సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 771వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా దయ ఉంటే చాలు - అన్నీ నెరవేరుతాయి
  2. మా కుటుంబాన్ని కరోనా నుండి రక్షించిన సాయితండ్రి 
  3. మాతోనే ఉన్నామని మరోసారి నిరూపించిన బాబా


బాబా దయ ఉంటే చాలు - అన్నీ నెరవేరుతాయి


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు అరుణ. మా అమ్మకి పెద్దగా పూజలు చేసే అలవాటు లేదు. కానీ మా అక్క చెప్పటం వల్ల ‘సాయి దివ్యపూజ’ ప్రారంభించింది. దివ్యపూజ ప్రారంభించిన మూడు వారాల లోపే తను ఎప్పటినుంచో అనుకున్న కోరిక తీరింది. మా అమ్మ సంతోషానికి అవధులు లేవు. ఇదంతా బాబా దయవల్ల మాత్రమే సాధ్యమైంది.


కోవిడ్ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో మా అక్కావాళ్ళు వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. వాళ్ళు ఎలా ఇంటికి చేరుతారో అని మేమంతా చాలా భయపడ్డాము. నేను బాబాకు నమస్కరించుకుని, “ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా అక్కావాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి” అని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.


కుటుంబాన్ని కరోనా నుండి రక్షించిన సాయితండ్రి 


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 


నేను ఒక సాయిభక్తురాలిని. 2021లో మా బాబుకి కోవిడ్ 'పాజిటివ్' వచ్చింది. ఆ విషయం తెలిసి మేము చాలా భయపడ్డాము. వెంటనే మన తండ్రి బాబాను ప్రార్థించి, "బాబుకి కరోనా లక్షణాలు ఎక్కువగా కనబడకుండా త్వరగా కోలుకోవాలి" అని చెప్పుకున్నాను. ఆ సాయితండ్రి ఎంతో దయతో చాలా తక్కువ లక్షణాలు కనపడేలా చేసి, ఎక్కువ మందులు అవసరం లేకుండా మా బాబుకి నయం చేశారు. అంతేకాదు, ఇంట్లోనే ఉన్న నాకు, మావారికి, మా పెద్దబాబుకి కరోనా రాకపోవడం కూడా బాబా దయే. "తండ్రీ! దయతో నా కుటుంబాన్ని కరోనా నుండి  రక్షించావు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ మహమ్మారి బారిన పడకుండా మమ్మల్ని రక్షించు సాయినాథా! మా అత్తగారికి ఆరోగ్యం బాగాలేదు. దయతో పరిస్థితులు చక్కబడేలా చేయండి. దయతో అందరినీ ఈ మహమ్మారి నుండి రక్షించండి బాబా".


సర్వేజనాః సుఖినోభవంతు!


మాతోనే ఉన్నామని మరోసారి నిరూపించిన బాబా

 

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులకు నా నమస్కారం. బాబా మా జీవితంలో చాలా అద్భుతాలను చూపించారు, ఎన్నో కష్టాల నుండి మమ్మల్ని రక్షించారు. 2021లో బాబా, "నేనుండగా భయమెందుకు?" అని గుర్తుచేస్తూ తామెప్పుడూ మాతోనే ఉన్నారని నిరూపించిన సంఘటనను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021లో తన ఆరోగ్యం బాగలేకపోవడంతో మావారు ముందుజాగ్రత్తగా కొన్ని పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టుల కోసం మేము ఆత్రంగా ఎదురుచూస్తుంటే, కేసులు (కరోనా అన్న పదాన్ని ప్రస్తావించడం ఇష్టం లేదు) పెరుగుతున్నందున రిపోర్టులు రావడానికి చాలా సమయం పట్టసాగింది. నేను వాటి గురించే ఆలోచిస్తూ చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే, వయస్సు పైబడిన నా తల్లిదండ్రులు నాతోనే ఉన్నారు. పైగా వాళ్ళు మధుమేహ వ్యాధిగ్రస్తులు. వాళ్ళు అప్పటికే మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకొని ఉన్నప్పటికీ నేను చాలా భయపడ్డాను. రిపోర్టు ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో నాకు చాలా నిస్సహాయంగా అనిపించింది. అటువంటి పరిస్థితిలో నేను, అమ్మ నిరంతరం బాబాను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. చివరికి బాబా ఆశీస్సులతో రిపోర్టు 'నెగిటివ్' అని వచ్చింది. ఈ విధంగా బాబా మమ్మల్ని మరోసారి రక్షించారు. "బాబా! ఎప్పటికీ అంతంలేని మీ ప్రేమ మరియు ఆశీస్సులకు ధన్యవాదాలు. నిజంగా నేను మీకు కృతజ్ఞురాలినై ఉంటాను".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo