సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఫెనీబాయి & కవాస్‌






1914వ సంవత్సరంలో ఫెనీబాయి అనే పార్సీ మహిళ తన కొడుకు కవాస్‌తో కలిసి శిరిడీ వచ్చింది. ఆ బాలుడు శ్రీకృష్ణుడిలా చాలా అందంగా ఉండేవాడు. ఉంగరాల జుట్టు, నల్లని అందమైన కళ్ళతో ఉన్న ఆ బాలుని చూసిన వారెవరైనా ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు స్వర్గాన్ని వదిలి భూమికి వచ్చాడని భావించేవారు. ఫెనీబాయి తన కొడుకుతో మసీదుకు వెళ్లి బాబా దర్శనం చేసుకుంది. బాబా ఆమెతో, “సోదరీ, నా అనుమతి లేకుండా ఈ ద్వారకామాయి నుండి బయటకు అడుగుపెట్టవద్దు” అని అన్నారు. తరువాత ఆమె కొడుకును తమ గద్దెపై ఉంచమని చెప్పారు. మధ్యాహ్న ఆరతి పూర్తయి, ఊదీ మరియు ప్రసాద పంపిణీ కూడా ముగిసింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకు భోజనానికి వెళ్ళారు. కొద్ది నిమిషాల క్రితం ఎంతోమంది భక్తులతో రద్దీగా ఉన్న సాయి దర్బారు ఇప్పుడు ఖాళీగా ఉంది. మసీదు తెరలు దించారు. బాబా తమ భోజనాన్ని ఆరంభించారు. అయినప్పటికీ ఫెనీబాయికి వెళ్లేందుకు బాబా అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆమెలో అసహనం పెరగసాగింది.

బాబా తమ భోజనాన్ని పూర్తిచేసి మసీదు చివరికి వచ్చారు. షామా ఆయన చేతులు కడిగి, తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఇచ్చాడు. తరువాత బాబా వెళ్లి తమ గద్దెపై కూర్చున్నారు. రాధాకృష్ణమాయి బాబా కోసం కిళ్ళీ పంపింది. బాబా ప్రేమతో దానిని స్వీకరించారు. అప్పుడు ఫెనీబాయి నెమ్మదిగా బాబా కాళ్ళు ఒత్తడం ప్రారంభించింది. బాబాకు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలుసు. అందువల్ల ఆయన ఫెనీబాయిని మసీదు నుండి వెళ్ళడానికి అనుమతించలేదు.

సరిగ్గా మూడు గంటల సమయంలో మసీదు గోడపై ఎవరో దూకినట్లు ఒక శబ్దం వినిపించింది. అటువైపు చూసిన ఫెనీబాయి, సింహాన్ని చూసి  భయకంపితమైన ఆవులా భయంతో వణికిపోయింది. చింపిరి జట్టు, పెద్ద కళ్ళతో అతిభయంకరమైన ముఖకవళికలు గల ఒక మహిళ మసీదు గోడపై ఉంది. ఆమె రెండు చేతులు చాలా సన్నగా, పొడవుగా ఉన్నాయి. ఆమె చేతివేళ్ల గోళ్లు కూడా పొడవుగా ఉండి, దేహం కాటుక కొండలా కారు నలుపురంగులో ఉంది. ఆమె గోడపైనుండి దూకుతూనే కవాస్‌ను లాక్కోవడానికి పరిగెత్తింది. అంతలో భయానికే భయం పుట్టేలా బాబా మండే కళ్ళతో భయంకరమైన రూపుదాల్చి ‘సబూర్’ అని పెద్దగా అరిచారు. కానీ ఆమె బాబా మాట వినిపించుకోకుండా కవాస్ వైపు వెళ్ళసాగింది. బాబా తమ ఆసనం మీద నుండి లేచి ఆమెను ఒక తన్ను తన్నారు. ఆమె పెద్దగా కేకలు పెడుతూ వెళ్లిపోయింది. కవాస్ తన కళ్ళతో అంతా చూశాడు. కానీ, తను చిన్నవాడవటంతో బాబా దయవల్లే తాను బ్రతికి ఉన్నాననీ, బాబా సంరక్షణలో ఉన్న తనకు ఎవరూ, ఎప్పటికీ, ఏ హానీ తలపెట్టలేరనీ ఆ సమయంలో తనకు తెలియదు. 

Source:  గుజరాతీ పుస్తకం 'సాయి సరోవర్'.

7 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. Entha babgundho baba vaaripaina choopina prema rakshana……

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo