సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 218వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మరచిన కోరికను నెరవేర్చిన బాబా
  2. బాబా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు

మరచిన కోరికను నెరవేర్చిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు డి.సుజాత. మాది చిలకలూరిపేట. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. బాబా పిలిస్తే పలుకుతారని, ఆర్తితో పిలిస్తే ఇంకా త్వరగా పలుకుతారని, రక్షణనిస్తారని ఈ బ్లాగు ద్వారా నాకు తెలిసింది. అంతకుముందు నాకు మంచి జరిగితే నా గొప్పతనమని, చెడు జరిగితే దేవుడు చేశాడని అనుకునేదాన్ని. మా నాన్నగారు మాత్రం ఏం జరిగినా 'బాబా దయ' అంటూ ఉంటారు. గతనెలలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న మొదటి అనుభవం.

నేను ఈ సంవత్సరం వేసవికాలంలో సచ్చరిత్ర పారాయణ చేశాను. ఆ సమయంలో నేను, 'దసరా సెలవులలో శిరిడీలో సచ్చరిత్ర పారాయణ చేసే అవకాశం లభిస్తే బాగుంటుంది' అని అనుకున్నాను. ఆ తరువాత ఆ విషయం గురించి పూర్తిగా మరచిపోయాను. సెప్టెంబర్ నెలలో నేను గురుచరిత్ర పారాయణ చేశాను. సరిగ్గా అప్పుడే మా అన్నయ్య వాళ్ళు పిఠాపురం వెళ్ళడానికి ప్రణాళిక చేసుకుంటుంటే, నేను కూడా వాళ్లతో వస్తానని చెప్పాను. 2019, సెప్టెంబర్ 29న బయలుదేరాల్సి ఉంది. ఆలోగా మా స్నేహితురాలు పద్మావతి మేడం కుటుంబంతో శిరిడీ వెళుతూ, "మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది" అని నన్ను అడిగారు. నేను ఆవిడతో, "నేను పిఠాపురం వెళదామనుకుంటున్నాను, కాబట్టి మీతో రావడానికి నాకు కుదరదు. ఒకవేళ ఆ టూర్ రద్దయితే తప్పకుండా వస్తాన"ని చెప్పాను. ఆ తరువాత రోజు మా అన్నయ్య ఫోన్ చేసి, గోదావరి వరదల కారణంగా పిఠాపురం టూర్ క్యాన్సిల్ అయినట్లు చెప్పారు. వెంటనే నేను పద్మావతి గారికి ఫోన్ చేసి, "నేను కూడా మీతో శిరిడీ వస్తాన"ని చెప్పాను. వాళ్ళు నాకు కూడా టికెట్ బుక్ చేశారు. ఆశ్చర్యమేమిటంటే, నా టిక్కెట్ వాళ్ళ టిక్కెట్ కన్నా ముందే కన్ఫర్మ్ అయింది. ఆ తరువాత దసరా సెలవుల్లో శిరిడీలో సచ్చరిత్ర పారాయణ చేసుకోవాలని నేను అనుకున్న విషయం గుర్తుకు వచ్చింది. నేను మరచిపోయినా, ఆయన మరువకుండా ఈ భక్తురాలి కోరిక నెరవేరుస్తున్నందుకు మనసారా బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తరువాత ఆనందంగా శిరిడీ వెళ్లి బాబా సన్నిధిలో సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. బాబా దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనానంతరం అక్కడ ఉన్న ఒక భక్తుడు బాబా ఫోటో, ఒక చిన్న శాలువా, పూలదండ ఇచ్చారు. అలా బాబా నన్ను ఆశీర్వదించారు. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" నా శిరిడీ యాత్రకు కారణమైనవారికి నా ధన్యవాదాలు.

బాబా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. యు.ఎస్.ఏ. లో నివాసముంటున్నాను. బాబా చేసే అద్భుతాలు మన ఉహకందనివి. నేను వాటిని వివిధ రీతులలో అనుభవిస్తున్నాను.అందుకు కారణం ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటూ, నాకు అవసరమైన వాటినన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవడమే.

నా మొదటి అనుభవం ప్రపంచంలో టెక్ దిగ్గజం వంటి కంపెనీలో ఉద్యోగం పొందడం గురించి. నేను చాలా కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కానీ నేను కలలుగంటున్న ఉద్యోగం నాకు రాలేదు. నేను బాబాను ప్రార్థించిన తరువాత ఆయన నన్ను ఎంత గొప్ప సంస్థలో చేర్చారంటే,  ప్రపంచంలోనే టెక్ దిగ్గజం వంటి కంపెనీ అది. అలాంటి కంపెనీలో  ఇంటర్వ్యూను నేను సమర్థవంతంగా పూర్తిచేయగలుగుతానని కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా కేవలం బాబా కృప వల్లనే సాధ్యమైంది.

ఇక నా రెండవ అనుభవానికి వస్తే... ఇటీవలి ఒక శనివారం రాత్రి 10:15 సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్నాను. నాతోపాటు నా కొడుకు కూడా కారులో ఉన్నాడు. నా కారు హెడ్ లైట్లు ఆన్ చేసి లేవన్న సంగతి గమనించకుండానే నేను కారు నడుపుతున్నాను. డ్రైవింగులో నాకు కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ, లైట్లు ఆన్ చేశానో లేదో అని నా ముందే ఉన్న స్పీడోమీటర్లో కూడా గమనించలేదు. కారణం, రహదారిపై ఇతర వాహనాలు వెళుతున్నందున వాటి లైటింగులో నా కారు లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయని నేను గుర్తించలేకపోయాను. ఆ విషయం నాకు అర్థమయ్యేలా చేయడానికి ఎడమవైపు నుండి వస్తున్న ఒక వ్యక్తి తన వెహికిల్ హెడ్ లైట్లను ఆన్&ఆఫ్ చేయడం ప్రారంభించాడు. కానీ అది అర్థంకాక నేను అలాగే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాను. 5 నిమిషాల తరువాత ఇద్దరు పోలీసులు నా కారు ఆపారు. నేను కారు పక్కకు తీసి ఆపాను. 5 సంవత్సరాల నుంచి  డ్రైవింగ్‌ చేస్తున్న నన్ను పోలీసులు ఆపిన మొదటి సందర్భమది. నేను చాలా భయపడి, నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థించాను. ముఖ్యంగా నేను నా కొడుకు గురించి ఆందోళనపడ్డాను. ఎందుకంటే, మామూలుగా రోడ్డుమీద సిగ్నల్స్ వద్ద కాసేపు కారు ఆపినా వాడు ఏడుస్తాడు. మా బాబు ఏడవకుండా చూడమని బాబాను మరీ మరీ అడిగాను. నా ప్రార్థన విని బాబా నన్ను రక్షించారు. నిజంగా అది అద్భుతం. పోలీసులు నవ్వుతూ, "మేడమ్! దయచేసి మీ కారు హెడ్ లైట్లను ఆన్ చేయండి. రాత్రులలో లైట్లు లేకుండా వెళ్లడం మీకు భద్రత కాదు. మేము మీకు ఒక హెచ్చరిక మాత్రమే చేస్తున్నాం. మీరేమీ ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు" అని అన్నారు. వావ్! నా ఆనందానికి హద్దులు లేవు. రోడ్డుమీద ఇరవై నిమిషాలు కారు ఆగి ఉన్నప్పటికీ నా కొడుకు అస్సలు ఏడవలేదు. మౌనంగా జరిగేదంతా చూస్తూ ఉన్నాడు. బాబా చేసే అద్భుతాలు అంతులేనివి. "బాబా! మీకు చాలా ధన్యవాదాలు". 

4 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  3. Om Sairam ��

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo