సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 527వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి మహరాజ్ అనుగ్రహం
  2. బాబా అనుగ్రహంతో కోవిడ్ పరీక్షలో నెగిటివ్

సాయి మహరాజ్ అనుగ్రహం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు బాబా తనకి ప్రసాదించిన అనుభవాలను మనతో ఈ విధంగా పంచుకుంటున్నారు:

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. మీ సేవ అనన్య సామాన్యం. సాయినాథుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 

నేను ఒక సాయిబిడ్డని. గత 21 సంవత్సరాలనుండి సాయినాథుడు నన్ను కాపాడుతూ ఉన్నారు. ఇటీవల నా జీవితంలో సాయినాథుడు మరోసారి నన్ను ఆపదనుండి రక్షించారు. నేను ఒక బ్యాంకులో ఆఫీసరుగా పనిచేస్తున్నాను. మా బ్రాంచిలో నాతోపాటు పనిచేసే నా సహోద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. రెండవరోజు నాకు కూడా కొన్ని లక్షణాలు కనపడటంతో, వెంటనే నేను నా కుటుంబంతో సహా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. నాకు, నా కుటుంబసభ్యులలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టక చాలా ఆందోళనగా ఉన్నాను. రాత్రి పదిన్నర గంటలకు నేను మనసులోనే “సాయినాథా! భారమంతా నీదే తండ్రీ! అంతా నీ దయ” అనుకుని నిద్రపోయాను. 

అప్పటిదాకా ఎవరికీ ఇంటిలో ఉండి చికిత్స తీసుకోవడానికి అనుమతి లేదు. కానీ సాయినాథుని దయచేత మరుసటిరోజు ఉదయాన్నే ఆరోగ్యశాఖవారు మేము ఇంటిలో వుండే చికిత్స తీసుకోవడానికి అంగీకరించారు. సాయినాథుని దయవలన నాకు, నా కుటుంబసభ్యులకు ఆరోజునుండే రోగలక్షణాలు తగ్గి త్వరలోనే ఆరోగ్యం చేకూరింది. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండానే సాయినాథుని దయవలన మేము పూర్తిగా కోలుకున్నాము

అంతేకాదు, ఒకరోజు అర్థరాత్రి నా మంచం ప్రక్కన ఎవరో వున్నట్లుగా నాకు అనిపించింది. నా ఎదురుగా వున్న గోడ మీద సాయిబాబా నీడ కనిపించింది. బాబా నాతోనే ఉన్నారని తలచి నేను మనసులోనే బాబాను స్మరించుకున్నాను. మరుసటి ఉదయం నేను ఏమీ చెప్పకుండానే నా భార్య కూడా ‘తనకు ఒకచోట అమ్మవారి రూపం కనిపించింద’ని చెప్పింది. అదంతా బాబా దయ. ‘బాబా మన ప్రక్కనే ఉండి సదా మనలను రక్షిస్తారు’ అన్న మాట నిజమని మరోసారి ఋజువైందని తలచి సంతోషంగా బాబాకు నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నాము. 

ఇంత ఆపదలో కూడా సాయినాథుడు ఇంకో అనుభవం కూడా ఇచ్చారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చిన 10 రోజుల తర్వాత మా మండలం అంతటా విపరీతంగా కోవిడ్ కేసులు పెరిగాయి. అటువంటి సమయంలో మేము ఇంటిలో ఉండటంవల్ల మేము ఎక్కువ కంగారుపడలేదు. ఈ సమయంలో నేను సాయినాథుని లీలల గురించి తెలిపే ఈ బ్లాగ్ చూసి ఎంతో సంతోషపడ్డాను. ఎందరో సాయిభక్తుల అనుభవాలు చదివి నాకు పరమానందం కలిగింది. 

బాబా మాకు మరో జన్మను ప్రసాదించారు. ఎన్ని జన్మలైనా బాబా భక్తుడిగానే పుట్టాలని ఆశిస్తున్నాను. 

జై సాయి రామ్! సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

బాబా అనుగ్రహంతో కోవిడ్ పరీక్షలో నెగిటివ్

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్నిలా  పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. బాబా మాకు చేసిన సహాయాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా, నేను మాత్రం ఆ సాయి ఆశీర్వాదంగానే భావిస్తాను. ఈ కరోనా సమయంలో ఇటీవల మా కాలనీలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల తరువాత కొందరి పరీక్షాఫలితాలు వచ్చాయి. అందులో, మావారితో సన్నిహితంగా ఉన్నవారికి పాజిటివ్ వచ్చింది. దాంతో నాకు చాలా భయమేసి బాబాకు నమస్కరించి, “మా కుటుంబంలో ఎవరికీ కోవిడ్ పాజిటివ్ రాకుండా అందరికీ నెగిటివ్ వచ్చేలా చేయండి బాబా! మీ అనుగ్రహంతో అందరికీ నెగిటివ్ వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా దయవలన మా ఇంట్లో అందరికీ నెగిటివ్ వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం ఈ అనుభవాన్ని మీతో ఈ బ్లాగులో పంచుకుంటున్నాను.


9 comments:

  1. om sai ram why fear baba is there he protect us.he takes care every one

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. జై సాయి రామ్! సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. 🌹🌸🌺 Om sri sai sarva jagadrakasha 🌹🌸🌺🙏🙏🙏🙏🙏🙇🙇

    ReplyDelete
  6. Om sai ram baba mathone vundu baba

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🌹🙏🌹
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo