సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 488వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:
  1. నొప్పి నుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
  2. సాయిబాబాకు చేసిన ప్రార్థన - నయమైన తలనొప్పి

నొప్పి నుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా

సాయిభక్తురాలు శ్రీమతి షర్మిల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. నా పేరు షర్మిల. నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ అనే ఆరోగ్యసమస్య ఉంది. లాక్‌డౌన్ సమయంలో నా ఎడమకాలి పాదం మీది ఎముక బుడిపె లాగా పైకి వచ్చింది. జూన్ 8వ తేదీ నుండి డాక్టర్స్ అందరు రోగులను చూస్తున్నారని తెలిసి మావారు ముందుగా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆ తరువాత నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. డాక్టర్ నా కాలిని పరీక్షించి చూసి, “ఇప్పుడే దీనికి ఏమీ చేయవలసిన అవసరం లేదు, బుడిపె పెద్దది అయితే ఆపరేషన్ చేయాలి” అని చెప్పారు. అంతేగాక, నా మెడకు ఎక్స్-రే తీయించారు. అప్పటినుండి మెడ భాగమంతా నొప్పి ఎక్కువ అయింది. మందులు వేసుకుంటున్నా నొప్పి తగ్గలేదు. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ నొప్పి భరించలేక రోజూ ఏడుపు వచ్చేది. తరువాత నాకు బాబా గుర్తువచ్చి, బాబాకు నమస్కారం చేసుకుని, "స్వామీ! నా మెడనొప్పి తగ్గించు. మీ దయవల్ల మెడనొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో కొన్నిరోజులకి ఎక్స్-రే వల్ల వచ్చిన నొప్పి చాలావరకు తగ్గిపోయింది. బాబా దయవల్ల ఇప్పుడు బాగానే ఉంది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సాయిబాబాకు చేసిన ప్రార్థన - నయమైన తలనొప్పి

సాయిభక్తురాలు శ్రీమతి సుచిత్ర తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సుచిత్ర. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు, 2020, జులై 9న బాబా నాకు ప్రసాదించిన ఒక చక్కటి అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.

సాయి పాదాలకు నమస్కరిస్తూ.... 

ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సాయితండ్రిని నాకు మరింత దగ్గర చేసింది ఈ ‘సాయి మహారాజ్ సన్నిధి’. బాబా ఇదివరకు నా జీవితంలో ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇప్పుడు చెప్పబోయే అనుభవం చిన్నదే అయినా బాబా ప్రేమను నేను పూర్తిగా అనుభూతి చెందిన అనుభవమిది.

నేను జులై 5వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు విపరీతమైన తలనొప్పితో బాధపడ్డాను. ఈ బాధలో, ‘బాబా మా ఇంట్లో కొలువై ఉన్నార’న్న సంగతి కూడా మరచిపోయాను. బాబాతో నా బాధ చెప్పుకోవాలనే ఆలోచన కూడా నాకు రాలేదు.  ప్రతిరోజూ సాయి సచ్చరిత్రలో ఒక ఆధ్యాయం చదివే అలవాటున్న నేను జులై 9వ తేదీన ఆరోజు చదవాల్సిన అధ్యాయం చదువుతుంటే మనసులో ఒక ఆలోచన మెదిలి, బాబాకు నమస్కరించుకుని, "బాబా! నా ఈ తలనొప్పి రేపు మధ్యాహ్న ఆరతి లోపు తగ్గితే, వచ్చే గురువారం మీకు ఒక కొబ్బరికాయను సమర్పించుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన క్షణంనుంచే తలనొప్పి మెల్లమెల్లగా తగ్గుతూ తరువాతి రోజు, అంటే జులై 10 మధ్యాహ్న ఆరతి సమయానికి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. అంతేకాదు, ఆరోజు రాత్రి నేను ఒక మందిరానికి వెళ్లినట్టు, అక్కడ మెట్టు మెట్టుకూ పూజ చేసుకుంటూ వెళ్లి పూజారి చేతికి కొబ్బరికాయ సమర్పించినట్టు స్వప్నం వచ్చింది. ప్రార్థించగానే ఎంతో కృపతో నా తలనొప్పిని పూర్తిగా తగ్గించిన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

నేను అడగకుండానే బాబా నాకొక బహుమతి ఇస్తున్నారు, కానీ ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. అలా ఆగిపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. “బాబా! మీరు ఇవ్వబోయే బహుమతి కోసం మీరు చెప్పిన సబూరితో ఎదురుచూస్తుంటాను”. ఆ బహుమతిని బాబా నాకు ప్రసాదించగానే ఆ అనుభవాన్ని పంచుకోవటానికి మరలా మీ ముందుకు వస్తాను.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


5 comments:

  1. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    విశ్వవిశ్వంభరాన నావిర్భవించు
    విమల చైతన్య మీవ - యీ విధివిలాస
    జగతి నీదు లీలావిలాసమ్మె సుమ్ము
    సాధుజన పోష ! మృదుభాష ! సాయినాథ🙏💐🙏

    ReplyDelete
  2. Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
    Bhavya sree

    ReplyDelete
  3. సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo