సాయి వచనం:-
'నేను మీ తండ్రిని. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాలి.'

'ఎవరికి వారు సాధన చేసుకునేకన్నా అందరూ కలిసి సాధన చేసుకున్నప్పుడు, భక్తుల్లోని ప్రేమ, భక్తి జాగృతమై, ఆ ప్రభావం వల్ల మనలోని బలహీనతలను అధిగమించి, వ్యక్తిత్వపు పరిమితులను దాటి, సాధన చేసుకోవడం సులువవుతుంది' - శ్రీబాబూజీ.

భీమాజీ పాటిల్ ఖేవడే




సాయిభక్తుడు భీమాజీ పాటిల్ ఖేవడే మహారాష్ట్రలోని పూణే జిల్లా, జున్నర్ తాలూకాలోని నారాయణ్‌గాఁవ్ నివాసస్థుడు. ఆ గ్రామంలో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు కలిగివున్న సంపన్నుడతను. దయార్ద్రహృదయుడైన భీమాజీ ఆ గ్రామానికి వచ్చిపోయే సందర్శకులను ఆదరించి అన్నం పెట్టేవాడు. క్షణమైనా విచారమన్నది ఎరుగక ఎంతో సంతోషంగా సాగుతున్న అతని జీవితంలో దురదృష్టవశాత్తూ ఒక విపత్తు సంభవించింది. 1909లో హఠాత్తుగా అతను క్షయవ్యాధికి గురై తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. క్షయవ్యాధి ప్రభావం వల్ల అతను తీవ్రమైన జ్వరంతోను, విపరీతమైన దగ్గుతోను బాధపడుతూ తరచూ రక్తం కక్కుకుంటుండేవాడు. అతని శరీరమంతా వణుకుతుండేది. కడుపులో వికారంగా ఉండి అన్నపానీయాలు రుచించేవి కావు. ఈవిధంగా అతను ఎంతో బాధను అనుభవిస్తూ పూర్తిగా మంచంపట్టి చిక్కిశల్యమైపోయాడు. అన్ని రకాల ఔషధోపచారాలు, నివారణోపాయాలు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కులదేవతకు చేసిన ప్రార్థనలు నిష్ఫలమయ్యాయి. వైద్యులు, జ్యోతిష్యులు, హకీములు, ఆయుర్వేద నిపుణులు ఏమీ చేయలేకపోయారు. వాళ్లందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ కారణంగా అతని మనస్సు పూర్తిగా వికలమైపోయింది. తన శారీరక బాధలకు ఎప్పటికీ అంతమన్నదే లేదని తలచి మానసిక ప్రశాంతత కోల్పోయి జీవితంపై ఆశ కూడా వదులుకున్నాడు.  చివరికి నిరాశానిస్పృహలతో, “ఓ దేవా! నేను ఏమి చేసేది? చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమవుతున్నాయి? నేను ఎంతటి ఘోర పాపాన్ని చేశాను, ఇంతటి బాధను అనుభవించడానికి?” అని శోకించాడు. హృదయవిదారకమైన అతని ప్రార్థనకు ఆ దేవుడు కరుణతో కదిలిపోయాడు. అకస్మాత్తుగా భీమాజీకి తన స్నేహితుడైన నానాసాహెబ్ చందోర్కర్ గుర్తుకొచ్చాడు. వెంటనే తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ వివరంగా నానాకు ఒక లేఖ వ్రాశాడు. హఠాత్తుగా అతనికి నానాసాహెబ్ గుర్తుకురావడం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది కేవలం సాయిబాబా ప్రేరణ మాత్రమే. ఋణానుబంధంతో ముడిపడివున్న తమ భక్తులను వివిధ మిషలతో బాబా తమ దగ్గరకు చేర్చుకుంటారు. 

భీమాజీ పాటిల్ లేఖను చదివిన నానాచందోర్కర్ గుండె బరువెక్కిపోయింది. కరుణతో హృదయం ద్రవించిపోయింది. వెంటనే, ‘శిరిడీ వెళ్ళి శ్రీసాయిబాబాను దర్శించి వారి పాదాలు పట్టుకోమని, అదే అతని బాధకు అంతిమ నివారణోపాయమని’ తెలియజేస్తూ ఒక లేఖ వ్రాసి భీమాజీకి పంపాడు. స్నేహితుని సలహాననుసరించి భీమాజీ పాటిల్ శిరిడీ వెళ్ళడానికి దృఢనిశ్చయం చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వద్ద సెలవు తీసుకొని కొంతమంది బంధువులను వెంటబెట్టుకొని సాయిబాబా దర్శనానికి శిరిడీ ప్రయాణమయ్యాడు. వాళ్ళ బండి మసీదు ప్రవేశద్వారం వద్ద ఆగింది. నలుగురు వ్యక్తులు భీమాజీ పాటిల్‌ని మోసుకొని మసీదు లోపలికి తీసుకొని వెళ్లారు. ఆ సమయానికి నానాసాహెబ్ చందోర్కర్ అక్కడికి చేరుకున్నాడు. మాధవరావు దేశ్‌పాండే (షామా) కూడా అప్పటికే మసీదులో ఉన్నాడు. భీమాజీని చూస్తూనే బాబా, “షామా, ఇంకెంతమంది దొంగలను తెచ్చి నాపై భారం వేయబోతున్నావు? నీకిది భావ్యమా?” అని అన్నారు. బాబా మాటలు విన్న భీమాజీ బాబా పాదాలపై తన శిరస్సు ఉంచి, “సాయినాథా! నాపై కృప చూపి నన్ను కాపాడండి” అని దీనాతిదీనంగా వేడుకున్నాడు. అతని బాధను చూసిన కరుణాసముద్రుడైన బాబా జాలితో చలించిపోయి చిరునవ్వుతో, “శాంతించు! ఆందోళనలన్నీ విడిచిపెట్టు. శిరిడీలో అడుగిడిన క్షణమే నీ బాధలు ముగిశాయి. ఈ మశీదు మెట్లెక్కినంతనే నీ దుఃఖం అంతరించింది. నీవు గొప్ప ఆనందాన్ని పొందుతావు. ఇక్కడి ఫకీరు అత్యంత దయామయుడు. అతను నీ అనారోగ్యాన్ని, బాధను తక్షణమే నిర్మూలిస్తాడు. కాబట్టి ఎటువంటి చింతా పెట్టుకోక ప్రశాంతంగా ఉండు. వెంటనే నువ్వు భీమాబాయి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండు. రెండురోజులలో నీకు ఉపశమనం లభిస్తుంది” అని అన్నారు.

మృత్యుశయ్యపై ఉన్నవాడి నోట్లో అమృతం పోసినట్లు, దప్పికగొన్నవాడికి నీరు దొరికినట్లు సాయిబాబా మాటలు విన్న భీమాజీ పాటిల్‌కి ఎంతో సంతృప్తి కలిగింది. దాదాపు గంటసేపు అతను మశీదులో బాబా సమక్షంలో కూర్చున్నాడు. ఐదు నిమిషాలకొకసారి రక్తపు వాంతులు చేసుకొనే అతనికి బాబా సమక్షంలో అంతసేపు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా వాంతి కాలేదు. బాబా అతనిని పరీక్షించలేదు, కనీసం రోగమేమిటని ప్రశ్నించలేదు. కేవలం తమ కృపాదృష్టితో అతని వ్యాధి యొక్క మూలాన్ని తక్షణమే నాశనం చేశారు. తరువాత బాబా తమ స్వహస్తాలతో ఊదీ తీసుకొని కొద్దిగా భీమాజీ చేతికిచ్చి, మరికొంత అతని నుదుటిపై రాశారు. ఆ తరువాత అతని తలపై తమ అమృతహస్తాన్నుంచి ఆశీర్వదించి, ‘భీమాబాయి ఇంటికి వెళ్లమ’ని చెప్పారు. అప్పటివరకూ జబ్బుతో నీరసించిపోయి ఏమాత్రమూ నడవలేని స్థితిలో ఉన్న భీమాజీ పాటిల్ తనంతటతానే లేచి ఎవరి సహాయం లేకుండా బండి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఏదో తెలియని నూతనశక్తి తనలో సంతరించుకున్నట్లు అతను గుర్తించాడు.

భీమాబాయి ఇల్లు అప్పుడే మట్టితో చదును చేసినందువలన నేలంతా తేమగా ఉంది. అటువంటి చోటు భీమాజీకి ఎంతమాత్రమూ యోగ్యమైనది కాదు. అయినప్పటికీ అతను బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాబాయి ఇంట ఉండటానికే నిర్ణయించుకున్నాడు. తేమగా ఉన్న ఆ నేలపై రెండు గోనెసంచులు పరచుకొని వాటిపై ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ రాత్రి బాబా అతని చిన్ననాటి ఉపాధ్యాయునిగా స్వప్నదర్శనమిచ్చి అతని చేతులపై బెత్తంతో కొట్టసాగారు. ఆయనెందుకలా తనను శిక్షిస్తున్నారో భీమాజీకి అర్థం కాలేదు. మరికొంతసేపటి తరువాత భీమాజీకి మరొక కల వచ్చింది. ఆ కలలో ఎవరో ఒక అజ్ఞాతవ్యక్తి అతని ఛాతీపై కూర్చొని, అతనిని బలంగా అదిమిపెట్టి, ఒక పొత్రాన్ని అతని ఛాతీపై ఉంచి బలంగా నూరసాగాడు. విపరీతమైన బాధతో భీమాజీకి ప్రాణాలు పోతున్నట్లనిపించింది. కొద్దిసేపటికే ఆ కల ముగిసింది. ఆ కలల తరువాత ఏదో తెలియని సాంత్వన చేకూరి భీమాజీ ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే అతను అంతకుమునుపెన్నడూ ఎరుగని తాజా అనుభూతిని పొందాడు. అనారోగ్య చిహ్నాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఆ భయంకరమైన వ్యాధి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు గ్రహించిన అతని ఆనందానికి అవధులులేవు. వెంటనే బాబా దర్శనానికి పరుగుతీశాడు. బాబా ముఖారవిందాన్ని చూస్తూనే భీమాజీ ముఖం ఆనందంతో మెరిసిపోయింది, మధుర భావనలు ముప్పిరిగొనగా తన్మయత్వంలో కనులు మూతలుపడ్డాయి. కొంతసేపటికి ఆ తన్మయత్వం నుండి తేరుకుని బాబా పాదాలపై తన శిరస్సునుంచి భక్తితో నమస్కరించుకున్నాడు. ఆ తరువాత భీమాజీ శిరిడీలో శ్రీసాయి సన్నిధిలో నెలరోజులు గడిపి మహదానందంతో తిరిగి తన స్వగ్రామం చేరుకున్నాడు. తనకు ఎనలేని మేలు చేసిన నానాసాహెబ్‌కు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అప్పటినుండి భీమాజీ తరచూ సాయిబాబా దర్శనానికి శిరిడీ వస్తుండేవాడు.

బాబా చేసిన మేలుకు కృతజ్ఞతగా భీమాజీ పాటిల్ ప్రతి గురువారం ‘సాయి సత్యనారాయణ వ్రతం’ ఆచరించడం ప్రారంభించాడు. ఆరోజు అతను స్నానం చేసి వ్రతానికి సంబంధించిన అన్ని ఆచారాలు పాటించి, సత్యనారాయణ వ్రతకథ చదవడానికి బదులుగా దాసగణు రచించిన ‘అర్వాచీన భక్తలీలామృతం’లోని సాయిలీలలను చదివేవాడు. కుటుంబసభ్యులను, బంధువులను, స్నేహితులను, ఇంకా తెలిసినవారందరినీ వ్రతానికి ఆహ్వానించి ఎంతో శ్రద్ధగా వ్రతం చేసేవాడు. ఆ విధంగా భీమాజీ పాటిల్ నారాయణ్‍గాఁవ్ గ్రామంలో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు. క్రమంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ సాయి సత్యనారాయణ వ్రతమాచరించడం మొదలుపెట్టారు. భీమాజీ పాటిల్ మరణించిన తరువాత కొన్ని సంవత్సరాల వరకు అతను మొదలుపెట్టిన సాయి సత్యనారాయణ వ్రత సంప్రదాయం కొనసాగింది. కానీ ఆ తర్వాత అతని తరువాతి తరాలవారు వ్రతం గురించి మరచిపోయి, వ్రతం చేయడం పూర్తిగా మానేశారు. వాళ్లకు రకరకాల సమస్యలు చుట్టుముట్టాయి. అటువంటి స్థితిలో ఒకరోజు బాబాకు గొప్ప భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ గారి 4వ తరానికి చెందిన శ్రీనందకుమార్ రేవణ్‌నాథ్ దేశ్‌పాండే నిమోన్కర్ నారాయణ్‌గాఁవ్ గ్రామంలోని ద్వారకామాయి సాయిబాబా మందిరంలో పాదుకాపూజ కోసం వచ్చాడు. అతనిని శ్రీశివాజీ బోరడే అను సాయిభక్తుడు భీమాజీ పాటిల్ వారసుల వద్దకు తీసుకువెళ్లాడు. శ్రీనందకుమార్ నిమోన్కర్ వాళ్ళ సమస్యలు విని, వాళ్ళను తిరిగి సాయి సత్యనారాయణ వ్రతాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చాడు. దాంతో భీమాజీ పాటిల్ వారసులు సాయి సత్యనారాయణ వ్రత సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. అంతటితో వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి సుఖంగా ఉన్నారు.

భీమాజీ పాటిల్‌కు చెందిన పురాతన వాడా(ఇల్లు)ను పడగొట్టి ఆ ప్రదేశంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. అందులోని ఒక భాగాన్ని వారి పూర్వీకుల గృహంలా మలచి, ఆ ఇంటిలోనే ఒక చిన్న సాయిబాబా మందిరం నిర్మించారు. భీమాజీ పాటిల్ కొడుకు నారాయణ్ భీమాజీ ఖేవడే పాటిల్. అతని కొడుకు ప్రకాష్ నారాయణ్ భీమాజీ పాటిల్. కొంతకాలం తరువాత అతను స్వర్గస్తుడయ్యాడు. ప్రస్తుతం అతని భార్య శ్రీమతి ఉష తన ముగ్గురు కుమారులు (సంజయ్, అజయ్, వైభవ్) మరియు ఒక కోడలితో కలిసి ఆ ఇంటిలో నివసిస్తున్నారు.

భీమాజీ పాటిల్ కుటుంబీకులు 2013లో ‘సాయి తేరా ధాం మందిర్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించారు. ఆ మందిరం లోపలి గోడపై శ్రీసాయి సచ్చరిత్ర 13వ అధ్యాయాన్ని (క్షయవ్యాధి బారినుండి భీమాజీ పాటిల్‌ను బాబా కాపాడిన లీల అందులో పొందుపరచబడివుంది) చెక్కించారు. ఈ మందిరం భీమాజీ పాటిల్ పూర్వీకుల ఇంటినుండి కేవలం 7 నిమిషాల ప్రయాణదూరంలోనే ఉంది. బాబా తాము సమాధి చెందడానికి కొద్దిరోజుల ముందు భీమాజీ పాటిల్‌కు ఒక ఎద్దును ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఎద్దు మరణించింది. దానిని ద్వారకామయి సాయిబాబా మందిరం ప్రాంగణంలో సమాధి చేశారు. దాని గుర్తుగా ఆ సమాధిపై ఒక నల్లరాతి నంది విగ్రహాన్ని స్థాపించారు.

సాయిభక్తుల ప్రయోజనార్థం భీమాజీ పాటిల్ కుటుంబసభ్యుల చిరునామా, ఫోన్ నెంబర్ మొదలైన వివరాలను ఈ క్రింద పొందుపరచడమైనది.

Sai Mahabhakta Bhimaji Patil Khebade House 
C/o.Sanjay Prakash Khebade Patil 
Narayangaon-410 504, 
Junnar Taluk, Pune District, 
Maharashtra, India 
Contact Number: +91 99600 69073
Email Address: sanjaykhebade@gmail.com


18 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. SaiNadha 🙏🙏🙏🙏 🌹🌺🌻🌼 Entati karuna niku naku kudha tappaka help chestav .I believe you baba

    ReplyDelete
    Replies
    1. సాయి బాబా మనందరికీ ఆయురారోగ్య అష్టఐశ్వర్యలను ప్రసాదిస్తారు జైజైజై సాయిరాం బాబా దేవా థాంక్యూ సాయిరాం బాబా దేవా నీవే కలవు నీవే తప్పా మాకెవరీ భువిలో...

      Delete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః🙏

    ReplyDelete
  4. , జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  5. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🙏🕉😊❤😀

    ReplyDelete
  7. ఓమ్ సాయిరాం.. భీమాజీ పాటిల్ గొప్ప భక్తుడు.. ఆయన సాయిబాబా వరాలను పొందిన విధంగా నేను కూడా అనేక అత్యంత పెను ప్రమాదాల భారి నుంచి కూడా శిరిడి సాయినాధుని ఆశీస్సుల తో బయట పడి సాయిరాం దయ తో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యం తో ఉన్నాము. జై జై జై సాయిరాం.. థాంక్యూ సాయిరాం బాబా దేవా.. 🙏🙏🕉️✡️🙏🙏

    ReplyDelete
  8. థాంక్యూ సాయిబాబా

    ReplyDelete
    Replies
    1. జై జై జై సాయిబాబా థాంక్యూ సాయిబాబా దేవా...

      Delete
  9. సాయిరాం బాబా దేవా.. నీ మహిమలు అమోఘం.. మీ అద్భుతమైన లీలలు మాకు సాయి అమృతం.. మా జీవితం లో మీ దయ తో గొప్ప గొప్ప అనుభవాలు అనేకమైనవి పొందినాము.. సాయిబాబా దేవా నీ నామస్మరణ గొప్ప దివ్యఔషాదం.. మా అనారోగ్యం రూపుమాపి నిర్మూలించి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యం ప్రసాదించినందుకు థాంక్యూ .. మీయొక్క అద్భుతమైన మహిమలు, అమోఘమైన లీలలు ప్రపంచం అంతటా ప్రచారం చేసుకునే గొప్ప సువర్ణవకాశం ప్రసాదించి నందుకు కృతజ్ఞతలు సాయిరాం దేవా.. హృదయ పూర్వక నమస్కారాలు శత కోటి సాష్టాంగ ప్రణామములు సాయిరాం బాబా దేవా.. బాబా మా అనారోగ్యం పూర్తిగా రూపుమాపి నిర్మూలన చేసి మీ దివ్యమైన పాదాల యందు నిశ్చలమైన భక్తి శ్రద్ధ లను కలిగి ఉండే లాగా దీవెనలు అందించు బాబా దేవా..

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  11. Baba valla Naku job vachidi

    ReplyDelete
  12. ఓం శ్రీ సద్గురు సాయి నాధ్ మహా రాజ్ కి జై

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. Baba meeru naaku enno echaru enno badhalu nunchi kapaderu, naa arogyam kuda sarichesthunnaru chala chala thanks sai natha intaku minchi eam cheppagalanu

    ReplyDelete
  15. Baba intlo ofce lo situations anni bagunde la chesi naaku manashantini evvandi baba pls, ofce lo work from home echinanduku chala thanks baba, amma nannalaki naaku andariki ayur arogyalani ashtaishwaryalani prasadinchandi baba pls.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo