- నా సాయి అద్భుతం - డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
- అనుగ్రహించిన సాయి
నా సాయి అద్భుతం - డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
'OM SAI RAM' ఈ మూడు అద్భుతమైన పదాలు నా ప్రపంచంలో ఎంతో ఆనందాన్ని తీసుకొస్తాయి. “oms AIR am” అనే పదాలే నాకు శ్వాస. బాబా ప్రసాదించిన అనుభవాలు పంచుకోవడానికి, చదవడానికి చక్కటి వేదికను ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్ బృందానికి నా కృతజ్ఞతలు. ఇది బాబా మహాసమాధి అనంతరం ఆధునిక సాయి సచ్చరిత్ర. ఇక, బాబా నాకు ప్రసాదించిన అనుభవానికి వస్తాను.
నా డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియనుండటంతో నేను దానిని రెన్యూవల్ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ మేము వేరే స్టేట్‌కి మారినందువల్ల వ్రాతపరీక్షకి, డ్రైవింగ్ టెస్ట్‌కి నేను మళ్ళీ హాజరు కావాల్సి ఉంది. అయితే గత పదినెలలుగా కారు నడపనందున నేను కాస్త ఆందోళన చెందాను. సాయి దయవల్ల డ్రైవింగ్ మేనేజ్ చేయగలనుగాని, వ్రాతపరీక్ష సరిగా అట్టెంప్ట్ చేయలేనేమోనని చాలా భయపడ్డాను. ఎందుకంటే ఈ స్టేట్ నియమాలు చాలా కఠినమైనవి. అందువలన నేను బాబాకు నమస్కరించుకొని, "బాబా! నా డ్రైవింగ్ లైసెన్స్ ఎటువంటి సమస్యలు లేకుండా రెన్యూవల్ అయినట్లయితే నేను నా అనుభవాన్ని నా ప్రియమైన వెబ్‌సైట్‌లో పంచుకుంటాను" అని సాయిని ప్రార్థించాను. అంతలో కరోనా కారణంగా లాక్‌డౌన్ మొదలైంది. దాంతో ఎటూ వెళ్లే అవకాశంలేక మేము బయటికి వెళ్లడం మానేశాము. చివరికి నా డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి నెలరోజులు దాటిపొయింది. అప్పుడు నేను, 'ఇంకా ఆలస్యం అయితే సమస్య అవుతుంద'ని అలోచించి సాయిని ప్రార్థించి, నా లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవడానికి వెళ్ళాను. నా సాయి అద్భుతం చేశారు. వ్రాతపరీక్షగాని, డ్రైవింగ్ టెస్ట్ గాని లేకుండా, కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ఫైరీ గురించి ఒక్కమాటైనా అడగకుండా కౌంటర్లో ఉన్న మహిళ నా లైసెన్స్‌ను రెన్యూవల్ చేసింది. అంతా నా సాయిచేసిన అద్భుతం.
అందరికీ సాయిరామ్! నా వైవాహిక జీవితం కోసం దయతో ప్రార్థించండి. నిజానికి నా భర్త చాలా మంచివాడు, మంచి అవగాహన కలవాడు. నాపట్ల ఎంతో శ్రద్ధ చూపేవాడు. కానీ ప్రస్తుతం తను మారిపోయాడు. వ్యక్తిగతంగా నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. కొన్ని విషయాలను వివరించడం కష్టం. నాకంటూ ఎవరూ లేరు. (అవసరం తీరిపోయిందని నా కుటుంబం నన్ను విడిచిపెట్టింది.) అందువలన నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి నాకోసం ఒక్క క్షణకాలాన్ని వెచ్చించి, నా గురించి సాయిబాబాను ప్రార్థించండి. 'మీ అందరికీ, మీ కుటుంబసభ్యులకు ఆరోగ్యం, సంపదలను ప్రసాదించి, సదా ఆనందంగా ఉండేలా ఆశీర్వదించాల'ని సాయి తండ్రిని కోరుకుంటున్నాను.
బాధ, సంతోషం, మారే అనుభూతి కలిగిన నా మనసుకి సాయి తప్ప వేరే దైవం తెలియదు. గత 20 ఏళ్లుగా నా సాయిదేవుడు నాతో ఉన్నారు, నన్ను నడిపించారు. కానీ ఇప్పుడు ఆయన నావైపు చూడటం లేదు. "బాబా! నేను మీ పాదాల దగ్గర ఉంటే, నాకు కష్టం ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా అది తీరలేదంటే, నేను మీ పాదాల దగ్గర లేననేగా! బాబా! మీరెక్కడున్నారు? మీరు నా బాధ వింటున్నారా? నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మీరు నా జీవితాన్ని మధ్యలో వదిలేయలేరు. నేను ఇంతకంటే ఎక్కువ వ్యక్తపరచలేను. నాకు మాటలు రావడం లేదు. దయచేసి నాకు సహాయం చెయ్యండి. నా వైవాహిక బంధాన్ని కాపాడండి".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
అనుగ్రహించిన సాయి
నా పేరు మంజుల. నేను నల్గొండ నివాసిని. సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నేను బాబా భక్తురాలిని. ఆయనే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయనే నా తోడునీడ, నా సర్వస్వము. ఆయన ప్రేమతో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపించి నన్ను కష్టాలనుండి బయటపడేశారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది.
గత కొంతకాలంగా నా కూతురు, కొడుకు విషయంలో నేను బాధపడుతున్నాను. అందుకు కారణాలు:
1. నా కూతురికి సంతానం కలగటం గురించి, వాళ్ళు ఫ్రాన్స్ నుండి కెనడాకు వెళ్లే విషయం గురించి.
2. నా కొడుకు ఇటలీలో మాస్టర్స్ చదువు పూర్తిచేసి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇండియాకి వచ్చాడు. మళ్లీ తాను విదేశాలకు వెళ్ళడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడ కూడా ఉద్యోగం ఏమీ చేయట్లేదు.
ఈ రెండు విషయాల గురించి ఒకరోజు మా గురువుగారైన గరిడేపల్లి సాయిబాబా మందిరంలోని పూజారి రవికుమార్ గారితో చెప్పాను. దానికి వారు మా పాప చేత, బాబు చేత బాబా చరిత్ర 41 రోజులపాటు నిత్యపారాయణ చేయించమన్నారు. నేను వాళ్ళిద్దరికీ విషయం చెప్పాను. అందుకు వారిద్దరూ అంగీకరించి, జూలై 30, గురువారంనాడు పారాయణ ప్రారంభించారు. నేను మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. అందులో భాగంగా నేను పారాయణ చేస్తున్నప్పటికీ ఎప్పుడూ బాబాను ఏమీ కోరుకోలేదు. కానీ ఆగస్టు 20, గురువారంనాడు మాత్రం పారాయణ చేస్తూ, "బాబా! నా కూతురికి సంతానాన్ని ప్రసాదించు" అని కోరుకున్నాను. ఇంకా, "నా ప్రార్థన మన్నించి మీరు నా కోరిక తీరిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని పారాయణ కొనసాగించాను. బాబా నా ప్రార్థన విన్నారు. 2020, ఆగష్టు 22న పాప ఫోన్ చేసి, 'తను ప్రెగ్నెంట్" అని చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. పట్టలేని ఆ ఆనందంలో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే, ‘బాబు ఉద్యోగ విషయంలో, పాప కెనడా ప్రయాణ విషయంలో కూడా సహాయం అందించమని, డెలివరీ వరకు పాపకు తోడుగా ఉండమ'ని బాబాని వేడుకుంటున్నాను. "అందర్నీ కాపాడమ"ని సాయినాథుని పాదపద్మాలకు విన్నవించుకుంటూ.. జై సాయిరాం!
సర్వం శ్రీసాయిపాదార్పణమస్తు!
శుభమస్తు!
om sai ram please bless sai from carona.it is dangerous virus,om saimaa
ReplyDeleteOm sairam
ReplyDeleteఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
ReplyDeleteజై సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteజై సాయిరామ్!జై గురుదత్త!
ReplyDeleteBaba,mee margamlo nadipi chandu.
ReplyDeleteBaba please daya chupinchaya ma pyna karunichaya
ReplyDeleteBaba ashiravadinchandi please
ReplyDelete🌹🙏🙏🌹 Sai mee biddalandharini kapadandi 🌹🙏🙏🙏🌹
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌟🙏🙏🙏🌺🏵 Om Sai Ram, Sai mee aa Bakthurali kapuram nilabettandi .🏵🌺🙏🙏🙏🌟
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏
ReplyDeleteబాబా మీ యొక్క కరుణా కటాక్షములు మా అందరికీ అందించు తండ్రీ🙏🙏🙏🙏🙏🙏మీరే మాకు దిక్కు🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేము మా పాప కర్మల చేత కష్టాలు, బాధలు, దుఃఖాలు అనుభవిస్తున్నాము. ఇప్పుడు మా పాప కర్మలను తొలగించుకునే శక్తి, సామర్ధ్యాలు మాకు లేవు. ఇక మాకు మీరే దిక్కు🙏🙏🙏🙏🙏🙏🙏. మా పాప కర్మలు నుండి రక్షించగలిగే దయాలవు మీరే మీరే మాకు తండ్రి🙏🙏🙏🙏🙏🙏. ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteమమ్ము కరుణించి కాపాడు తండ్రి ! ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
ReplyDelete