుండా దయచూపమ"ని వేడుకున్నాను. బాబా దయవలన బాబుకి ఏమీ కాలేదు. "థాంక్యూ సో మచ్ బాబా. నేను మీకు సదా ఋణపడివుంటాను".
మూడవ అనుభవం: మేము యూరప్‌లో ఉంటున్నాము. నేను ఇక్కడ భాష సంబంధిత పరీక్ష ఒకటి వ్రాయడానికి నెల రోజులు కోచింగ్ తీసుకున్నాను. కానీ పరీక్షలో ఉత్తీర్ణురాలినవుతానో, లేదోనని నాకు చాలా భయంగా ఉండేది. అప్పుడు బాబాకు చెప్పుకొని, "నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలినైతే గనక నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా కృప, ఆశీర్వాదం వల్ల నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యాను. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
సాయినాథుడు అనుగ్రహించిన సేవ - సాయి దివ్యపూజ
సాయిభక్తురాలు శ్రీమతి భారతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయి. సాయిబంధువులందరికీ నమస్కారం. నేను బాబా నాకు ప్రసాదించిన మరపురాని అనుభవాన్ని నిన్నటి భాగంలో మీతో పంచుకున్నాను. ఆ అనుభవం చివరిలో, ప్రస్తుతం ఒక సమస్య నన్ను వేధిస్తోందనీ, అది తీరితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని వ్రాశాను కదా! అది తీరేలోపే బాబా నాకు ఎన్నో నిదర్శనాలు కలుగచేస్తున్నారు. ఈమధ్య నేను యూట్యూబ్‌లో నండూరి శ్రీనివాస్‌గారి వీడియోలు ఫాలో అవుతున్నాను. ఆయన ఎప్పుడూ చెప్తుంటారు, “పూర్వకర్మలు కరగాలంటే ఒళ్ళు వంచి సేవ చేయడం ఒకటే మార్గం” అని. ఆ మాట మనసులో బాగా హత్తుకుని, ‘సాయి అనుగ్రహం త్వరగా కలగాలన్నా ఆ పూర్వకర్మని తగ్గించుకోవాలి’ అన్న తలంపు బలంగా కలిగింది. మా ఊరిలో ఒక రమణ ఆశ్రమం ఉంది. నేను ధ్యానం చేసుకోవడం కోసం రెగ్యులర్‌గా ఆ ఆశ్రమానికి వెళ్తుంటాను. అక్కడ ఎంతోమంది విపరీతమైన సేవ చేస్తుంటారు. నిర్మాణపనులు ఎక్కువగా జరుగుతుంటాయి. అందులో కూడా ఆడ, మగ, చిన్న, పెద్ద భేదం లేకుండా అందరూ సేవ చేస్తుంటారు. నేను ఎప్పుడో ఒకసారి ఆ పనుల్లో ఒక చెయ్యి వేయడమేగానీ, ఎక్కువగా ధ్యానంలోనే కూర్చునేదాన్ని. ఒకరోజు (2021, ఏప్రిల్ 28) ఎలాగైనా వెళ్లి సేవలో పాల్గోవాలి అనిపించింది. కానీ అంతలోనే, ‘ఇంత ఎండలో నేను ఏం సేవ చేయగలను?’ అని అనుమానం కలిగింది. నాకు మామూలుగానే ఎండ సరిపడదు. అయినా సరే, ఏదైతే అదయిందని అనుకుని, సేవ చేయాలని దృఢంగా సంకల్పించుకుని బాబాకు నమస్కరించుకుని ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అడుగుపెట్టగానే నాకు మరోసారి సాయిలీల, అనుగ్రహం అనుభవమై ఒళ్ళు పులకించింది. అక్కడ ఎలాంటి నిర్మాణ పనులూ జరగట్లేదు. నేను వెళ్ళేసరికి అందరూ పచ్చని చెట్ల నీడలో రాలిన ఆకులు శుభ్రంచేసే పనిచేస్తున్నారు. సాయినాథుని అనుగ్రహానికి పులకించిపోతూ వెంటనే ఆ సేవలో కొద్దిసేపు పాలుపంచుకుని, స్వామి దర్శనం కూడా చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాను.
సర్వం శ్రీ సాయిథార్పణమస్తు!
ఇంకో అనుభవం:
ఒకసారి, వరుసగా రెండు రోజుల పాటు ఈ బ్లాగులో ప్రచురించిన శ్రీమతి సంధ్యగారి అనుభవాలలో ‘సాయి దివ్యపూజ’ గురించిన ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుండటంతో ఒకరోజు, ‘దివ్యపూజ ఏమిటో, ఎలా చేస్తారో, మాటిమాటికీ ఈ పదమే కనిపిస్తోంది’ అనుకున్నాను. మరుసటిరోజు (2021, ఏప్రిల్ 29) గురువారం. బాబా గుడికి వెళ్తే ఒకావిడ బాబా ప్రసాదంతో పాటు ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. ఆ పుస్తకం ఏమిటా అని చూస్తే, ‘సాయి దివ్యపూజ’ పుస్తకం! అనుకున్న వెంటనే దివ్యపూజ పుస్తకాన్ని నాకు ప్రసాదించి మళ్ళీ ఇంకో నిదర్శనం చూపించారు బాబా. దాంతో, ఆ పూజ చెయ్యమని బాబా సందేశంగా భావించి 5 వారాలు దివ్యపూజ చేసుకోవాలని సంకల్పం చేసుకుని, ఆరోజు సాయంత్రమే మొదటి సాయి దివ్యపూజ చేసుకోవాలనుకున్నాను. ఏ ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లన్నీ చకచకా అయిపోయాయి. ఎంతో ఆనందంగా సాయి దివ్యపూజ చేసుకున్నాను. బాబా ప్రేరణో ఏమోగానీ, పూజలంటే కొంచెం దూరంగా ఉండే మా అమ్మాయి కూడా ఆరోజు పూజలో పాల్గొంది. అంతేకాకుండా, దివ్యపూజ చేసుకున్నరోజునే ‘ఈమధ్య బేరం చేసుకున్న ఒక స్థలాన్ని కొనుక్కో’మని బాబా సందేశం వచ్చింది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా బాబానే చూసుకుంటారనే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. బాబా అనుగ్రహం మాపై వర్షించాలనీ, మా సమస్య తొలగిపోవాలనీ బాబాను మనసారా వేడుకుంటున్నాము.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
ఓం సాయిరాం!
ReplyDeleteOm sai ram sai your leelas are good to human beings.for how many days we are suffering from pandemic.we are fed up. You only save us. Om sai ram❤❤❤
ReplyDeleteJai sairam 🙏🙏🙏
ReplyDeleteOm sai ram baba amma problem tondarga cure cheyi thandri pleaseeee
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeletesai always be with me
740 days
ReplyDeletesairam
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete