సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 765వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. దక్షిణ స్వీకరణ - చూపిన దయ
  2. ఉద్యోగ విధులలో బాబా చూపిన దయ

దక్షిణ స్వీకరణ - చూపిన దయ


అందరికీ నమస్కారం. నా పేరు సాయిసంహిత. ఇంతకుముందు నా అనుభవాలు కొన్నింటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. “నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బాబా!”


కొద్ది రోజుల క్రితం నేను సచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. ఏప్రిల్ 14, బుధవారంరోజున పారాయణ పూర్తయింది. ఆరోజు మన ‘సాయి మహరాజ్ సన్నిధి’ వాట్సాప్ గ్రూపులో ఒక సాయిభక్తురాలు పంచుకున్న అనుభవం చదివాను. అందులో, ‘తన పారాయణను ఆమోదిస్తే తన వద్దనుండి 100 రూపాయలు దక్షిణ స్వీకరించాలని బాబాను ప్రార్థించాననీ, తన ప్రార్థనను మన్నించి బాబా తన వద్దనుండి దక్షిణ స్వీకరించారనీ’ ఆ భక్తురాలు పంచుకున్నారు. ఆ అనుభవం చదివిన నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాంతో నేను కూడా మనసులోనే, “బాబా నా పారాయణ ఆమోదిస్తే నా వద్ద దక్షిణ స్వీకరిస్తే బాగుండు” అనుకున్నాను. ఇంక ఆ విషయాన్ని అంతటితో మర్చిపోయాను. తరువాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బస్టాపుకి వస్తుంటే ఒక పాప నా వద్దకు వచ్చి, “అక్కా, ఒక రూపాయి ఇవ్వవా?” అని అడిగింది. నేను వెంటనే ఆ పాపకు ఒక రూపాయి ఇచ్చాను. కానీ ఆ సమయంలో ‘నా వద్దనుండి దక్షిణ స్వీకరించమ’ని నేను బాబాను అడిగిన విషయం మర్చిపోయాను. రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 16వ తేదీన, సచ్చరిత్రలో 14వ అధ్యాయంలోని ‘దక్షిణ’ గురించి చదువుతున్నప్పుడు, బాబా ఆ పాప రూపంలో నా దగ్గర దక్షిణ స్వీకరించిన విషయం గుర్తొచ్చి చాలా సంతోషంగా అనిపించింది. ఆ ముందురోజు కూడా ఆ భక్తురాలి అనుభవం ఊరికే గుర్తొచ్చింది, కానీ బాబాను అడిగిన విషయం మాత్రం గుర్తుకురాలేదు. “నా పారాయణను ఆమోదించి నా దగ్గర దక్షిణ స్వీకరించినందుకు, నేను మర్చిపోయిన విషయాన్ని గుర్తుచేసినందుకు థాంక్యూ సో మచ్ బాబా!”


ఇంకొక అనుభవం:


ఇటీవల నాకు, నా స్నేహితునికి గొడవ అయింది. ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. తను పని ఒత్తిడిలో ఉన్నాడు. కానీ నేను తనను అర్థం చేసుకోకుండా తనతో గొడవ పెట్టుకున్నాను. దాంతో తను నాతో మాట్లాడట్లేదు. నాకు బాధగా అనిపించి బాబాకు నమస్కరించుకుని, “సారీ బాబా! నేనే తనను అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకున్నాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ తనతో గొడవపెట్టుకోను. తను నాతో మాట్లాడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల నా స్నేహితుడు ఇప్పుడు నాతో మునుపటిలా మాట్లాడుతున్నాడు. “తెలిసీ తెలియక నేను చేసిన తప్పులను క్షమించండి బాబా. నన్ను సరైన దారిలో నడిపించండి”. బాబా నామమే నా ఊపిరి. “సచ్చిదానందా! ఎల్లప్పుడూ మా తోడుగా ఉండండి”.


ఉద్యోగ విధులలో బాబా చూపిన దయ


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా అభినందనలు. నేను ఇంతకుముందు ఒకసారి నా అనుభవాలను, సాయి నాపై చూపిన ప్రేమను మీతో పంచుకున్నాను. బాబా నన్ను హార్మోనుల అసమతుల్యత నుంచి, దానివల్ల కలిగిన సమస్యల నుంచి, ఒత్తిడి నుంచి ఎలా రక్షించారో ఆ అనుభవాలలో తెలిపాను. ఇప్పుడు ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నాను. 


ఈమధ్య జరిగిన ఎన్నికలలో నా భర్తకు కూడా విధులు కేటాయించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేము చాలా ఆందోళనకు, భయానికి గురయ్యాము. మా ఊరికి దగ్గరలోనే నా భర్తకు విధులు కేటాయించాలని బాబాకు నమస్కరించి వేడుకున్నాము. బాబా దయవల్ల మా ఊరికి చాలా దగ్గరగానే తనకు విధులు వేశారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా నా భర్త విధులను పూర్తి చేసుకుని వచ్చారు


ఇప్పుడు నాకు కండరాల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాబా దయవలన అవి తొందరగా తగ్గాలని కోరుకుంటున్నాను. మా అక్కావాళ్ళ 12 సంవత్సరముల పాప చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నది. తొందరలో తనకు ఆ సమస్య తగ్గిపోవాలని బాబాను కోరుకుంటున్నాను. అలాగే, ఇంటర్ చదువుతున్న పెద్దబాబు మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలనీ, మాకున్న మరొక కోరిక కూడా త్వరగా నెరవేరాలనీ బాబాను వేడుకుంటున్నాను. “బాబా! మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఎల్లప్పుడూ మీ ప్రేమను మాపై ఇలాగే చూపించండి. మేము చేసే తప్పులను క్షమించి మీపై భక్తివిశ్వాసాలు పెరిగేలా చూడండి. నిరంతరం మీ నామస్మరణ చేసే బుద్ధిని ఇవ్వండి”. 


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


9 comments:

  1. Om sai ram please bless my family always baba.you are saving everyone in this world.i am watching mere sai serial in Hindi.very nice serial.all must watch it.sai baba roll is very nice.in future like this serial they must produce.om sai ram❤❤❤

    ReplyDelete
  2. Kothakonda SrinivasMay 5, 2021 at 7:35 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. నిరంతరం మీ నామస్మరణ చేసే బుద్ధిని ఇవ్వండి
    అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba pleaseeee bless my mother with good health

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo