సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 781వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ‘సాయీ’ అంటే ‘ఓయీ’ అంటూ కష్టాన్ని దాటించే ప్రేమమూర్తి
  2. బాబా దయతో దూరమైన ఆందోళన

‘సాయీ’ అంటే ‘ఓయీ’ అంటూ కష్టాన్ని దాటించే ప్రేమమూర్తి


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ఈ బ్లాగులో ప్రచురించే ప్రతి సాయిభక్తుని అనుభవం చదువుతుంటే, ‘బాబా మనకు కూడా ఇలాగే చేశారు కదా’ అని ఒక దివ్యానుభూతి కలుగుతుంది. అదే శ్రీసాయి మీద అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని, ప్రేమను ఇంకా దృఢపరుస్తోంది. మనం ఎంతటి అదృష్టవంతులమో కదా!!


ఈ కరోనా సెకండ్ వేవ్ టెన్షన్‌లో ఉన్న భక్తులందరికీ ‘బాబా మనకు అండగా ఉన్నార’నే ధైర్యం చెప్పటానికి నేను నా అనుభవాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. బాబా అంటే కాలెండరులో ఉండే దేవుడు కాదు. పిలిస్తే పలికే తల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నీ!! ‘సాయీ’ అంటే ‘ఓయీ’ అంటూ మన భారాన్ని తానే తీసుకుని మనకు అలసట కూడా తెలియకుండా కష్టాన్ని దాటించే ప్రేమమూర్తి, దయామయుడు, కరుణాసముద్రుడు మన బాబా. ఆయన మనందరి జీవితంలో ఉన్నందుకు, మనలను తన భక్తులుగా, బిడ్డలుగా స్వీకరించినందుకు, మనలను అన్నివిధాలా భరిస్తున్నందుకు, సరైన దారిలో నడిపిస్తున్నందుకు, మన బాగోగులు చూసుకుంటున్నందుకు బాబా పాదపద్మాలకు శతకోటి ప్రణామములు.


గత సంవత్సరం కోవిడ్ సమయంలో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉండటం వలన వాళ్ళ రక్షణ, క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్లి చేసుకువచ్చే పనులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చేవాళ్ళం. ఆ సమయంలో కోవిడ్ లక్షణాలు మనకు చాలా క్రొత్త, భయం కాబట్టి అప్పటివరకూ సాధారణంగా కనిపించిన ప్రతి విషయాన్నీ మనకు తెలియకుండానే భూతద్దంలో పెట్టి చూడటం జరుగుతుంది. అలా ఒక రెండు మూడు రోజులు తీవ్ర ఒత్తిడిలో బాబాను వేడుకుంటూ, బాబా నామస్మరణ చేసుకుంటున్న నేను బాబా సమాధానాన్ని పొందటం ఆశ్చర్యాలకే ఆశ్చర్యం. కానీ బాబా దగ్గర అది చాలా సామాన్యమైన విషయం.


లాక్‌డౌన్ రోజులు కాబట్టి ప్రతి పనికీ సమయానుసారంగా బయటికి వెళ్లి రావాల్సిన పరిస్థితులు, పైగా ప్రతిచోటా గుంపులుగా జనం. ఊపిరి పీలిస్తే కూడా ఎక్కడ వైరస్ బారినపడతామో అని భయంతో గట్టిగా మాస్కులు, ఆపైన మళ్లీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకరోజు గొంతునొప్పితో కూడిన జలుబు, ఒళ్లునొప్పులు, చలిగా అనిపించడం లాంటివి కొన్ని జరిగేసరికి చెప్పలేని భయం కమ్మేసింది. అసలే వయసులో చాలా పెద్దవాళ్ళు, పసిపిల్లలు ఉన్న ఇల్లు. నేను తప్ప ప్రస్తుతం ఎవరికి ఎవరూ ఆధారం లేరు. నేను ఒక్క గంటసేపు అనారోగ్యంగా ఉందని పడుకున్నా ఇంట్లో అందరూ డీలా పడిపోతారు, ఒక్క పని కూడా సాగదు. ముందు అందరూ మానసికంగా చాలా భయపడిపోతారు. అలాంటి సమయంలో నేను బాబాను గట్టిగా పట్టుకుని రేయింబవళ్లు భయంగా, మౌనంగా మనసులోనే ఏడుస్తూ రాత్రిపూట బాబాకు చెప్పుకుంటూ ఉండేదాన్ని. లక్షణాలు భయంగొల్పుతున్నాయి. పోనీ అన్నిటికీ సిద్ధమైపోయి, ‘ఏదైతే అదయింది, ముందు టెస్ట్ చేయించుకుంటే ఈ టెన్షన్ నుండి విముక్తి కలుగుతుంది, అదే నయం’ అని ఆలోచించి, ఇంట్లోవాళ్ల దగ్గర బయటపడితే, “నువ్వు అలాంటి పనులు చేయకు. ఇలాంటివి మనకు రావు, మన ఇంటా వంటా లేవు” అనే విధంగా వారి రియాక్షన్. 


ఇక, జలుబుగా ఉందని నన్ను నేను ఐసోలేట్ చేసుకుని విడిగా పడుకుని రాత్రి మొత్తం ‘స్తవనమంజరి’ వింటూ లోలోపల భయంతో ఏడుస్తూ ఉన్న నాకు పెద్ద షాక్ - బాత్రూంలోకి వెళ్లి చేతులు కడుక్కుందామని సబ్బు తీయగానే వాసన తెలియకపోవడం. అప్పటికే వేడినీళ్లు త్రాగటం, ఉప్పునీళ్లతో మౌత్‌వాష్, గర్గ్లింగ్‌తో రుచి తెలియటం తగ్గింది. ఇక వాసన కూడా తెలియకపోయేసరికి భయంతో నా ప్రాణాలు పైకే పోయాయి. పోనీ, నేను సిద్ధపడతాను. కానీ ఇంట్లోవాళ్ళు చిన్నపిల్లలు, చాలా పెద్దవాళ్ళు, శారీరకంగా, మానసికంగా నా మీద ఆధారపడ్డవాళ్ళు. ఏదైనా చెప్తే వాళ్ళంతా భయపడి బెంబేలుపడిపోతారు. పరిస్థితులరీత్యా నా భర్త వేరే దేశంలో ఇరుక్కుపోయారు. ఆల్రెడీ టెన్షన్‌తో ఉన్న నాకు చెప్పుకోడానికి ఎవరూ లేరు. అమ్మ దగ్గర, ఒకరిద్దరు చాలా దగ్గరి స్నేహితుల దగ్గర మాత్రం భయం వ్యక్తపరిచాను. కానీ వాళ్ళు సహజంగానే ధైర్యం చెప్తున్నట్టుగా మాట్లాడారు అనే ఫీలింగ్. ఏమీ అర్థం కాక భారం మొత్తం బాబా పైన వేసి, “బాబా! నేను నీ బిడ్డని. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మీ నామస్మరణతో అనునిత్యం బయటకు వెళ్తాను. ‘నా భారం మీదే’ అని పూర్తిగా నమ్ముతాను కదా, నాకు ఈ పరిస్థితి ఏమిటి? తండ్రీ, నువ్వు తప్ప దిక్కులేదు, నా కుటుంబానికి నేనే ఆధారం. తెలిసి నేను ఎక్కడా తప్పు చేయలేదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించనూ లేదు, ఏమిటి ఈ పరిస్థితి నాకు?” అని పగలు మౌనంగా రోదిస్తూ, రాత్రి నిద్రలేకుండా కన్నీళ్లతో ఏడుస్తూనే ఉన్నాను. ఫోనులో మాత్రం స్తవనమంజరి ప్లే అవుతూనే ఉన్నది. వాసన పోయింది అని భయంతో ‘ఏదో విధంగా ధైర్యం చేసి ఎవరికీ చెప్పకుండా అయినా సరే టెస్ట్ చేయించుకోవాలి, రూల్ అవుట్ చేసుకోకపోతే నరాలు తెగిపోయేట్టు ఉన్నాయి’ అని ఆలోచిస్తున్నాను. అలా అని ఆ కరోనా టెస్ట్ రిజల్ట్ కూడా నూరుశాతం నిజమని నమ్మకం లేదు అనుకుంటూ రకరకాలుగా బుర్ర తిరిగిపోయింది ఆ రాత్రంతా.


