ఈ భాగంలో అనుభవాలు:
- అతి భయానక ప్రమాదం నుండి కాపాడిన బాబా
- బాబా ఊదీ అద్భుతంగా పనిచేస్తుంది
అతి భయానక ప్రమాదం నుండి కాపాడిన బాబా
సాయిభక్తుడు చంద్రశేఖర్ తన తల్లిని బాబా కాపాడిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! నా పేరు చంద్రశేఖర్. ముందుగా బాబాకు, బాబా ప్రియభక్తులందరికీ నా నమస్కారాలు. కొన్ని సంవత్సరాలుగా మా కుటుంబసభ్యులందరం బాబా భక్తులం. నేను ఈమధ్య, అంటే సుమారు 15 రోజుల క్రితం మా బంధువు సహకారంతో సాయి మహారాజ్ సన్నిధి బ్లాగుకి సంబంధించిన ‘సద్గురు సాయి’ వాట్సప్ గ్రూపులో భాగస్వామినయ్యాను. ఆ గ్రూపులో చేరిన దగ్గరనుండి ప్రతిరోజూ గ్రూపు అడ్మిన్ పోస్ట్ చేసే సాయి వచనాలు మరియు భక్తుల అనుభవాలను శ్రద్ధాభక్తులతో చదువుతున్నాను. అలాగే నేను కూడా బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని బాబా భక్తులందరితో తొలిసారిగా పంచుకోవాలనుకుంటున్నాను.
సుమారు ఒక నెల క్రితం జరిగిన ఒక ప్రమాదం నుండి బాబా మా అమ్మగారిని కాపాడారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. 2020, జూన్ 23వ తేదీన ఆరేళ్ళ వయసున్న మా మేనకోడలి పుట్టినరోజు సందర్భంగా మా చెల్లి, బావగారు వారి పిల్లలతో మా ఇంటికి వచ్చారు. ఆరోజు మా కుటుంబసభ్యులందరం కలిసి మా మేనకోడలి పుట్టినరోజు వేడుక జరుపుకుని ఎంతో సంతోషించాము. ఆ మరుసటిరోజు జూన్ 24(బుధవారం)న మా అమ్మగారు వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ స్టవ్ దగ్గర పైప్ కట్ అవటం వల్ల గ్యాస్ బయటకు వచ్చి పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. అప్పటివరకు మా అమ్మ చుట్టూ తిరిగి ఆడుకుంటున్న పాపను అంతకుముందే నేను ప్రక్కకు తీసుకుని వెళ్ళాను. మేమిద్దరం ప్రక్కకు వెళ్ళగానే పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. మా అమ్మగారు వెంటనే బాబాను తలచుకుని ఆ మంటలలో నుండే వెళ్ళి సిలెండర్ దగ్గర ఉన్న రెగ్యులేటర్ ను ఆపేశారు. దాంతో మంటలు ఆరిపోయాయి, కానీ మా అమ్మగారి చీర కాలిపోయి తనకు చిన్న చిన్న గాయాలయ్యాయి. అవి అతి స్వల్పమైన గాయలు మాత్రమే, కానీ జరిగిన సంఘటన మాత్రం అతి భయంకరమైనది. ఆ శబ్దానికి వీధిలో ఉన్నవారందరూ మా ఇంటికి వచ్చి ‘ఏం జరిగింద’ని అడిగారు. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ మా అమ్మగారు అంత స్వల్పగాయాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. కేవలం ఆ బాబా చల్లని చూపువల్లే ఆ ప్రమాదం తప్పిందని మాకు తెలుసు. నిరంతరం మా అమ్మగారు చేసే సాయి నామస్మరణ వల్ల తను ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. మా కుటుంబసభ్యులందరికీ ఆరోజు అంతటి భయంకరమైన అనుభవం ఎదురైనా బాబా దయవల్ల అంతా చక్కబడింది. బాబా ఇలాగే ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మా కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని మా కుటుంబమంతా ఆశిస్తోంది. ఇలాగే బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను కూడా ఈ బ్లాగులో పంచుకోవాలని ఆశిస్తున్నాను. బాబా కృపతో మరోసారి వాటిని పంచుకుంటాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా ఊదీ అద్భుతంగా పనిచేస్తుంది
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు బాబా ఊదీ మహిమను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి బృందానికి నా కృతజ్ఞతలు. బాబా ఊదీ మహిమతో నాకు కలిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. వారం రోజుల క్రితం మా పాపకు బాగా జ్వరం వచ్చింది. జ్వరం తగ్గటానికి టాబ్లెట్ వేశాను. తరువాత పాపకు జ్వరం తగ్గించమని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళల్లో కలిపి తనచేత త్రాగించాను. ఊదీ మహిమతో రెండు రోజుల తర్వాత జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మా కుటుంబంలో ఎవరికి ఏ నొప్పి ఉన్నా, అలసట ఉన్నా బాబా ఊదీని నీళ్లలో కలిపి త్రాగుతాము. ఊదీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మా పాప రోజూ బాబా ఊదీని తింటూ ఉంటుంది. బాబా మాకు ఎన్నోసార్లు చాలా సహాయం చేశారు. బాబా ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని, బాబా ఎప్పుడూ మాతో ఉండాలని శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ బాబాను వేడుకుంటున్నాను.
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.
om sai ram all experiences are nice.baba saves his devotees in time.he is sadguru.i love you sai.
ReplyDelete🙏🌷🙏సర్వ జన రక్షక ...సకల జీవ పోషక.. ముక్తి ప్రదాత....విశ్వ విధాత.. శిరిడి నివాస నమోస్తు దేవాది దేవ సాయినాథ.. పాహిమాం రక్ష రక్ష 🙏🌷🙏
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ReplyDeleteOm Sairam
ReplyDeleteSairam always be with me
Om sai ram
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏🙏🙏
ReplyDeleteBhavya sree
Om Sri Sairam 🌷🌹🙏🙏🙏🌹🌷
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః
This comment has been removed by the author.
ReplyDelete