ఈ భాగంలో అనుభవాలు:
- ఊదీ లీలలు
- పోగొట్టుకున్న బ్యాగు తిరిగి దొరికేలా చేశారు బాబా
ఊదీ లీలలు
బహ్రెయిన్ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిసోదరులందరికీ నా నమస్కారములు. నేను బాబాకు సాధారణ భక్తురాలిని. ముందుగా నేను చాలాకాలం తరువాత ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త తీవ్రమైన బి.పి.పి.వి(Benign paroxysmal positional vertigo)తో చాలా బాధపడ్డారు. బాబా దయతో కొన్ని సంవత్సరాలకి ఆ సమస్య నుండి ఆయన బయటపడ్డారు. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు ఆయన తీవ్రమైన తలభారంతో బాధపడుతుంటారు. ఆయనకి తలనొప్పి వచ్చిన ప్రతిసారీ నేను భయంతో అల్లాడిపోతాను.
కొన్ని నెలల క్రితం ఒకసారి మావారు ఆఫీసులో ఉండగా హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. ఆయన పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాగాని ప్రయోజనం లేకపోయింది. ఆయన ఇంటికి వచ్చాక నేను ఆయన పరిస్థితి తెలుసుకుని, "బాబా! అరగంటలోగా నా భర్తకు తలనొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేయండి" అని బాబాను ప్రార్థించి ఊదీని నీళ్లలో కలిపి నా భర్తకిచ్చాను. ఊదీ అద్భుత మహిమ వలన అరగంటలో ఆయనకు తలనొప్పి తగ్గిపోయింది.
ఇంకో సందర్భంలో నా భర్త కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు కూడా నేను బాబా ఊదీని నీళ్లలో కలిపి ఆయనకిచ్చాను. దానితో ఆయనకి నయమైంది.
మరో అనుభవం: మావారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఉద్యోగం చేస్తున్నారు. ఒకసారి ఆఫీసులో కొన్నిరోజులపాటు పని ఒత్తిడి చాలా ఎక్కువైంది. అప్పుడు ఉన్నట్టుండి ఆయనకి బి.పి ఎక్కువై తల వెనుకభాగంలో తీవ్రమైన నొప్పి మొదలైంది. తనకి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆఫీసు నుండి త్వరగా వచ్చే వీలులేకపోయింది. పోనీ సిక్ లీవ్ తీసుకుందామంటే నెలాఖరులోగా ఆయన మేనేజ్‌మెంట్‌కు నివేదిక సమర్పించాల్సివుంది. ఆఫీసు నుండి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాక ఆయన నాతో తన తలనొప్పి గురించి చెప్పారు. నేను డాక్టర్ దగ్గరకు వెళ్దామని అన్నాను. కానీ ఆయన చాలా అలసిపోయి ఉన్నందున వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఇక చేసేది లేక నేను, "బాబా! ఉదయానికల్లా నా భర్త తలనొప్పి తగ్గిపోతే, ఈ అనుభవంతోపాటు మునుపటి అనుభవాలను కూడా బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించి మావారికి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చాను. బాబా దయవల్ల ఉదయానికి నా భర్త తలనొప్పి తగ్గిపోయి, బి.పి కూడా సాధారణ స్థాయికి వచ్చింది. "బాబా! చాలా చాలా కృతజ్ఞతలు. అజ్ఞానంతో తెలిసీ తెలియక చేసిన మా తప్పులను దయచేసి క్షమించి మీ ప్రేమను మాపై కురిపించండి".

పోగొట్టుకున్న బ్యాగు తిరిగి దొరికేలా చేశారు బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
దాదాపు 10 సంవత్సరాల నుండి నేను సాయిబాబాకు భక్తురాలిని. ఆయనలేని జీవితాన్ని నేను ఊహించలేను. నా జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
ఇటీవల మేము శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు పూణేలో ఉన్న గణపతి ఆలయం, గురుద్వారా, మరికొన్ని ఇతర ప్రదేశాలను సందర్శించాలని అనుకున్నాము. ముందుగా గణపతి ఆలయాన్ని దర్శించిన తరువాత క్యాబ్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో గురుద్వారాకు వెళ్ళాము. ఆటో దిగే సమయంలో మా అత్తగారు తన బ్యాగును ఆటోలో మరచిపోయారు. అందులో డబ్బు, డైమండ్ చెవిరింగులు ఉన్నాయి. ముఖ్యంగా శిరిడీ ప్రసాదం, ఊదీ కూడా ఆ బ్యాగులోనే ఉండటంతో నేను చాలా కలతచెందాను. ఆటోడ్రైవరును సంప్రదించడానికి ఫోన్ నెంబర్ కూడా మావద్ద లేదు. కాబట్టి ఏమి చేయాలో అర్థం కాలేదు. శిరిడీ పర్యటనలో అలా జరగడం నేను అపశకునంగా భావించాను. బాబా తన భక్తులకు ఏ చెడూ జరగనివ్వరని తెలిసినా కూడా నేను బాధపడకుండా ఉండలేకపోయాను. మళ్ళీ మా బ్యాగు దొరుకుతుందనే ఆశ లేకపోయినప్పటికీ మేము గురుద్వారా వద్దే ఎక్కువ సమయం వేచివుందామని నిర్ణయించుకున్నాము. ఆ సమయమంతా నేను బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. కొంతసేపటికి ఆయన అద్భుతం చేసారు. ఆటోడ్రైవర్ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా బ్యాగ్ మాకు తిరిగి ఇచ్చాడు. నేను అస్సలు ఊహించనిది నా కళ్ళముందు జరిగేసరికి బాబా చూపిన దయకు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా శరీరమంతా రోమాంచితమైంది. ఈ అద్భుతమైన అనుభవాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. "బాబా! నాతోనే ఉంటూ నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి మీ ఆశీస్సులు సదా నాపై ఉంచండి".
Sainathmaharajuki jai om sainathaya namaha
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏
ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయ సాయిరాం
Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete