- ఎంతెంత దయ నీది ఓ సాయీ!
- అనుక్షణం బాబా తోడుగా ఉంటున్నారు
ఎంతెంత దయ నీది ఓ సాయీ!
సాయిభక్తురాలు వేదవతి తనకు, తన ఆప్తులకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిరాం! నా పేరు వేదవతి. నేను గవర్నమెంట్ హైస్కూల్లో బయాలజీ టీచరుగా పనిచేస్తున్నాను. పిలిస్తే పలికే అమ్మలాంటి సాయి ఈమధ్య మమ్మల్ని, మా ఆప్తులని ఆదుకున్న రెండు సంఘటనలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
1. మా వీధిలో ఒక గుడి పూజారివాళ్ళ గురువుగారి అబ్బాయికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ అబ్బాయి అందరితో కలవకుండా తనని ఒక గదిలో ఉంచారు. మా ఇంట్లోనూ, వాళ్ళింట్లోనూ పనిచేసే పనావిడకు కరోనా సోకిన అబ్బాయి ఆ ఇంట్లో ఉన్నాడని తెలియక, ఒకరోజు వాళ్లింట్లో పని చేసి, ఆ తరువాత మా ఇంటికి కూడా వచ్చి పని చేసింది. రెండవరోజు బాబా ఏం చేశారో తెలుసా ఫ్రెండ్స్? అసలు ఊహించలేం. కరోనా పాజిటివ్ వచ్చినతని తండ్రి కరోనా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఆందోళనపడుతుంటే, మా ఆలయ పూజారి ఆయనకు చెప్పారట, ‘శ్యామ్‌ని(మావారిని) సలహా అడగండి’ అని. దాంతో ఆయన మావారికి ఫోన్ చేసి, “మా అబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చింది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి” అని మావారిని సలహా అడిగారు. ఆయన అలా ఫోన్ చేసి సలహా అడగటం వలన విషయం తెలిసిన మేము వెంటనే మా ఇంట్లో పనిచేసే ఆవిడను వాళ్లింట్లోనూ, మా ఇంట్లోనూ కూడా పని మాన్పించాము. ఆ వెంటనే అతని తల్లిదండ్రులిద్దరికీ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే, పనావిడను మాన్పించకపోతే మాకు, పనావిడకు కూడా కరోనా సోకి ఉండేదేమో!? సరైన సమయానికి ఆ ఫోన్ కాల్ ద్వారా బాబా మమ్మల్ని హెచ్చరించి కాపాడినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆ తరువాత కొద్దిరోజులకు బాబా దయవల్ల ఆ అబ్బాయి, అతని తల్లిదండ్రులు అందరూ చక్కగా కోలుకున్నారు.
2. నా స్నేహితురాలు పేదరికంలో ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చదివి టీచరుగా ఉద్యోగం తెచ్చుకుంది. తన తల్లిదండ్రులకు తను ఒక్కతే కూతురు. అందువల్ల తన వివాహమయ్యాక వాళ్ళిద్దరినీ తనతోనే ఉంచుకుని చూసుకుంటుంది. ఈమధ్య తను రోజూ స్కూలుకు వెళ్లటం వల్లనేమో వాళ్ల నాన్నగారికి జ్వరం వచ్చింది. టైఫాయిడ్ అనుకుని 5 రోజుల పాటు ఆయన వీళ్లతో కలసే ఉండి టైఫాయిడ్ తగ్గటానికి మందులు వాడారు. 5 రోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి అనుమానం వచ్చి కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఆ పెద్దాయన పాపం చాలా ఆందోళనపడ్డారు. ఆయనను శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. జెమ్స్ ఆసుపత్రి అంటే క్రిటికల్ కండిషన్లో ఉన్నవారిని అక్కడ జాయిన్ చేస్తారు. తరువాత ఇంట్లో అందరూ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షా ఫలితాలు వచ్చేలోపు తమకు కూడా కోవిడ్ సోకుతుందేమోనన్న భయంతో నా స్నేహితురాలు చిన్నవాళ్ళైన తన పిల్లలను చూస్తూ ఏడిచేదట. ఆ సమయంలోనే నా స్నేహితురాలికి తన స్నేహితురాలు ఒకరు ‘సాయి నవగురువార వ్రతం’ గురించి చెప్పింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఆయనతో కలసి వారం రోజులు ఉన్నప్పటికీ బాబా దయవలన నా స్నేహితురాలికి, తన భర్తకు, పిల్లలకు, తన తల్లికి నెగెటివ్ వచ్చింది.
ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు ఆయన్ని పరీక్షించి, “వాయునాళం మొత్తం మూసుకుపోయిందని, కండిషన్ ప్రమాదకరంగా ఉందని, తమ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని వెంటిలేటర్ సదుపాయం కల్పించినప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి భరోసా ఇవ్వలేమ”ని చెప్పారట. నా స్నేహితురాలి భర్త 10,000 రూపాయల జీతానికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పని చేస్తారు. ఈ అమ్మాయి జీతమే ఇంటికి ఆధారం. కాబట్టి అంత ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయలేక తన తండ్రిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఆ తరువాత నా స్నేహితురాలు తన తండ్రికి ఆరోగ్యం ప్రసాదించమని బాబాను ప్రార్థించి, సాయి నవగురువార వ్రతం ప్రారంభించింది. రెండవవారం వ్రతం పూర్తి చేసిన వెంటనే, “అదృష్టవశాత్తూ కరోనా ప్రభావాన్ని తగ్గించే ఇంజక్షన్లు దొరికాయి, మీ నాన్నగారిని కాపాడగలిగాము” అని హాస్పిటల్ నుంచి తనకు ఫోన్ వచ్చింది. వాయునాళం మూసుకుపోయి వెంటిలేటర్ పెట్టినప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కోలుకున్నారంటే అది కేవలం బాబా అనుగ్రహమే. బాబా తప్ప ఈ పని ఇంకెవరు చేయగలరు? ఇప్పుడు నా స్నేహితురాలు సాయి నవగురువార వ్రతం 6 వారాలు పూర్తి చేసుకుంది. ఇంకా మూడు వారాలు ఉన్నాయి. బాబా అనుగ్రహంతో తను ఆ మూడు వారాలు చక్కగా వ్రతం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
అనుక్షణం బాబా తోడుగా ఉంటున్నారు
విశాఖపట్నం నుంచి సాయిభక్తురాలు శ్రీమతి డి.విజయలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులందరికీ ఓం సాయిరాం! నా పేరు విజయలక్ష్మి. మేము విశాఖపట్నంలో ఉంటున్నాము. బాబా మా కుటుంబాన్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నారు. మాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ చదువులు, ఉద్యోగాల విషయంలో నేను కోరుకున్నట్లే బాబా అన్నీ ప్రసాదించారు. వాటిలో, మా పెద్దబ్బాయి విషయంలో జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. తనకు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం వచ్చింది. తను ఆ ఉద్యోగంలో జాయినయ్యాడు. 5 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత ఎం.బి.ఏ. చేస్తానన్నాడు. తను ఎం.బి.ఏ. ప్రవేశ పరీక్షలు వ్రాస్తున్నప్పుడు తనకు ఎం.బి.ఏ.లో సీటు రావాలని నేను సాయి నవగురువార పూజ మొదలుపెట్టాను. 9 వారాలు పూర్తయ్యేటప్పటికి తనకు గ్లోబల్ ఎం.బి.ఏ.లో సీటు ప్రసాదించారు బాబా. అలాగే ఎం.బి.ఏ. కంప్లీట్ అయ్యాక క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఉద్యోగం రావాలని నవ గురువార పూజ చేశాను. బాబా అనుగ్రహంతో క్యాంపస్ సెలెక్షన్స్‌లో తనకు దుబాయిలో ఉద్యోగం వచ్చింది. మేమంతా ఎంతో సంతోషించాము. ఉద్యోగంలో చేరి 5 నెలలు గడిచింది. ఈలోగా కరోనా లాక్‌డౌన్ కారణంగా తనను ఉద్యోగంలో నుంచి తీసేశారు. మేము తన చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాము. ఉద్యోగం వచ్చాక ఇ.ఎం.ఐ. కూడా కట్టడం మొదలుపెట్టాము. అనుకోకుండా ఇప్పుడీ సమస్య. దాంతో మా అబ్బాయి మరలా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. నేను సాయి నవగురువార పూజ మొదలుపెట్టాను. సరిగ్గా 5 వారాలు పూర్తయ్యేటప్పటికి 2 కంపెనీల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. 9వ వారం పూజ పూర్తయ్యేటప్పటికి బాబా దయవల్ల మా అబ్బాయికి ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బాబా మాపై చూపిన అనుగ్రహానికి మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ విధంగా అనుక్షణం బాబా మాకు తోడుగా ఉంటున్నారు. మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నా ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మీ అందరితో నా అనుభవాన్ని పంచుకోవటం నాకు సంతోషంగా ఉంది.
Om Sairam
ReplyDeleteBaba dani manusu marchu thandri manchi buddhi ni prasadinchu thandru
ReplyDeleteBaba sada mamalini rakshinchu thandri
ReplyDeleteBaba ma mother health problem tondarga cure cheyi thandri
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయసాయి
ReplyDelete🌼🌺🙇♂️🙇♂️🙇♂️🌼🌺
ReplyDelete