ఈ భాగంలో అనుభవాలు:
- క్షేమంగా మా అబ్బాయిని ఇంటికి చేర్చిన బాబా
- సాయిబాబాపై నమ్మకముంటే చాలు
క్షేమంగా మా అబ్బాయిని ఇంటికి చేర్చిన బాబా
నెల్లూరు నుండి సాయిభక్తుడు వాసు తమకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! ముందుగా ఈ బ్లాగును నడుపుతూ అందరికీ బాబా లీలలను తెలియజేస్తున్న సాయికి ప్రణామములు. నా పేరు మోదడుగు.వాసు. మాది నెల్లూరు. మేము 2013 నుండి సాయి సేవకులం. సాయిబాబా సేవలో నిత్యం నిమగ్నమై ఉంటాము. మాకు బాబా అమోఘంగా చూపిన లీలను ఈ బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.
మా బాబు పేరు హనీష్ కుమార్. తను తడకు దగ్గరలోని వరదయ్యపాలెం అనే గ్రామంలో S.B.I బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2020, జులై 22, మంగళవారం సాయంత్రం బ్రాంచికి నాలుగు రోజులు సెలవులు ప్రకటించినందువల్ల తను నెల్లూరుకు రావాలనుకున్నాడు. కానీ తనున్న చోటునుండి వాహనాలేవీ అందుబాటులో లేనందువల్ల తన స్నేహితునితో బైకు మీద తిరుపతి వెళ్ళి అక్కడ నుండి బస్సులో నెల్లూరు రావాలనే ఆలోచనతో ఒక బస్సుకి రిజర్వేషన్ చేసుకున్నాడు. ఈ విషయం మాకు ముందుగా చెప్పలేదు. తీరా మా అబ్బాయి తిరుపతి వెళ్ళి ఆర్టీసీలో వాకబు చేస్తే ఆ బస్సు రద్దయిందని చెప్పారు. అప్పటికే సమయం సాయంత్రం 6-30 అయింది. ఒకవైపు మా అబ్బాయి బస్సుల గురించి వాకబు చేస్తూనే మాకు ఫోన్ చేసి, “నెల్లూరు వస్తున్నాను, నేను తర్వాత మాట్లాడతాను” అని కంగారుగా చెప్పి పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. మాకు ఏమీ అర్థంకాక భయమేసింది. మా పెద్దబాబుకి ఫోన్ చేసి మాట్లాడితే, తను వివరాలు చెప్పాడు. దాంతో నేను, నా భార్య ఆందోళన చెంది, “బాబా! అక్కడ మీ బిడ్డ ఇబ్బందిలో ఉన్నాడు. తను తిరుపతి నుంచి నెల్లూరు రావాలి. కానీ, రిజర్వేషన్ చేసుకున్న బస్సు రద్దయినందువల్ల ఎలా రావాలో తెలియక ఆలోచనలో ఉన్నాడు. మీరు మాయందు దయవుంచి బాబును క్షేమంగా నెల్లూరు చేర్చండి” అని బాబాను వేడుకున్నాము. అప్పటికే 2,3 బస్సులు తిరుపతి నుండి విజయవాడ బయలుదేరాయి. మా అబ్బాయి అడిగితే తనను ఎక్కనివ్వలేదు. సమయం 7-30 అయింది. మాకు ఒకటే ఆందోళన. మా బాబుకు ఫోన్ చేస్తే, ‘ఇంకా బస్సు ఎక్కలేద’న్నాడు. తను మధ్యాహ్నం రెండు గంటలకు తీసుకున్న ఆహారమే, మరలా ఏమీ తినలేదు. తిరుపతిలో లాక్ డౌన్ కాబట్టి షాపులు ఏమీ లేవు. ‘వాడికి ఆకలేస్తుంటుందేమో, తినడానికి ఎలా? బస్సులు లేకపోతే ప్రయాణం ఎలా?’ అని ఆలోచిస్తూ, పరిస్థితిని బాబాకు విన్నవించుకుని, “బాబా! మీరే మాకు దిక్కు. ఎలాగైనా బాబును క్షేమంగా ఇంటికి చేర్చండి” అని బాబాను మళ్ళీ మళ్ళీ వేడుకుంటూనే ఉన్నాము. రాత్రి 7-50 గంటలకు బాబా దయతో ఒక బస్సు వచ్చింది. డ్రైవరును అడిగితే, “విజయవాడకు టికెట్ తీసుకుని బస్సెక్కండి, నెల్లూరులో దించుతాము. కానీ ఊర్లోకి వెళ్తుందో లేదో చెప్పలేము. బైపాస్‌లో దించేస్తాము. దానికి అభ్యంతరం లేకపోతే ఎక్కండి” అన్నాడు. సరే, ఎలా అయితే అలా అవుతుందని బస్సు ఎక్కి మాకు ఫోన్ చేసి చెప్పాడు. మాకు మళ్ళీ ఆందోళన, ‘రాత్రి సమయంలో బైపాస్‌లో దించినట్లైతే ఇంటికి ఎలా వస్తాడు?’ అని. మళ్ళీ బాబాను వేడుకున్నాము. మా బాబు ఒక్కడే నెల్లూరులో దిగవలసి ఉంది. అందువలన ఊర్లోకి వెళ్ళే అవకాశం యాభై శాతం మాత్రమే ఉందన్నాడు డ్రైవర్. కానీ మన బాబా మా యందు దయవుంచి మా బాబును కనికరించి నెల్లూరు బస్టాండుకు రాత్రి 11 గంటలకు క్షేమంగా చేర్చారు. అదే బైపాస్‌లో దించినట్లైతే ఆ రాత్రి సమయంలో 10 కిలోమీటర్లు స్కూటీలో వెళ్ళి తీసుకురావాల్సి ఉండేది. కరుణామయుడైన మన బాబా మమ్మల్ని, మా బాబును ఏ విధంగానూ ఇబ్బందిపెట్టక బస్టాండులోనే దింపేలాగా ఆ డ్రైవరుకు ఆదేశాలిచ్చి మా బాబును క్షేమంగా ఇంటికి చేర్చారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!” ముందు తుఫానులాగా అలజడి రేపి తర్వాత తన బిడ్డలను క్షేమంగా చూసుకుంటారు మన బాబా. నమ్ముకున్నవారి నమ్మకాన్ని బాబా ఎన్నడూ వమ్ముచేయరు.
సదా సాయి సేవలో..
వాసు.మోదడుగు.
సాయిబాబాపై నమ్మకముంటే చాలు
సాయిభక్తుడు సందీప్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నా పేరు సందీప్. మూడు సంవత్సరాల క్రితం బాబా నా జీవితంలోకి వచ్చారు. నేనొక కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఒకసారి నా సహాధ్యాయుడు నాకు ‘సాయిలీలామృతం’ ఇచ్చి నన్ను పారాయణ చేయమని చెప్పారు. అప్పటినుండి నేను బాబాను నమ్మడం ప్రారంభించాను. మా సర్టిఫికెట్లన్నీ మా కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గర ఉంటాయి. నాకు నా సర్టిఫికెట్లు అవసరమై వాటిని ఇమ్మని ఎన్నిసార్లు అడిగినా ఆయన నాకు ఇవ్వలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నువ్వు తలచుకుంటే ఎంతసేపు? నిజంగా నువ్వు ఉంటే నా సర్టిఫికెట్లు నాకు ఇప్పించి నా సమస్యను పరిష్కరించు బాబా” అంటూ నా బాధ చెప్పుకుని ఏడ్చాను. బాబా నా మొర ఆలకించారు. బాబాను ప్రార్థించిన మరుసటిరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిచి, “నీ సర్టిఫికెట్లు తీసుకో!” అంటూ నా సర్టిఫికెట్లు నాకు ఇచ్చారు. ఆ కాలేజీలో ఎవ్వరికీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అలాంటిది నా సర్టిఫికెట్లు నా చేతికి రావటం బాబా అనుగ్రహమే. ఇలా బాబా నాకు చాలా విషయాలలో సహాయం చేశారు. వాటిని మరోసారి మీ అందరితో పంచుకుంటాను. నేను ఈమధ్య బాబాను అడిగాను, “బాబా! నాకు ఒక సమస్య ఉంది. మీ అనుగ్రహంతో ఆ సమస్య పరిష్కారమైతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని. బాబా దయవల్ల ఆ సమస్య పరిష్కారమైంది. ఆ అనుభవాన్ని కూడా త్వరలోనే మీతో పంచుకుంటాను. బాబాపైన నమ్మకం ఉంటే చాలు, అన్నీ బాబానే చూసుకుంటారు.
ఓం సాయిరామ్!
This comment has been removed by the author.
ReplyDeleteశాంతా చిత్తా మహా ప్రజ్ఞ సాయినాథ దయాధన
ReplyDeleteదయా సింధో సత్యస్వరూప మాయా తమవినాశన
నమామీశ్వరం సద్గురుం సాయినాథం!!!!
🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏🌟🙏
🙏🌺🙏సాయినాధుడు తన భక్తులను ఆఖరివరకు పరీక్షిస్తాడు..కానీ అంతం వరకు కాదు.మీ అనుభవాలు అనుభూతులు అద్భుతం...శ్రీ సాయినాథ శిరసా నమామి 🙏🌺🙏
Om Sai ram
ReplyDeleteom sai ram ,nothing is impossible to our sai,
ReplyDeleteBaba by your grace I have taken another mahaparayana group,so pls add new devotes in my second group, bow to sri sai
Om sai ram , ma babu ni kapadau tandri
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete