సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

రాజారామ్ అప్పాసేథ్ వర్ధమ్





1899వ సంవత్సరంలో రాజారామ్ కొంకణ తీరంలోని కూడల్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. 1914లో అతని అన్నావదినలు శిరిడీ వెళ్లాలని తలచి తమతో పాటు రాజారామ్‌ని తీసుకెళ్లారు. అలా అతను 15 సంవత్సరాల వయసులో మొదటిసారి బాబా దర్శనభాగ్యాన్ని పొందాడు. అతను అప్పటి తన స్మృతులిలా చెప్పాడు: "బాబా సుమారు ఆరడుగుల ఎత్తు ఉండేవారు. ఆయన తెల్లని కఫ్నీ, తలకి ఒక తెల్లని వస్త్రాన్ని ధరించి అటు ఇటు తిరుగుతుండేవారు. ఆ సమయంలో శిరిడీలో ఒక పఠాన్ ఉండేవాడు. అతనెప్పుడూ బాబా చెంత ఉండేవాడు. కొన్నిసార్లు బాబా అతనిపై కోప్పడేవారు" అని.

ఇంకా ఇలా చెప్పాడు: "నిజంగా ఎవరైనా ఒక వ్యక్తి పేదవాడైవుండి, బాబాని భిక్ష అడిగితే, బాబా తమ జేబునుండి కొన్ని నాణేలు తీసి అతనికి ఇచ్చేవారు. దాంతో బాబా వద్దకు రావడం వెనుక గల అతని అభీష్టం నెరవేరేది. ఒకసారి కొంతమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చి సాఠేవాడాలో బస చేశారు. వారిలో ఒకతను ఆరోజు ఏకాదశి అని ద్వారకామాయికి వెళ్ళడానికి సంశయించాడు. మిగతా భక్తులు అతనికి నచ్చజెప్పి బుజ్జగించడంతో చివరకు వాళ్లతో ద్వారకామాయికి వెళ్ళడానికి అంగీకరించాడు. అది మధ్యాహ్న సమయం. సాధారణంగా బాబా ఆ సమయంలో నిమ్మరసం త్రాగుతారు. కాబట్టి భక్తులు ఒక పెద్ద గ్లాసుతో బాబాకు నిమ్మరసం ఇచ్చారు. బాబా రెండు గుక్కల నిమ్మరసం త్రాగిన తరువాత ఆ భక్తుని ముందు గ్లాసు ఉంచి త్రాగమన్నారు. మళ్ళీ అంతలోనే, "అరె, ఈరోజు ఏకాదశి, కాబట్టి ఇది నీకు అవసరం లేదు" అని గ్లాసు వెనక్కి తీసుకొని త్రాగేశారు. 'తాను ఏకాదశిని నిష్ఠగా పాటిస్తానని బాబాకు ఎలా తెలుసా?' అని ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. మేము ఇంటికి తిరిగి వెళదామనుకున్నప్పుడు బాబా మరుసటిరోజు వెళ్ళమన్నారు. మేము ఆయన ఆదేశానుసారం ఆరోజు అక్కడే ఉండిపోయాము. మా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయాక మరుసటిరోజు వెళ్ళడానికి బాబా మాకు అనుమతి ఇచ్చారు. మేము బయలుదేరి కోపర్‌గాఁవ్ వెళుతుండగా ఒక నల్లకుక్క మమ్మల్ని వెంబడించింది. మేము రైలు వద్దకు చేరుకున్నాక అది అదృశ్యమైంది. మేము రైలు ఎక్కి కూర్చున్నంతనే ఒక అపరిచిత వ్యక్తి మా దగ్గరకొచ్చి మాకు టికెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు".

Ref: సాయి చింతన్;  29 సెప్టెంబర్ 1990 (విజయదశమి సంచిక )
సోర్స్: డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. సమకాలీన భక్తుల గురించి చదువుతుంటే ఆనందానుభూతి కలుగుతుంది. ఓం శ్రీ సాయిరాం🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo