నేవాసా గ్రామానికి చెందిన గంగాధర్ విష్ణు క్షీరసాగర్ బ్రాహ్మణ కులస్థుడు. అతడు కోపర్‌గాఁవ్ సమీపంలోని సోనావాడి వద్ద నీటిపారుదల విభాగంలో టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్‌గా పనిచేశాడు.
గంగాధర్‌కి 5 సంవత్సరాల వయస్సప్పుడు తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణంతో అతడు, అతని తల్లి మేనమామ దగ్గర ఉండేవాళ్ళు. ఆ కుటుంబానికి కొన్ని ఎకరాల భూమి ఉంది. కొంత భూమిని సాయిబాబా భక్తుడైన బాలాజీ పాటిల్ నేవాస్కర్‌కు (జయగుడి) కౌలుకిచ్చారు. హఠాత్తుగా ఒకరోజు బాలాజీ ఆ భూమికి తానే హక్కుదారునని ప్రకటించుకున్నాడు. దాంతో గంగాధర్ కుటుంబ సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న అతని మేనమామ బాలాజీను నిలదీశాడు. ఆ భూవివాదాన్ని శ్రీసాయిబాబా సమక్షంలో పరిష్కరించుకునేందుకు వాళ్ళను తనతోపాటు శిరిడీ రమ్మన్నాడు బాలాజీ పాటిల్ నేవాస్కర్. అందువల్ల గంగాధర్ మేనమామ, గంగాధర్ తల్లి బాలాజీ పాటిల్‌తో కలిసి శిరిడీ వెళ్ళారు.
గంగాధర్ మేనమామ, గంగాధర్ తల్లి అంతకుముందెన్నడూ బాబాను దర్శించలేదు. వాళ్ళు మసీదుకి వెళ్లి బాబాకు నమస్కరించేలోపు ఆయన బాలాజీ పాటిల్ నేవాస్కర్‌తో, "ఎందుకు నా బిడ్డలను అవస్థపెడతావు? ఆ భూమిని వాళ్ళ స్వాధీనం చెయ్యి!" అని చెప్పారు. తరువాత వాళ్లంతా నేవాసాకు తిరిగి వెళ్లిపోయారు. కానీ బాలాజీ నేవాస్కర్ వాళ్ళ భూమి వాళ్ళ స్వాధీనం చేయడానికి నిరాకరించాడు. దాంతో వాళ్ళు కోర్టు ద్వారా ఆ భూమిని తమ స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. ఈ సంఘటన తరువాత, బాలాజీ పాటిల్ నేవాస్కర్ పిచ్చివాడై ఎక్కడికో వెళ్లిపోయాడు. అతడు మళ్ళీ ఎప్పుడూ శిరిడీ రాలేదు.
ఇదంతా 1901వ సంవత్సరంలో జరిగింది. అప్పటికి గంగాధర్ వయస్సు 16 సంవత్సరాలు. బాబా సశరీరులుగా ఉండగా అతడెప్పుడూ బాబాను దర్శించలేదు. అతని తల్లి, మేనమామ మాత్రం అప్పుడప్పుడు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.
1934లో గంగాధర్ విష్ణు క్షీరసాగర్‌కి కోపర్‌గాఁవ్ సమీపాన గల సోనావాడికి బదిలీ అయ్యింది. అప్పటినుండి అతడు క్రమంతప్పకుండా శిరిడీ వెళ్తుండేవాడు. అతడు శిరిడీ వెళ్ళినప్పుడల్లా సమాధి మందిరంలోని సాయిబాబా ముందు భజనలు పాడుతుండేవాడు.
1935, జూన్ 27న అతనికొక కల వచ్చింది. కలలో, సాయిబాబా అతని ముందు నిలుచొని, "ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు? ఈరోజు మీ ఇల్లు, మీకు స్వంతం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. శిరిడీలో జాతర జరుగుతుంది. వచ్చి భోజనం చెయ్యి!" అంటూ భోజనాల గదికి తీసుకెళ్లారు. అతను భోజనం చేసి వారికి నమస్కరించాడు. అంతటితో కల ముగిసి అతడు మేల్కొన్నాడు. నాలుగురోజుల తరువాత అతనికి తన సోదరుని వద్దనుండి ఒక లేఖ వచ్చింది. అందులో అహ్మద్‌నగర్ జిల్లాకోర్టులో వారి ఇంటికి సంబంధించిన కేసు విషయంలో తేదీ. 1935, జూన్ 27న తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు వ్రాసి ఉంది. అంటే అతనికి కల వచ్చిన తేదీ, కోర్టు తీర్పు ఇచ్చిన తేదీ రెండూ ఒకటే అన్నమాట. ఈ సంఘటనతో అతనికి సాయిబాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. అప్పటినుండి అతడు సాయిబాబాకు అంకిత భక్తుడయ్యాడు.
సమాప్తం.

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part II by Late Shri.B.V.Narasimha Swamiji.
om sai ram for me also their is one desire to purchase this house.please sai make my desire come true.
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sree Sachidananda Samarda Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌹🥰🌸🤗🌺
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete🙏🙏🙏🙏🙏🙏Om Sai Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, amma nannalami kshamam ga chudandi valla badyata meede tandri, vaallaki manchi arogyanni prasadinchandi tandri, ofce lo anta bagunde la chayandi intaku minchi ye projects evvakunda chudandi, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri, anarogyam tho badha pade prathi okkariki manchi arogyanni prasadinchandi baba oka doctor la pls.
ReplyDelete