ఈ భాగంలో అనుభవాలు:
- 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుని నడిపిస్తున్నది తామేనని మరోసారి ఋజువు చేసిన బాబా
- ఆయన ఎవరో కాదు, ఆ బాబానే!
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుని నడిపిస్తున్నది తామేనని మరోసారి ఋజువు చేసిన బాబా
అందరికీ సాయిరాం! నా పేరు శ్రావణి. బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను నేను ఇంతకుముందు మన బ్లాగులో పంచుకున్నాను. కానీ మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుని బాబా స్వయంగా పర్యవేక్షిస్తున్నారనే అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు ముందుగా అందరినీ క్షమించమని కోరుతున్నాను.
మన బ్లాగులో 'సాయిభక్తుల అనుభవమాలిక' శీర్షిక క్రింద ప్రతిరోజూ ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలను బాబా ఆశీస్సులతో నేను షెడ్యూల్ చేస్తుంటాను. నేను షెడ్యూల్ చేశాక అన్నయ్య ఒక్కసారి చూసి ఏవైనా సరిచేయాల్సి ఉంటే సరిచేసి మళ్ళీ షెడ్యూల్ చేస్తారు. అయితే సుమారు నెల, రెండు నెలల క్రితం ఒకరోజు నేను ఆ మరుసటిరోజు కోసం 'అనుభవమాలిక' షెడ్యూల్ చేశాక, అన్నయ్య చూసి ఏదో పని ఒత్తిడిలో ఉండి దాన్ని షెడ్యూల్ చేయడం మరచిపోయారు. దాంతో అది డ్రాఫ్ట్స్‌లో ఉండిపోయింది. సాధారణంగా ఒకసారి నేను ప్రివ్యూ చూసి షెడ్యూల్ చేశాక మళ్ళీ చూడను. అందువల్ల అది డ్రాఫ్ట్స్‌లో ఉండిపోయిందన్న విషయం నాకు కూడా తెలియదు. అది డ్రాఫ్ట్స్‌లో ఉండిపోయినందువల్ల ప్రతిరోజూ శిరిడీలో కాకడ ఆరతి ప్రారంభమయ్యే సమయానికి బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవమాలిక ఆరోజు ప్రచురితం కాదు. దాంతో బాబా ప్రేమకోసం బ్లాగును ఓపెన్ చేసే ఎంతోమంది సాయిభక్తులు నిరాశకు గురవుతారు. అలా జరగడం మాకు కూడా బాధాకరమే. కానీ, అటువంటి పరిస్థితి రాకుండా చేసి, బ్లాగుని తాము స్వయంగా పర్యవేక్షిస్తున్నామనే అనుభవాన్ని బాబా నాకు ప్రసాదించారు.
ఆరోజు వేకువఝామున 4 గంటల సమయంలో నేను గాఢనిద్రలో ఉండగా, "ఒకసారి బ్లాగ్ చూడు" అని చెబుతూ బాబా నన్ను నిద్రలేపుతున్నట్లు అనుభవమై నాకు మెలకువ వచ్చింది. "ఏమిటిది, బాబా ఇలా చెప్తున్నారు? ఏమైంది?" అని అనుకుంటూ నా ఫోన్ ఆన్ చేసి, బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆరోజు ప్రచురితం కావలసిన 'అనుభవమాలిక' డ్రాఫ్ట్స్‌లో ఉండటం కనిపించింది. కాకడ ఆరతి ప్రారంభవమవడానికి ఇంకా కాస్త సమయముంది. "ఇందుకే బాబా బ్లాగ్ చూడమని చెప్పార"ని అర్థమై, వెంటనే ‘అనుభవమాలిక’ను షెడ్యూల్ చేశాను. బాబా నాకు గొప్ప అనుభవాన్నిచ్చారని ఆనందంతో మురిసిపోయాను. ఇలా మన ‘సాయి మహారాజ్ సన్నిధి’ని నడిపిస్తున్నది తామేనని బాబా మరోసారి ఋజువు చేశారు. ఇన్ని రోజుల తరువాత ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలని వ్రాస్తుంటే, బాబా ఆనాడు చూపిన ఆ ప్రేమను మళ్ళీ ఆస్వాదిస్తూ చాలా ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాను. "బాబా! ఇలాగే మీ ప్రేమను మీ బిడ్డలమైన మా అందరికీ సదా పంచుతూ మీ ఈ బ్లాగ్ కలకాలమూ వర్ధిల్లేలా ఆశీర్వదించండి. మా అందరి తరఫున మీకివే కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు బాబా!"
బాబా నన్ను నిద్రలేపి హెచ్చరించడం ఇది రెండవసారి. ఇదివరకు ఒకసారి నేను మా శిరిడీ ప్రయాణం కోసం మధ్యాహ్నం ట్రైనుకి అనుకొని పొరపాటున అర్థరాత్రి ట్రైనుకి టికెట్లు బుక్ చేశాను. మరునాడు ప్రయాణమనగా ఆ రాత్రి, "టికెట్, టికెట్" అంటూ బాబా నన్ను నిద్రలేపారు. నిద్ర లేచి టికెట్ చూసుకుంటే, నేను బుక్ చేసిన ట్రైన్ మరో గంటలో మేము ఎక్కాల్సిన స్టేషనుకి చేరుకుంటుందని అర్థమైంది. నా పొరపాటు గ్రహించి వెంటనే మరుసటిరోజు సాయంత్రం ట్రైనుకి టికెట్లు బుక్ చేశాను. అలా నన్ను ముందే హెచ్చరించి మాకు ఏ ఇబ్బందీ లేకుండా బాబా చూసుకున్నారు.
ఇప్పుడు ఒక సాయిభక్తునికి బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాన్ని మీ ముందుంచుతాను. 2020, ఆగష్టు 4, మంగళవారంనాడు అన్నయ్య 'స్తవనమంజరి' పిడిఎఫ్ కావాలని అడిగారు. ఆ పిడిఎఫ్ కోసం నేను ఇంటర్నెట్ లో వెతుకుతున్న క్రమంలో ఒక బ్లాగ్ ఓపెన్ చేశాను. ఆ బ్లాగులోని కామెంట్ సెక్షన్ లో ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. అది చదివి నాకెంతో ఆనందం కలిగింది. వెంటనే ఆ బాబా ప్రేమను మీ అందరికీ కూడా పంచాలని అనిపించింది. చక్కటి బాబా ప్రేమను మీరు కూడా ఆస్వాదించండి.
ఆయన ఎవరో కాదు, ఆ బాబానే!
నేను(రవికుమార్), నా స్నేహితుడు కలిసి 2010, మే నెలలో మొదటిసారి శిరిడీ వెళ్ళాము. బాబా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. భోజనం కోసం ఆంధ్రా హోటల్‌కి వెళ్ళాము. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో అక్కడ మాకు భోజనం లభించలేదు. ఒకవైపు బాగా ఆకలేస్తోంది, మరోవైపు ట్రైన్ బయలుదేరే సమయం దగ్గరపడుతోంది. మాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. మండుటెండలో భోజనం లభించే హోటల్స్ కోసం వెతుకుతున్నాము. అంతలో అచ్చంగా బాబావలె వస్త్రాలు ధరించిన ఒక మధ్యవయస్కుడు కనపడి, "సాయిబాబా ప్రసాదం వుంది. కేవలం పది రూపాయలే. చపాతీలు, కొద్దిగా అన్నం, సాంబారు పెడతారు. వెళ్లి తినండి" అని మరాఠీలో చెప్పాడు. నేను అతను చెప్పింది అర్థమయ్యీ కానట్లు చూస్తుంటే, "రండి, చూపిస్తాను" అన్నాడతను. సరేనని నేను, నా స్నేహితుడు అతని వెనుక అడుగులు వేశాము. ఆ మండుటెండలో నేను, నా స్నేహితుడు ఎంతో కష్టపడి నిట్టూరుస్తూ నడుస్తుంటే, చెప్పులే లేని అతను సునాయాసంగా చకచకా నడుచుకుంటూ ప్రసాదాలయం దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అక్కడికి చేరుకున్నాక, "అక్కడే కౌంటర్ ఉంటుంది. పది రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోండి" అని దారి చూపించాడు. మేము రెండడుగులు ముందుకు వేసి అతనికి కృతజ్ఞతలు చెబుదామని వెనక్కి తిరిగి చూస్తే, అతనక్కడ కనిపించలేదు. చుట్టూ చూశాము, అతని జాడ ఎక్కడా లేదు. మాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. “ఆయన ఎవరో కాదు, ఆ బాబానే!” అని అప్పుడు అర్థమైంది. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.
- రవికుమార్ పెదిరెడ్ల.
Jai sairam
ReplyDeleteom sai ram how lucky that devotee is sais darshan he got.i want to see him in dreams.many leelas are there
ReplyDeleteOm Sai ram
ReplyDelete🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
ReplyDeleteయస్య దర్శన మాత్రేన నశ్యంతి వ్యాధి కోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాథం నమామ్యహం!!
!!🙏🌺🙏ఓం సాయిరామ్🙏🌺🙏!!
!!🙏🌺🙏ఓం సాయిరామ్🙏🌺🙏!!
!!🙏🌺🙏ఓం సాయిరామ్🙏🌺🙏!!
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Sri Sai Jaya Jaya Sai 💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam thandri
ReplyDeleteOm Sairam thandri
ReplyDeleteBaba me prema na pyna kuda chupinchu thandri sainatha
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🌸🌻🌺🙇🙏🌸🌻🌺Om sri Sainathayanamha🙏🙏🙏🌸🌻🌺
ReplyDelete
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి 🌹🙏🏻🌹
Baba! Eee nee bhaktualunu Inka entha kalam test chestav tandri! Tondaraga nenu korukunna company lo job vacheyyela cheyii SaiNadha 🙏🌺🌹🌹🌺. Niku nenu nacchina bhakturalunu kadha baba
ReplyDelete