గురువారం ఉదయాన్నే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక పెద్దాయన అనుకోకుండా నాకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడంతో నాకు ఏదో తెలియని ఒక ధైర్యం వచ్చి, ‘ఎలా ఉన్నారు అంకుల్?’ అని రిప్లై చేశాను. నిజానికి నా పెళ్లయిన తర్వాత 12 సంవత్సరాలుగా ఆయనతో ఒకటీ అరా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ, ఒక మూడు సంవత్సరాల ముందు మాత్రం ఇంట్లో పెద్దవారికి ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడిన సమయంలో బాబా పంపినట్టుగా ఆయన ప్రత్యక్షమవటం చాలా విచిత్రంగా జరిగింది. ఒంటరిగా టెన్షన్లో ఉన్న ఆ పరిస్థితుల్లో బాబా పంపినట్టుగా ఆయన రావటం, మాట సహాయం చేయటంతో అప్పుడు కూడా ఎంతో మానసిక ధైర్యం వచ్చింది. ఇప్పుడు మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత ఆ పెద్దాయన “అమ్మా, ఎలా ఉన్నారు మీరందరూ?” అంటూ పలకరింపుగా ఒక మెసేజ్ పెట్టడంతో ధైర్యం వచ్చి, “బాగా జలుబు ఉంది అంకుల్, వాసన తెలియట్లేదు. చాలా భయంగా ఉంది” అని చెప్పాను. నేను చెప్పింది విని, “భయపడకు. నార్మల్ జలుబుకు కూడా వాసన పోవటం చాలా సాధారణమైన విషయం. జలుబు కొంచెం తగ్గగానే వాసన తెలుస్తుందిలే” అని ధైర్యం చెప్పి, రెండు టాబ్లెట్ల పేర్లు సూచించి, ‘వాటిని తెప్పించి వేసుకోమ’ని చెప్పారు. “జిందా టిలిస్మాత్ వాసన చూస్తూ ఉండు, తగ్గిపోతుంది. తగ్గకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి” అని చెప్పారు. ఆయన చెప్పిన టాబ్లెట్స్ ఒక పూట వేసుకోగానే కాస్త మెరుగ్గా అనిపించింది. ఆరోజు సాయంత్రం ఏదో పనిలో ఉండి, ప్రక్కనే ఉన్న (హిమాలయా కంపెనీ, ఆరెంజ్ స్మెల్) శానిటైజర్ డబ్బా తీసి చేతులు శుభ్రం చేసుకుంటున్న నాకు అనుకోకుండా ఆరెంజ్ స్మెల్ వచ్చింది. ఇక నాకు విపరీతమైన ఆశ్చర్యం, ఆనందం. వెళ్లి సబ్బు, షాంపూ, ఏది దొరికితే అవన్నీ వాసన చూసి చెక్ చేసుకున్నాను. పట్టరాని సంతోషం, బాబా చూపిన సమాధానం. కానీ ఒక మూల ఏదో అనుమానం, ‘వాసన పోవడమంటే కరోనా లక్షణం. పైగా నేను అత్యవసరమైన పనులకు బయటకు వెళ్లి కొన్ని రద్దీ ప్రదేశాల్లో చాలా ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఎంత జాగ్రత్త తీసుకున్నా, నాకు తెలీకుండా ఎక్కడైనా తప్పు జరిగిందా? తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తే ఇంటిల్లిపాదికీ రిస్క్ అవుతుందేమో! చాదస్తంగా, మరీ పాజిటివ్‌గా ఆలోచించి ఇంట్లోవాళ్ళను రిస్కులో పెట్టకూడదు’ అని. ఆలోచనలతో బుర్ర తిరిగిపోతోంది. ఇది కరోనా కాదని నేను కన్విన్స్ కావాలంటే ఏదైనా బలమైన కారణం దొరకాలి. అదే సమయానికి అమ్మ ఎందుకో నాకు కాల్ చేసి, “మొన్న రాత్రి వర్షంలో తడిసి వచ్చావు, జలుబు చేసేసింది చూడు. ముందు ఆవిరిపట్టు” అని చెప్తుంటే అప్పుడు గుర్తువచ్చింది. అనుకోకుండా ఫోన్ క్రిందపడి స్క్రీన్ పగలటం వల్ల వెంటనే దానిని రిపేర్ చేయించుకోవటం కోసం బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా వర్షం మొదలైంది. అయితే అది కేవలం చిరుజల్లు మాత్రమే కావడంతో ఎక్కడా ఆగకుండా, ఆగితే అందరూ గుంపుగా ఉన్నారు, రిస్క్ అవుతుంది అని పూర్తిగా తడిసేలోపే ఇంటికి వచ్చేశాను. ఆ విషయం అస్సలు గుర్తులేదు. కానీ అప్పుడు అర్థమయింది, ముఖానికి పెట్టుకున్న మాస్క్, తలకు కట్టుకున్న స్కార్ఫ్ రెండూ తడిసి జలుబుకు కారణం అయ్యాయని. పైగా ఏసీ వల్ల కూడా ఇబ్బంది అయివుంటుంది. ఇంటికి చేరిన తర్వాత పనుల హడావిడిలో ఆ విషయం ఏ మాత్రమూ గుర్తులేదు. అనుకోకుండా ఇవన్నీ అమ్మ గుర్తుచేయడంతో వెంటనే బాబా నా అనుమానాన్ని తీర్చినట్టుగా అనిపించి చాలా ధైర్యం వచ్చేసింది. ఇక నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎంత టెన్షన్ పడ్డాను! బాబా ఎంత సులభంగా నా అనుమానాన్ని, భయాన్ని పోగొట్టేశారు! నేను వరస్ట్ కేసుకు సిద్ధమై, “బాబా! నేనిక అన్నిటికీ సిద్ధం. నేను మీ బిడ్డను, ఏం చేయాలనుకుంటున్నారో మీపైననే భారం. కానీ ఇంట్లోవున్న చిన్నా పెద్దా అందరినీ మీరే చూసుకోవాలి. నాకేదైనా అయితే వాళ్ళు భయపడిపోతారు” అని ఏడ్చిన వెంటనే ఆ పెద్దాయన ద్వారా కాల్ చేసి గైడెన్స్ ఇవ్వటం, అమ్మ ద్వారా నాకు గుర్తుచేయటం ఇవన్నీ బాబా చర్యలు తప్ప మరొకటి కాదు. బాబానే చేసినట్టుగా ఒక సంకేతం ఏంటంటే, ఆరోజు గురువారం కావడం. బాబా అద్భుతాలు చాలావరకు గురువారంతోనే కూడివుంటాయని సాయిభక్తులందరికీ తెలుసు. ‘నేను బాధపడితే, ఏడుస్తుంటే బాబా చూడలేరు’ అని నాకు చాలా గొప్ప నమ్మకం. తన బిడ్డలందరి విషయంలో బాబా చేసేది ఇదే అయినా, ఎవరికి వారు ‘బాబా మనకే సొంతం’ అనే అనుభూతిలో ఉంటాం కదా, అలానే ఇది కూడా!! బాబాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పానో నాకు గుర్తు కూడా లేదు. బాబా మన జీవితంలో ఉన్నందుకు ఎన్ని జన్మలెత్తి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నా సరిపోదు.


ఇక ఈమధ్యన జరిగిన ఇంకొక సంఘటన: రెండు మూడు వారాలుగా ఎప్పుడూ లేనట్టుగా కళ్ళు తిరగడం, పదేళ్ల క్రితం ఉన్న ఒక న్యూరో ఇష్యూ‌కి సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపించడంతో మళ్లీ భయం మొదలయింది. సరిగ్గా ఇప్పుడే కరోనా వేవ్ మొదలయింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకునే పరిస్థితి కాదు. “ఏంటి బాబా ఈ టెన్షన్?” అని అనుకుంటూ భయంగానే దానికి సంబంధించి కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. రిపోర్టులు రావటం ఆలస్యం అయింది. టెన్షన్ పెరిగిపోతోంది. బాబాకు మ్రొక్కుకున్న తర్వాత రిపోర్టులు ఆన్లైన్‌లో వచ్చాయి. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కేవలం మెనోపాజ్‌కు సంబంధించిన సాధారణ బలహీనత వల్ల, లో-బీపీ వల్ల ఆ లక్షణాలు కనిపించాయి అని ఆ రిపోర్టుల్లో ఉంది. నా సందేహాన్ని మళ్లీ తొలగించారు బాబా. నాకున్న అర్థంలేని భయాలు, అనుమానాలు అన్నిటినీ బాబా ఎప్పటికప్పుడు చాలా ఓపికగా తీరుస్తూనే ఉన్నారు. ఆయనకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? ఒక బిడ్డగా నన్ను నేను ఆయనకు సమర్పించుకుని, ‘ఈ జీవితం మీదే బాబా’ అని చెప్పినా కూడా నా భారమే వారిపై వేసినట్టు తప్ప బాబా ఋణం ఏ విధంగా తీర్చుకోగలను? ఇక ఆయన్ను వేడుకునేది ఒకటే, “మేము పూర్తిగా మీ ఆధీనంలో ఉన్నాము, మా మంచి చెడులు అన్నీ మీవే బాబా. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాతో ఏ తప్పూ చేయనివ్వకండి, ఏ తప్పునూ మా దరిదాపులకు రానివ్వకండి. మీరు నీడనిచ్చే మహావృక్షం. మీ నీడలో ఉన్న మాకు ఎండ వేడి తగలదు. మీ శరణు కోరిన భక్తుల బాధ్యత మీదే కదా బాబా. మీ బిడ్డలపైన సర్వదా మీ కటాక్షం ఉండాలి. ఈ కరోనా మహమ్మారి నుండి మీ బిడ్డలమైన మమ్ములను సర్వదా రక్షించండి, మీ రక్షణ కవచంలో మమ్ము ఉంచి సదా కాపాడండి బాబా. మీ శక్తి ముందు ఏదైనా చిన్నదే. మాకు కొండంత అండగా ఉండి మీ నీడలో ఆశ్రయం కల్పించండి ఆశ్రిత సాయీ”.


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా దయతో దూరమైన ఆందోళన


సాయిభక్తురాలు శ్రీమతి నాగలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు నాగలక్ష్మి. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం మావారికి బాగా జలుబు చేసింది. ప్రస్తుత కరోనా సమయంలో ఆయనకు అలా జలుబు చేసేసరికి నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించి, "బాబా! మావారికి జలుబు తగ్గేలా చేయండి. మీ కృపతో ఆయనకు జలుబు తగ్గితే ఈ అనుభవాన్ని మీ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయతో మరుసటిరోజుకల్లా మావారి జలుబు తగ్గిపోయింది. అలాగే మా పాపకు జలుబు చేసినప్పుడు కూడా నేను బాబాను ప్రార్థించగానే బాబా దయవల్ల తన జలుబు తగ్గిపోయింది. ఈ అనుభవం చిన్నదే అయినా ఆ సమయంలో నేను చాలా ఆందోళన చెందాను. "నా ఆందోళనలను దూరం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".




13 comments:

  1. Om Sai ram 1st Sai Leela is very nice.Sai saved her.Sai baba is our mother .he takes care of all devotees.my daughter also recovered by Sai blessings.Om Sai ram 🌹🙌🙏🏽🙏🏽🙏🏽👏❤️🌹

    ReplyDelete
  2. Kothakonda SrinivasMay 21, 2021 at 9:48 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  3. చాలా మంచి అనుభవాలు పంచుకున్నారు..బాబా దయ వలన మా బాబాయ్ ఇంకా మా మేనకోడలు కోవిడ్ నుండి బయటపడారు.. ధన్యవాదాలు సాయి.. సదా అందర్నీ రక్షించండి సాయి..🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sri Sainathaya Namaha!!!🙏🙏
    Baba eppudu mammalani protect chesthune unntaru. ayanani nenu eppudu vadhalanu..

    ReplyDelete
  5. Om sai ram first leela is very nice

    ReplyDelete
  6. Om sai ram baba amma arogyam bagundali thandri please

    ReplyDelete
  7. Sai thandri na gadda poorthiga taggipovali thandri pleaseeee

    ReplyDelete
  8. అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  9. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo