సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 581వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:

  1. ప్రతీ విషయంలో నన్ను ఆదుకుంటున్న బాబా
  2. బాబా ఆశీస్సులతో జరిగిన అన్నప్రాసన
  3. బాబాను ప్రార్థించినంతనే జ్వరం తగ్గుముఖం


ప్రతీ విషయంలో నన్ను ఆదుకుంటున్న బాబా

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

సాయిరాం,

ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదములు. బాబా నాపై చూపించిన కృప అపారం. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియటం లేదు. బాబా చెప్పినట్టు నన్ను పిచ్చుకని లాగినట్టు తమ దగ్గరికి తీసుకున్నారు. నేను ఎన్నిసార్లు సాయి పాదాలు వదిలేసినా ఆయన నన్ను వదలలేదు. తండ్రి తన బిడ్డల్ని వదులుకోడుగా! అందుకే, "నేను ఎవరినీ మధ్యలో విడవను" అని బాబా అంటారు.

మేము యు.ఎస్ లో నివాసముంటున్నాం. బాబా దయవల్ల నాకు ఒక చక్కని బాబు పుట్టాడు. బాబు కడుపులో ఉన్నప్పుడొకసారి చెకప్ కి వెళితే, అల్ట్రాసౌండ్ చేయించారు. రిపోర్టులో బాబు తలలో వెంట్రికల్స్ పెద్దగా ఉన్నట్లు వచ్చింది. గైనకాలజిస్ట్ ఆ రిపోర్టులు చూసి, "వాటిని నియనాటల్ స్పెషలిస్ట్ పరిశీలనకు పంపుదాం, వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఏమన్నా తేడా ఉంటే, బాబు పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలో చెప్తార"ని చెప్పింది. దాంతో నేను భయపడి బాబాను ఎంతగానో ప్రార్థించాను. బాబా దయవల్ల సరిగ్గా వారానికల్లా వెంట్రికల్స్ దాదాపు సాధారణ స్థితికి వచ్చాయి. గైనకాలజిస్ట్ ఆశ్చర్యపోతూ, "భయపడేంత ఏమి లేదు. కొద్దిగా తేడా ఉంది. బాబు పుట్టేనాటికి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. బాబు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు. మీరు ఇక రావాల్సిన అవసరం లేదు" అన్నారు. నిజంగా ఇది మిరకిల్. అలా చాలా విషయాల్లో బాబా నాకు తోడుగా ఉన్నారు. కరోనా వల్ల ఫ్లైట్లు ఆపేసినప్పుడు మా అమ్మ USA రావటానికి బాబా సహాయం చేసారు. ఈమధ్య బాబుకి రెండు నెలలు ఉన్నప్పుడు బాబు గుండెలో ఏదో శబ్దం వస్తుందని పిల్లల కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అంత చిన్నబాబుకి ఎక్స్ - రే, ఈసిజీ, ఎకో మొదలైనవన్నీ చేసారు. ఎంతో భయమేసి బాధతో బాబాని ప్రార్థించి, రిపోర్టులు వచ్చేదాకా బాబా నామం, ఈ బ్లాగులో నేను చూసిన 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ గడిపాను. బాబా దయవల్ల అంతా నార్మల్ అని చెప్పి, బాబుకి ఆరు నెలలు వచ్చాక బాబుని తీసుకుని రమ్మని" అన్నారు. ఇలా బాబా ప్రతీవిషయంలో నన్ను ఆదుకున్నారు. ఆయన మననుండి ఏమీ ఆశించరు, కేవలం 'తమపై విశ్వాసముంచమ'ని చెప్తారు. "ధన్యవాదాలు తండ్రి".

సాయిరాం!

సాయి బిడ్డ.


బాబా ఆశీస్సులతో జరిగిన అన్నప్రాసన

సాయిభక్తురాలు పావని ఇటీవల బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ సాయిరామ్. నేను ఇదివరకు ఒక అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా  మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నా పేరు జీ.పావని. మా బాబు పేరు నాగసాయి శ్రీవిష్ణు భరద్వాజ్. నేను మా బాబుకి ఆరవనెలలో అన్నప్రాసన చేయాలని అనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు 'పిల్లాడు పాకేసమయంలో చేయాల'ని ఒప్పుకోలేదు. "నా దగ్గర బాబుకి సరిపడా పాలు లేవు. పోత పాల వలన వాడికి ఫీడింగ్ సరిపోవడం లేద"ని నేను చెబితే ఎవరూ నా మాట వినలేదు. ఇప్పుడెలా అని నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, అప్పటికే ఆరవనెల చివరిలో ఉంది. అప్పుడుగాని అన్నప్రాసన చేయకపోతే ఎనిమిదవ నెల వచ్చేవరకు చేసే వీలులేదు. అటువంటి సమయంలో నేను బాబా మీద భారం వేసి, మా బావగారికి విషయం చెప్పాను. అతను నేను చెప్పినదానికి సమ్మతించి, మా అత్తగారిని, మా వారిని ఒప్పించారు. సాయిబాబా ఆశీస్సులతో 2020, సెప్టెంబర్ 13, ఆదివారంనాడు పెన్నాడ నాగమ్మ గుడిలో అన్నప్రాసన చాలా బాగా జరిగింది. అంతా బాబా, అమ్మవారి దయ. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరి సమక్షంలో బాబాకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. "థాంక్యూ వెరీ మచ్ బాబా".


బాబాను ప్రార్థించినంతనే జ్వరం తగ్గుముఖం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ప్రియమైన సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు బాబా ఆశీస్సులు. ఇటీవల నాకు కలిగిన అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నాకు జ్వరం వచ్చింది. ఇది కరోనా సమయమని అందరికీ తెలిసిందే! అందువలన నాకు చాలా ఆందోళనగా అనిపించి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టి, బాబా ఊదీ తీసుకున్నాను. ఇంకా, "రెండురోజుల్లో నా జ్వరం తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని నేను బాబాను వేడుకున్నాను. బాబాను ప్రార్థించినంతనే జ్వరం తగ్గుముఖం పట్టి నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇదంతా బాబా వల్లే జరిగింది. ఆయన తన బిడ్డల్ని సదా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రార్థించి, శ్రద్ధ, సబూరీలను కనబరుస్తామో బాబా మన ప్రార్థనలను, అభ్యర్థనను విని మనల్ని ఆశీర్వదిస్తారు.

ఓం శ్రీ సాయినాథాయ నమః.



7 comments:

  1. om sai ram please bless us from corona virues

    ReplyDelete
  2. Baba maku andariki arogyani prasadinchu thandri

    ReplyDelete
  3. సాయిరాం!

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయినాథాయ నమః.

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయినాథాయ నమః.

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo