సాయి వచనం:-
'నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి.'

'శిరిడీలో అర్థవంతంగా ఒక గంట గడిపినా ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 533వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో నాకు, నా భర్తకి వచ్చిన పి.హెచ్.డి సీటు
  2. కష్టకాలంలో శక్తినిచ్చిన శ్రీసాయి

బాబా అనుగ్రహంతో నాకు, నా భర్తకి వచ్చిన పి.హెచ్.డి సీటు

సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు అలేఖ్య. నేను ఏలూరులో నివాసముంటున్నాను. ఏ జన్మలో చేసిన పుణ్యఫలమో మనమందరమూ బాబా భక్తులమయ్యాము. సాయి మార్గము చాలా కఠినమైనది. కానీ బాబా ఓపికతో తన భక్తులను పెద్ద సముద్రాన్నే దాటించే శక్తి గలవారు. నేను చిన్నప్పటినుండి బాబాను బాగా కొలిచేదాన్ని. ఏ పనినైనా గురువారం రోజున ప్రారంభించేదాన్ని. ఏ విషయమైనా నా జీవితంలో జరగాలి అంటే సాయి ఆజ్ఞ లేనిదే అది జరిగేది కాదు. నేను ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలను తరచూ చదువుతుంటాను. నా జీవితంలో బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. నాకు కలిగిన అనుభవాలను కూడా పంచుకుంటే కొంతమంది సాయిభక్తులకి బాబా పట్ల ఇంకా నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నాను.

నేను, నా భర్త చాలా సంవత్సరాల నుండి Ph.D సీట్ కోసం ఎన్నో పరీక్షలు రాశాము. ఏ యూనివర్సిటీలో ఈ పరీక్ష రాసినా కొన్ని కారణాల వలన దగ్గర వరకు వచ్చి మాకు సీటు రాకుండా ఆగిపోయేది. దాంతో నా భర్త చాలా బాధపడి, “ఇంక నేను ఈ పరీక్షలు వ్రాయను” అనేశారు. కానీ ఆ తరువాత మరొక్క ప్రయత్నం చేద్దామని అనుకున్నాము. ఆ సమయంలో ఒక యూనివర్సిటీలో Ph.D కి ప్రకటన వెలువడింది. ఆ యూనివర్సిటీ చెన్నైలో ఉంది, మేముండేది ఆంధ్రప్రదేశ్ లో. ‘మరి అక్కడికి ఎలా వెళ్ళాలి?’ అని ఆందోళన చెందాము. ఇద్దరికీ ఒకేచోట Ph.D సీటు వస్తే బాగుండునని చిన్ని ఆశ. చివరికి ఎలానో ఆ యూనివర్సిటీలో సీటు కోసం పరీక్ష రాశాము. మేము పరీక్ష రాసింది ఆగస్టు నెలలో. ఆ పరీక్షా ఫలితాలు రావటానికి కాస్త సమయం పట్టింది. ఈలోపు మేముండేచోట విజయదశమి సందర్భంగా శిరిడీ సాయిబాబా సంస్థానంలో అన్నదానానికి డబ్బులు, ధాన్యము వంటి విరాళాలు సేకరిస్తున్నారు. మేము కూడా కొంత డబ్బు విరాళంగా ఇచ్చాము. అలా అన్నదానం కోసం డబ్బు ఇచ్చిన వారం రోజుల తర్వాత Ph.D ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలను చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మా ఇద్దరికీ ఆ యూనివర్సిటీలోనే సీట్లు వచ్చాయి! ఇది నిజంగా బాబా అనుగ్రహమే! మేమిద్దరం చాలా ఆనందించాము. మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అయితే కొన్నిసార్లు కొన్ని సీట్లు యూనివర్సిటీకి 400-500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలలో కూడా వస్తాయి, కానీ వాటికి యూనివర్సిటీలో సీటుకి ఉన్నంత గుర్తింపు ఉండదు. 

మార్చి నెలలో మాకు మొదటి రివ్యూ జరిగింది. దానికోసం ఇద్దరమూ ఆ యూనివర్సిటీకి వెళ్ళాము. నా రివ్యూ అయిపోయింది. నా భర్తది మాత్రం అవలేదు. వాళ్ళ ప్రొఫెసర్ ఏదో పనిమీద వేరే ఊరికి వెళ్ళారని నా భర్తను ఇంకోరోజు రమ్మన్నారు. మళ్లీ ఒక వారంరోజుల తరువాత నా భర్త యూనివర్సిటీకి వెళ్ళారు. అప్పుడు తన రివ్యూ అయింది. ఇక్కడ జరిగిన అద్భుతమేమిటంటే, ఆ ప్రొఫెసర్ అన్నారట, “నువ్వు, నీ భార్య ఇద్దరూ ఇక్కడే ఉండి Ph.D చేసుకుంటారని మీ ఇద్దరినీ యూనివర్శిటీలోని ప్రొఫెసర్లకే కేటాయించాము” అని. ఆయనేం చెబుతున్నారో నా భర్తకి అర్థం కాలేదు. ఎందుకంటే, మేము ఆ యూనివర్సిటీకి వెళ్ళడం అదే మొదటిసారి. పైగా మాకు అక్కడి భాష కూడా తెలియదు. “అసలు వాళ్ళకి మేము భార్యాభర్తలమని ఎలా తెలుసు?” అని మేము ఆశ్చర్యపోయాము. అప్పుడు నాకు అర్థం అయింది, ఈ అద్భుతాన్ని చేసింది బాబానే అని. “లవ్ యు సో మచ్ బాబా! మీరెప్పుడూ మాతోనే ఉండండి బాబా! మీరు లేనిదే మాకు జీవితమే లేదు!”

నాకు ఎప్పుడూ అనిపించేది, “ఎందుకు నా జీవితంలో అన్నీ ఆలస్యంగా జరుగుతాయి?” అని. కానీ ఇది ‘సాయి టైమింగ్’, అంతే! మనం ఎంత అనుకున్నా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. మనం నమ్మకంతోను, సహనంతోను ఉండాలి. ఏమైనాగానీ కష్టసమయాల్లో మనం అప్పుడప్పుడు “నాకెందుకు ఇలా జరుగుతోంది?” అని బాధపడి సహనాన్ని కోల్పోతాము. దయచేసి అందరూ బాబాపై నమ్మకంతో, సహనంతో ఉండండి.

నేను బాబాను ఇంకో కోరిక కోరుకున్నాను. బాబా అనుగ్రహంతో అది నెరవేరిన వెంటనే మీ అందరితో పంచుకుంటాను. “నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ బాబా!”

కష్టకాలంలో శక్తినిచ్చిన శ్రీసాయి

సాయిభక్తుడు వెంకటేశ్వరరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ముందుగా శ్రీసాయిబాబాకి నా సాష్టాంగ నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. నా పేరు మిరియాల వెంకటేశ్వరరావు. ఇంతకుముందు నా అనుభవం ఒకటి ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 2020, ఆగష్టులో కలిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఈ కరోనా సమయంలో ఆగష్టు మొదటివారంలో నాకు జ్వరం వచ్చి దాదాపు పదిరోజులపైనే బాధపడ్డాను. ప్రతిరోజూ బాబా ఊదీ పెట్టుకొని, కొద్దిగా ఊదీని నీళ్ళలో కలిపి తీసుకున్నాను. అనుక్షణం శ్రీసాయి నామము, శ్రీ హనుమాన్ నామము స్మరిస్తూ గడిపాను. డాక్టర్ని సంప్రదిస్తే, “కరోనా లక్షణాలు లేవు. ఇది కేవలం వైరల్ ఫీవర్, వారం రోజుల్లో తగ్గిపోతుంది” అని చెప్పి, జ్వరం తగ్గటానికి మందులిచ్చారు. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకున్నాను. శ్రీసాయి దయతో పదిరోజులలో జ్వరం తగ్గిపోయింది. శ్రీసాయి నామము, శ్రీ హనుమాన్ నామము ఈ కష్టకాలంలో నాకు శక్తినిచ్చాయి. శ్రీసాయి ఊదీ పొట్లాన్ని, శ్రీసాయి ఫోటోను తలక్రింద పెట్టుకొని పడుకుంటున్నాను. “బాబా! నా తప్పులు క్షమించి, నాకు, నా కుటుంబానికి ఎల్లప్పుడూ కష్టంలోను, సుఖంలోను మీ తోడును, రక్షణను కల్పించండి. మీకు వేల వేల నమస్కారాలు బాబా!” మరొకసారి నా అనుభవాలతో మీ ముందుకు వస్తాను. జై సాయిరామ్!


12 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. శ్రీ సాయి ఆరోగ్య క్షేమప్రదాయ నమః

    ReplyDelete
  3. Baba as u bless them with ph.d seat pls bless me with medical seat deva,love u sainatha,love u so much.

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Baba garu na కోరిక మేరకు నా కు కూడా అనుభవాన్ని ప్రసాదించి నారు.నేనుకూడా తప్పనిసరిగా నా అనుభవాలను తొందరలో మీ అందరితో share చేసుకుంటాను.బాబా ప్లీజ్ blessing me.

    ReplyDelete
  6. Baba sahanam tho vunamu enka ma valla kadu baba ma kastani teerchu baba

    ReplyDelete
  7. 🌺🌸🙏🙏Om Sri Sainathayanamha 🙏🙏🌸🌺

    ReplyDelete
  8. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  9. 🙏🌼🌷ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🏵🌼🌷🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo