సాయి వచనం:-
'ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి!'

'సాయిభక్తులకు శ్రీసాయినాథుడే దైవం, సాధన, మార్గం, గమ్యం' - శ్రీబాబూజీ.

నమ్ముకున్న భక్తుని కోసం వడ్డీవ్యాపారి మనస్సుని మార్చిన బాబా



ఒక బాబా భక్తుడు చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. అతనికి డబ్బిచ్చిన వడ్డీవ్యాపారి చాలా అసహనానికి గురై తన డబ్బు తనకివ్వమని ఆ భక్తునికి కోర్టు వారెంట్ పంపించాడు. కానీ ఆ భక్తుని దగ్గర ఆ సమయంలో డబ్బులేదు. కనీసం ఆ మొత్తాన్ని సమకూర్చుకునే మార్గాలు కూడా అతనికి లేవు. ఏదేమైనా అతను మాత్రం డబ్బు పొందగలననే నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇతని పరిస్థితి ఇలా ఉంటే, వడ్డీవ్యాపారి ఏమాత్రం వేచి ఉండక అతనిని ఇబ్బందిపెట్టడం మొదలుపెట్టాడు. అటువంటి స్థితిలో ఒకరోజు కొంతమంది సాయిభక్తులు ఆ భక్తుని ఇంటికి వచ్చి, "ఇంట్లో బాబా చిత్రపటాన్ని ఉంచి నామసప్తాహం (వారం రోజుల పాటు భగవన్నామ స్మరణ చేయటం) చేయమ"ని సలహా ఇచ్చారు. అందుకా భక్తుడు సంతోషంగా అంగీకరించడంతో అందరూ కలిసి నామసప్తాహం మొదలుపెట్టారు. 

అదే మంచి సమయమని భావించిన వడ్డీవ్యాపారి ఆ భక్తుని ఇంటిలోని వస్తువులను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా జప్తు వారెంట్ సంపాదించి, వారెంటుతో సహా భక్తుని ఇంటికి వచ్చాడు. నామసప్తాహంలో నిమగ్నమై ఉన్న ఆ భక్తుడు వడ్డీవ్యాపారిని చూసి, అతని దగ్గరకి వెళ్లి విషయం తెలుసుకుని, "మరేం పరవాలేదు, మీరు నా ఇంటి నుంచి మీకు నచ్చినవాటిని తీసుకుపోవచ్చు. అప్పుడు నామసప్తాహం, ఇంకా ఇతర ఉత్సవాలు జరుపుకోవడానికి నాకు తగినంత చోటు లభిస్తుంది" అని ఎంతో శాంతంగా చెప్పాడు. ఆ క్షణాన ఆ వ్యాపారి మనసుపై బాబా ఎంతటి ప్రభావాన్ని చూపారంటే, అతను తాను తీసుకొచ్చిన వారెంట్‌ను తనంతటతానే చించిపారేశాడు. అంతేకాదు, మళ్ళీ ఎప్పుడూ ఆ భక్తునికి వారెంట్ పంపలేదు. అతనిలో అంతటి మార్పు తీసుకొచ్చి, తమనే నమ్ముకున్న భక్తునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు బాబా.

 Ref: శ్రీసాయిలీల మాసపత్రిక, 1945, సంచిక-5. Source: Baba’s vani.

5 comments:

  1. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo