- ఆపద్బాంధవుడు శ్రీ సాయినాథుడు
- బాబా అనుగ్రహంతో పూర్తిగా తగ్గిన జ్వరం
ఆపద్బాంధవుడు శ్రీ సాయినాథుడు
సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతి తమను ఒక పెద్ద ప్రమాదం నుండి బాబా కాపాడిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ సభ్యులకు, సాయిభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు జ్యోతి. శ్రీ సాయినాథుడు ఎప్పుడూ మనతో ఉంటారనడానికి నిదర్శనంగా మా జీవితంలో జరిగిన ఒక లీలను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
2014లో ఒకసారి మేము గాణ్గాపురం బయలుదేరాము. సాధారణంగా మేము దూరప్రయాణాలు చేసేటప్పుడు తెల్లవారుఝామునే బయలుదేరుతాము. కానీ ఆసారి మాత్రం అప్పటికప్పుడు అనుకుని సాయంత్రం 5 గంటలకు కారులో బయలుదేరాము. ప్రయాణ సమయం ఐదు గంటలు కనుక రాత్రి పది గంటలకల్లా గాణ్గాపురం చేరుకుంటామని అనుకున్నాము. కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన జహీరాబాద్ వెళ్లేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అక్కడ భోజనాలు చేసి బయలుదేరాము. హుమ్నాబాద్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఆ హైవే నుండి గుల్బర్గా వైపుకి తిరిగాము. అప్పటికి రాత్రి పది గంటలైంది. అక్కడ నుండి రోడ్డు ఖాళీగా ఉంది. చాలా చీకటిగా కూడా ఉంది. ఆ రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉన్నాయి. చీకట్లో సరిగా కనపడటంలేదు. రోడ్డు ఖాళీగా ఉండటం వలన మావారు కారు వేగంగా నడపడం ప్రారంభించారు. ఆ వేగంలో మలుపు చూసుకోలేదు. అలా వేగంగా వెళ్తూ మలుపును గమనించి ఉన్నట్టుండి కారు ప్రక్కకు తిప్పేసరికి అక్కడ ఒక చిన్న బండరాయి ఉండటంతో అంత వేగంలో కారు ఆ బండరాయికి కొట్టుకుని అదుపుతప్పింది. స్టీరింగ్ పనిచేయడం మానేసింది. నాకు వెంటనే ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని అనిపించింది. వెంటనే పెద్దగా “బాబా, బాబా” అని అరవసాగాను. ఈలోగా కారు రోడ్డు మీదనుండి ప్రక్కకి వెళ్ళింది. అక్కడ కాస్త ఎత్తుగా ఉంది (అవతల వైపు లోయ ఉంది. ఈ విషయం మాకు తిరుగు ప్రయాణంలో తెలిసింది). దానిమీదకి కారు స్పీడుగా ఎక్కేసింది. ఒక్కక్షణం ఉంటే కారు లోయలో పడిపోయేదే. కానీ అకస్మాత్తుగా స్టీరింగ్ దానంతటదే ప్రక్కకు తిరిగింది. కారు ప్రక్కకి తిరిగి ఒక వైపుకి ఒరిగినట్టుగా ఆగిపోయింది. స్టీరింగుని మావారు తిప్పలేదు. అసలు ముందు స్టీరింగే పని చేయలేదు. ఒకవైపు డోర్స్ లాక్ అయిపోయాయి. ఈ లోపున రోడ్డు మీద వెళ్లే వేరే కారువాళ్ళు ఆగి మమ్మల్ని కారులో నుండి బయటికి తీశారు. ఆశ్చర్యమేమిటంటే, కారులో ఉన్న మా ఐదుగురిలో ఎవ్వరికీ చిన్న దెబ్బ కూడా తగల్లేదు. కారుకి కూడా ఏమీ కాలేదు. బాబానే మమ్మల్ని కాపాడారు. సరిగ్గా 10.15p.m. కి ఈ సంఘటన జరిగింది. అదే సమయంలో మా అమ్మాయి బాబా ఫోటో దగ్గరికి వెళ్లి, “బాబా! మా అమ్మావాళ్ళని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు!” అని చెప్పిందట. మా అందరి ప్రార్థనలు విని బాబా వెంటనే మమ్మల్ని రక్షించారు. మమ్మల్ని కారులో నుండి బయటకు తీసినవారు కారును స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది మొరాయించింది. ఇంతకుమించి విచిత్రమైన విషయం ఏమిటంటే, అదే సమయానికి ఒక మినీ బస్సు అటువైపుగా రావడం, దానిలో సరిగ్గా ఐదుగురికి మాత్రమే స్థానం ఉండటం. ఆ బస్సులోని యాత్రికులు మమ్మల్ని సురక్షితంగా గుల్బర్గా చేర్చారు. అక్కడ ఒక హోటల్లో బస చేసి ఆ మరుసటిరోజు గాణ్గాపురంలో స్వామిని దర్శించుకున్నాము. ఆ తరువాత కారు బాగుచేయించుకుని తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకున్నాము.
నిజంగా మన రక్షకుడు సాయి. బాబా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారనడానికి ఇది చక్కటి నిదర్శనం. ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన మనల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతారు. సాయే సత్యం, సాయే నిత్యం, సాయే సమస్తం.
సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా అనుగ్రహంతో పూర్తిగా తగ్గిన జ్వరం
‘సాయి మహరాజ్ సన్నిధి’కి శతకోటి వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం మావారికి సంబంధించినది. ఈమధ్య మావారికి జ్వరం వచ్చింది. సాధారణంగా తనకి జ్వరం వస్తే అంత త్వరగా తగ్గదు. పైగా ఇప్పుడు అంతటా కరోనా వ్యాపించి ఉంది. దాంతో మాకు చాలా భయమేసింది. అప్పుడు నేను బాబాకు నమస్కారం చేసుకుని, “బాబా! మాకు నువ్వే దిక్కు. మీ దయవల్ల నా భర్తకి జ్వరం తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించి, బాబా ఊదీ కొంచెం మావారి నుదుటన పెట్టి, కొంచెం నీళ్ళలో కలిపి ఇచ్చాను. బాబా నా కోరిక తీర్చారు. బాబా అనుగ్రహంతో మావారి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. కరోనా సమయంలో జ్వరమంటే చాలా భయమేసింది, కానీ బాబా దయతో ఎలాంటి సమస్య అయినా తీరుస్తారు.
ఓం సాయిరాం!
Om sai ram
ReplyDelete🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ReplyDeleteసద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeletesai always be with me
om sai ram mere sai Baba
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhavya sree
Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDeleteఓం సాయి రాం 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...,🌹🙏🏻🌹
ReplyDelete