ఈ భాగంలో అనుభవాలు:
- బాబాతో నా అనుభవాలు
- బాబా దయవల్ల ఉద్యోగం వచ్చింది
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ఓం శ్రీ సాయినాథాయ నమః.
ముందుగా సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్కారములు. తోటి భక్తుల అనుభవాలు చదవడం ద్వారా మనసుకు ప్రశాంతత, తృప్తి లభించి చెప్పలేనంత ఆనందంగా ఉంది. అంతేకాదు, బాబాపై అపారమైన నమ్మకం పెరిగింది. బాబా ఎల్లవేళలా మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
బాబాతో నా పరిచయం:
నాకు పదకొండు సంవత్సరాల వయస్సున్నప్పుడు మొదటిసారి బాబా గుడికి వెళ్ళాను. అప్పటినుండి నాకు తీరిక దొరికినప్పుడల్లా బాబా గుడికి వెళ్తుండేదాన్ని. ఒకప్పుడు మాకు తెలిసినవాళ్ళు పదేపదే వాళ్ళింటికి రమ్మని పిలుస్తుంటే, వాళ్ళ మాట కాదనలేక ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో పూజామందిరంలో బాబా విగ్రహం, పాదాలు ఉన్నాయి. వాటిని చూడగానే గుడిలో ఉన్న అనుభూతి కలిగింది. ఐదేళ్ల క్రిందట నేను మొదటిసారి శిరిడీ వెళ్లినప్పుడు అక్కడొక షాపులో బాబా విగ్రహం, పాదుకలు చూస్తూనే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వాటిని కొనుక్కొని నాతోపాటు తెచ్చుకున్నాను. తిరుగు ప్రయాణంలో నా మనసులో ఆ విగ్రహాన్ని, పాదాలను ఊహించుకుంటూ, వాటికి మనసులోనే పూజచేస్తూ ఆనందంగా గడిపాను. ఆ ఆనందంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాను.
బాబాతో నా అనుభవాలు:
నాకొక సమస్య ఉండేది. ఆ సమస్య గురించి గుడిలో పూజారిగారితో చెప్పి సలహా అడిగాను. అతను, "పిండితో పదకొండు దీపాలు పెట్టి, నైవేద్యంగా పండు, పాలు లేదా బిస్కెట్ ఏదో ఒకటి పెట్టి, 108 నామాలతో గురువారంనాడు మొదలుపెట్టి యాభైనాలుగు రోజులపాటు బాబాకు పూజ చేయాల"ని చెప్పారు. అతను చెప్పినట్లే నేను పూజ మొదలుపెట్టాను. ఆ సమయంలో సాయంత్రం పూట బాబా ఆరతి, చాలీసా, సచ్చరిత్ర చదువుతుండేదాన్ని. తద్వారా బాబాకు అన్నదానం ఇష్టమని తెలుసుకొని ప్రతినిత్యం పూజ పూర్తైన తరువాత అన్నదానం చేయడం మొదలుపెట్టాను. ఒకరోజు కరివేపాకు అన్నం చేసి బాబాకు నైవేద్యంగా పెట్టాను. పూజ పూర్తైన తరువాత ప్రసాదంగా కొద్దిగా స్వీకరించాను. అది చాలా కారంగా ఉంది. ఉప్పు కలిపినప్పటికీ చాలా చప్పగా ఉంది. అయినా బాబా మీద భారం వేసి, ప్రసాదంలో ఊదీ కలిపి ఒక కోచింగ్ సెంటర్లో పంచిపెట్టాను. అది తిన్న వాళ్లంతా 'చాలా అద్భుతంగా ఉందని, ఇంత రుచికరమైన ప్రసాదం ఎక్కడా తినలేద'ని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషం కలిగింది. అదంతా కేవలం బాబా ఊదీ మహిమ.
యాభైనాలుగు రోజుల పూజ పూర్తైన తరువాత అనుభవం:
ఆ పూజ పూర్తయ్యాక కూడా నాకు బాబాకి పూజ చేయకుండా ఉండబుద్ధి కాలేదు. అందువల్ల యథావిధిగా బాబాకు పూజచేసి, నైవేద్యం సమర్పించి, ఆరతి ఇస్తుండేదాన్ని. మూడవరోజు పూజ పూర్తై ఆరతి ఇస్తుండగా బాబాకు నైవేద్యం పెట్టడం మర్చిపోయానని గుర్తించాను. వెంటనే నైవేద్యం తీసుకొని రావడానికి వెళ్ళాను. ఆలోగా కర్పూరం దేదీప్యమానంగా వెలుగుతూ ప్రకాశవంతమైన కాంతి వెదజల్లుతుంది. ఆ ప్రకాశంలో బాబా రూపం నాకు దర్శనమైంది. నా పూజను ఆమోదిస్తూ బాబా ఇచ్చిన దర్శనానికి ఆనందంతో వారికి నమస్కరించుకున్నాను. ఆ ఫోటోను ఈ క్రింద జతపరుస్తున్నాను, చూడండి.
ఇది జరిగిన కొన్నిరోజులకు పూజారిగారి సేవాసంఘం నుండి శిరిడీకి రమ్మని నాకు పిలుపు వచ్చింది. నేను, మా పెద్దమ్మ శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాము. అయితే మా టిక్కెట్లు వేర్వేరు బోగీలలో వచ్చాయి. బోగీ మారడానికి ఎవరూ ఒప్పుకోకపోయినా బాబామాల వేసుకున్న ఒక అన్న సహాయంతో మేమిద్దరం ఒకేచోట కూర్చొని ప్రయాణం సాగించాం. ఆ అన్న రూపంలో బాబానే మాకు సహాయం చేసి సురక్షితంగా శిరిడీ చేర్చుకున్నారు. "ఐ లవ్ యు బాబా. థాంక్యూ సో మచ్ బాబా. ఎల్లవేళలా మీ ఆశీస్సులు నాపై, నా కుటుంబంపై, ఇంకా ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను". ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటిని త్వరలో పంచుకుంటాను.
ఓం సాయిరామ్!
బాబా దయవల్ల ఉద్యోగం వచ్చింది
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నాకు వివాహమై పది సంవత్సరాలైంది. మాకు పిల్లలు లేరు. నేను ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించాను. ఇదిలా ఉంటే, గత సంవత్సరం అక్టోబరులో మావారికి ఉద్యోగం పోయింది. ఆయనకి ఉద్యోగం పోవడం ఇది రెండవసారి. నేను మావారికోసం ఏడు గురువారాలపాటు వ్రతం చేశాను. ఇంకా ఈ కరోనా కాలంలో చాలా విషయాలు పెండింగులో పడ్డాయి. దాంతో విసుగుపుట్టి, బాబానే నమ్ముకుని, ‘ఏమి చేస్తారో చేయనీ’ అని ఆయన మీదే భారం వేశాను. బాబా కృప చూపించారు. మావారికి ఆగష్టులో ఉద్యోగం వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
🙏🌺🙏 ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeletevery nice leela 1st experience is very good.sai gave darshan in deepamu.om sai ram i feel happy when i read like that leela.om saima
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram
ReplyDeleteBaba! I am not at all alone you are with me.My life is still filled with hurdles but I believe you.Because you are the one who gives me chances and success in my life.
ReplyDeleteI am not able to the deepam..
ReplyDeleteBaba please problem ni solve cheyi thandri
ReplyDeleteOm Sairam tq so much for staying with me,tq deva nee blessings minchi vere edi ekkuva kadani naaku telipinanaduku,love u sai,pls strength my faith in u deva,pls give me success in all my exams baba,pls give me strength to overcome my negatives,Love u sai
ReplyDeleteOm sai ram
ReplyDelete