సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 526వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబాను నమ్ముకున్నవారికి శుభం ఖచ్చితంగా జరుగుతుంది
  2. ఆపద నుండి కాపాడే అస్త్రం - సాయిబాబా నామం

బాబాను నమ్ముకున్నవారికి శుభం ఖచ్చితంగా జరుగుతుంది

సాయిభక్తుడు డాక్టర్ కె.శ్రీకాంత్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ప్రణామాలు. భగవత్స్వరూపులైన బాబా మీకు ఈ బ్లాగ్ నిర్వహించే ఆలోచనను, భాగ్యాన్ని ప్రసాదించారు. మీరు ఎంతో ధన్యులు. బాబా ఆశీస్సులు లేనిదే ఎవరూ ఈ పని చేయలేరు. మీరు బాబా కృపకు పాత్రులైనారు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను.

2020, మార్చి 20వ తేదీన బాబా అనుగ్రహంతో మాకు బాబు పుట్టాడు. బాబుకు ‘శ్రీపాద్’ అని పేరు పెట్టాము. బాబా కృపవలన బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఆగష్టు 12వ తేదీన బాబుకు టీకా (వ్యాక్సినేషన్) వేయించాము. సాధారణంగా టీకా వేశాక జ్వరం వస్తుంది కదా! అలాగే బాబుకు కూడా జ్వరం వచ్చింది. రెండు రోజులు అలాగే జ్వరం వస్తూ ఉండేసరికి నాకు చాలా బాధగానూ, భయంగానూ అనిపించింది. భయం ఎందుకంటే, ఈ కరోనా పరిస్థితుల వల్ల. ఆగష్టు 13 రాత్రి పడుకునేముందు ఈ బ్లాగులో బాబా భక్తుల అనుభవాలు చదివి, బాబాకు నమస్కరించి, ‘మరుసటిరోజు నేను పూజ చేసుకునే సమయానికి మా బాబుకు జ్వరం తగ్గిపోవాలని, బాబుకు జ్వరం తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబాకు మ్రొక్కుకున్న తరువాత బాబా ఊదీని బాబు నుదుటన బొట్టులా పెట్టాను. తరువాత, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి భయంభయంగానే పడుకున్నాను. (నాకు ఈ మంత్రం కూడా ఈ బ్లాగులోనే కనిపించింది.) ఆ రాత్రికి కూడా బాబుకు కొంచెం జ్వరం వచ్చింది. జ్వరం తగ్గటానికి మందులు వేశాము. చాలా భయంగా అనిపించింది. కానీ మరుసటిరోజు ఉదయానికి బాబు ముఖం తేటపడి ఆరోగ్యంగా కనిపించింది. కానీ కొద్దిగా జ్వరం ఉంది. నేను స్నానం చేసి, పూజకు వెళ్ళే సమయానికి బాబు పూర్తిగా కోలుకున్నాడు. జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇంట్లోవాళ్ళందరూ చాలా సంతోషించారు. “బాబా! నీ కృప అపారం. నీ కృప మాపై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి. బాబా! నన్ను మీ పాదాల వద్ద పాదధూళిగా ఉంచుకోండి. ప్రతి క్షణం నేను మిమ్మల్ని గుర్తుచేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి”.

సాయిబాబా భక్తులకు నా మనవి:- బాబాను నమ్ముకున్నవారికి శుభం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనం బాబాను నమ్మాలి. మన చంచలస్వభావంతో మనం కొంత భయపడతాము. కానీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ఉండటానికి ప్రయత్నించండి. బాబాపై భారంవేసి ఉంచండి. 

ఓం శ్రీ సాయినాథాయ నమః.

బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలతో...
శ్రీకాంత్.

ఆపద నుండి కాపాడే అస్త్రం - సాయిబాబా నామం

సాయిభక్తురాలు అనూష తనకు బాబా ప్రసాదించిన స్వప్నానుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారం! నా పేరు అనూష. ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల నాకు కలిగిన ఒక స్వప్నానుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇంతకుముందు చెప్పినట్టు నాకు ఒక ఆరోగ్య సమస్య ఉంది. అది నన్ను గత కొన్ని సంవత్సరాలుగా బాధపెడుతోంది. కానీ అది ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెప్పారు. అయినా నేను పరీక్షలు చేయించుకోవటానికి వెళ్ళిన ప్రతిసారీ ఎంతో బాధను అనుభవించేదాన్ని. బాబా అంటారుగా, “కర్మను అనుభవించక తప్పదు!” అని. నేను ఆ మాటనే తలచుకుంటూ, “నేను ఏదో తప్పు చేశాను, అందుకే దాని కర్మను అనుభవిస్తున్నాను” అని అనుకునేదాన్ని. అయితే గత కొన్నిరోజులుగా ఆ సమస్య నన్ను ఎక్కువగా బాధిస్తోంది. మానసికంగానూ, శారీరకంగానూ కూడా నన్ను చాలా క్రుంగదీసింది. ఈ క్రమంలో ‘నాకు సమాధానం ఇవ్వమ’ని బాబాను నిలదీస్తూ అనుక్షణం ఆయనను ఇబ్బందిపెట్టాను. ఒకసారి నాకు అనుకూలంగానూ, మరోసారి నాకు అసలు అర్థంకాని విధంగానూ బాబా దగ్గర నుంచి నాకు సమాధానం వచ్చేది. ఎలా వచ్చినా నా మనసు శాంతించక చాలా గందరగోళంగా తయారైంది. అయితే ఒకరోజు రాత్రి నాకు కల వచ్చింది. ఆ కలలో ఒక ఆరడుగుల నాగుపాము నన్ను కాటువేయడానికి వచ్చింది. నేను దాన్ని చూడగానే భయంతో “శ్రీ సాయినాథాయ నమః” అని గట్టిగా అరిచాను. బాబా నామం వినగానే ఆ పాము నన్ను కాటువేయకుండా అలాగే నిలబడిపోయింది. నేను అక్కడనుండి పారిపోతుంటే అది నన్ను తరుముతూ వచ్చింది. నేను మళ్ళీ బాబా పేరు పలికాను, అది మళ్లీ ఆగిపోయింది. ఆ తరువాత నాకు మెలకువ వచ్చింది. నేను బాబాను స్వప్నదర్శనం ప్రసాదించి నాకు అభయమివ్వమని అడిగాను. కానీ, ఇలాంటి కల వచ్చిందేమిటా అని ఆలోచించాను. కానీ, తరువాత ఆలోచిస్తే తెలుస్తోంది ఆ తండ్రి లీల. నాకు వచ్చిన ఆపద - పాము; దానినుండి నన్ను కాపాడే అస్త్రం - సాయిబాబా నామం. కలలో పాము కాటువేయడానికి వచ్చిన ప్రతిసారీ సాయిబాబా నామం నన్ను కాపాడుతోంది. ఈ విషయాన్ని నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? చిన్న చిన్న సమస్యలు వచ్చిన ప్రతిసారీ బాబాను ఇబ్బందిపెడుతున్నాను. నేను అడిగినట్లే బాబా నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు. కానీ నేను అడిగిన పద్ధతిలో కాదు, ఆయన పద్ధతిలో! సాయిబాబా నాకు ధైర్యాన్ని, ఆయన లీలలను అర్థం చేసుకోగలిగే అవగహనను, శ్రద్ధ, సబూరీలను ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.


10 comments:

  1. ⚜️🔸⚜️🔸⚜️🔸⚜️🔸⚜️🔸⚜️🔸⚜️🔸⚜️
    సూక్ష్మమగు చీమ భారమా ! స్థూలకరికి
    నన్ను విడువకుమయ్య దీనజనబంధు
    నిన్నె నమ్మితినయ్య మునీంద్ర వంద్య
    సన్నుతించెద నిన్ను గోసాయివేష శిరిడి సాయేశా🙏🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  3. “శ్రీ సాయినాథాయ నమః”

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Baba, మా అహంకారాన్ని విడిచి మేము సదా మీమార్గం లో నడి చే అదృష్టాన్ని మాకు కల్పించండి జై సాయిరాం.

    ReplyDelete
  6. 🌼Om sri sainadhayanamaha🌼🙏🙏🙏

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  8. Baba ma mother health problem tondarga cure ayyela chudu thandri nuvve dikku thandri maku

    ReplyDelete
  9. ఓం శ్రీ సాయి రక్షక శరణం దేవా 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo