- కరుణతో బాధను తీర్చిన బాబా
- నా బాధ విన్నారు, నా సమస్యను పరిష్కరించారు బాబా
కరుణతో బాధను తీర్చిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా మనతో పంచుకుంటుంన్నారు:
ఓం శ్రీ సాయిరామ్! సాయిబంధువులకు, సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను గతంలో కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. దేవుడు ఇచ్చిన మా అన్నయ్య నాతో మాట్లాడితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని వాగ్దానం చేశాను. కొన్ని మ్రొక్కులు కూడా మ్రొక్కుకున్నాను కానీ, వ్యక్తిగత ఇబ్బందుల వల్ల ఆ మ్రొక్కులు తీర్చలేకపోయాను. ‘ఇంక అన్నయ్య నాతో మాట్లాడరు’ అనుకుని ఆ విషయాన్ని జీర్ణించుకోవడం అలవాటు చేసుకున్నాను. అయినప్పటికీ, “అన్నయ్య తన ఆరోగ్యసమస్యల నుండి బయటపడాలి” అని బాబాను ప్రార్థించేదాన్ని. ఆశ్చర్యంగా, అక్టోబరు 7వ తేదీన అన్నయ్య నాకు మెసేజ్ చేసి తనకు పెళ్లి కుదిరిన విషయం చెప్పారు. తన నుండి వచ్చిన మెసేజ్ చూసి నేను ఎంతో ఆనందించాను. నేను మ్రొక్కులు తీర్చలేకపోయినా ఎంతో కరుణతో బాబా నా బాధను తీర్చారు.
ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల అక్టోబరు 14వ తేదీన మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి పదివేల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగింది. అంతటి ప్రమాదం నుండి కేవలం బాబా దయవల్లే మేమంతా క్షేమంగా బయటపడ్డాము. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ప్రస్తుతం మాది ఉమ్మడి కుటుంబం కావటం వల్లా, ఇంకా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్లా మా ఇంట్లో గొడవలు పెరిగాయి. కానీ, ఏం జరిగినా బాబా నాకు తోడుగా ఉంటారనే నమ్మకం మాత్రం నాలో పెరిగింది. “బాబా! అనుకున్న విధంగా పారాయణ చేయలేకపోతున్నాను. నా కోపాన్ని, బద్ధకాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి బాబా. బాబా! నాకు, మా కుటుంబానికి, దేవుడు ఇచ్చిన మా అన్నయ్యకు సదా మీ ఆశీస్సులు ప్రసాదించండి. త్వరలో నా మ్రొక్కులు తీర్చే శక్తిని నాకు ఇవ్వండి”.
ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఇబ్బందులను ఇక్కడ చెప్పలేను. బాబా కృపతో త్వరలోనే వాటినుండి బయటపడతాననే నమ్మకం కలుగుతోంది. బాబా కృపతో ఆ ఇబ్బందుల నుండి బయటపడినప్పుడు ఆ అనుభవాలను కూడా ఈ బ్లాగులో తప్పక పంచుకుంటాను. ఓం సాయిరామ్!
పూనా నుండి సాయిభక్తురాలు విజయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిరాం! నా పేరు విజయ. నేను సాయిభక్తురాలిని. ముందుగా ఈ బ్లాగ్ నడుపుతున్నవారికి నా నమస్కారములు. నాకు ఇంచుమించు పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండి బాబా తెలుసు. నాకు తల్లి, తండ్రి అన్నీ బాబానే. నా జీవితంలో బాబా పాత్ర చాలా ఎక్కువ. బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిలోనుండి ఈమధ్యనే నాకు జరిగిన మేలును మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.
ఈమధ్య లాక్‌డౌన్ మొదలయ్యాక నాకు ఆడవారికి వచ్చే నెలసరి విషయంలో సమస్య వచ్చింది. నెలకొకసారి రావాల్సిన పీరియడ్స్ నాకు 15 రోజులకొకసారి రావడం మొదలైంది. దాంతో నేను చాలా ఇబ్బందిపడ్డాను. అయితే నేను క్రితం నెల నా సమస్య గురించి బాబాకు చెప్పుకుని, “బాబా! మీరు ఈ సమస్యను పరిష్కరిస్తే నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఆ తరువాత నుండి ప్రతిరోజూ స్నానం చేయగానే ముందుగా బాబాకు నమస్కరించుకుని, బాబా ఊదీని నుదుటన పెట్టుకుని, నా సమస్యను బాబాకు చెప్పుకునేదానిని. బాబా అనుగ్రహంతో ఈ నెల ఏ సమస్యా లేకుండా సరైన సమయానికి, అంటే నెలరోజులకు నాకు పీరియడ్స్ వచ్చాయి. బాబా నా బాధ విన్నారు. నా సమస్యను పరిష్కరించారు. “థాంక్యూ బాబా! థాంక్యూ సో మచ్! మీ దయ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను బాబా. ఐ లవ్ యు సో మచ్ బాబా! నేను ఏమైనా తప్పులు చెప్పివుంటే నన్ను మీ బిడ్డగా భావించి క్షమించండి బాబా!”
త్వరలోనే బాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం నిజం, బాబానే మనకి తోడు-నీడ.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
om sai ram to day is my son wedding day.baba please bless both with long life.bless my hubby with long life
ReplyDeleteJai sairam
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba please help me
ReplyDeleteOm Sairam
ReplyDeleteBaba please baba ma mother urology problem teerchu thandri na anubhavam tondarlo sai bhaktulatho panchukuntanu
ReplyDeleteKapadu saideva ne raka kosam eduruchistunamu thandri
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete