- తక్షణమే బాబా ప్రసాదించిన ఆశీస్సులు
- అకస్మాత్తుగా బాబా అద్భుతం చేశారు
తక్షణమే బాబా ప్రసాదించిన ఆశీస్సులు
ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
మా ఇంటిలో అందరం సాయిభక్తులం. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత చిటికెడు బాబా ఊదీ పెట్టుకోవడం మా కుటుంబసభ్యులందరికీ అలవాటు. ఒకసారి బాబా వరప్రసాదమైన రెండున్నర సంవత్సరాల మా బాబు వరుసగా రెండురోజుల పాటు తనకు కడుపునొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడు. ఆరోజు నేను ఆఫీసు నుండి వచ్చేసరికి మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. హఠాత్తుగా కొద్దిసేపటి తరువాత తనకు కడుపునొప్పిగా ఉందని అన్నాడు. నా భార్య, తల్లి కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్నించారు. నేను వాడి బాధను తగ్గించమని బాబాను ప్రార్థించి, తనకి బాబా ఊదీ ఇచ్చాను. అది తీసుకున్న కొద్ది క్షణాల్లోనే వాడు హాయిగా నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి పూర్తి ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉన్నాడు. "బాబా! మీ తక్షణ సహాయానికి ధన్యవాదాలు. మీరు లేకుంటే మేము లేము. ఎప్పుడూ మమ్మల్ని ప్రేమిస్తూ రక్షణనివ్వండి".
మరో అనుభవం:
2020, ఫిబ్రవరి 13, గురువారంనాడు నేను సాయి మందిరానికి వెళ్ళాను. మందిరం చాలా రద్దీగా ఉంది. కొందరు భజన చేస్తూ పాటలు పాడుతున్నారు. నేను వాళ్ళని దాటుకుంటూ బాబా దగ్గరకి చేరుకోగానే, అప్పటికే పాడుతున్న పాట ముగిసింది. నేను నాకిష్టమైన "'చలీ జా రహీ హై.. కినారే కినారే.. మేరీ నావ్ సాయీ జీ తేరే సహారే' అనే పాటను నాకు వినిపించండి బాబా" అని ప్రార్థిస్తున్నాను. అంతలోనే ఆశ్చర్యం! అద్భుతం! భజన బృందం పాడిన తదుపరి పాట అదే! నేను ఆనందపారవశ్యంతో భక్తిగా బాబాకు నమస్కరించుకుని, ప్రతి భక్తుడి మదిలో ప్రతి క్షణం కలిగే కోరికలను వింటున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
"ఓ దేవా! మీరు లేకుండా ఈ ప్రపంచంలో మేము ఉండలేము. ఎప్పుడూ మీ అండ మాకు అనుగ్రహించండి. నాది ఇంకో కోరిక బాబా. నా భార్య డ్రైవింగ్ నేర్చుకుంటోంది. కానీ, ప్రధాన రహదారులపై ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా డ్రైవ్ చేయలేకపోతోంది. తనకి ఆ ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. ఆ లీలను కూడా తోటి భక్తులతో పంచుకునేలా అనుగ్రహించండి. త్వరలోనే అది నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. లవ్ యు బాబా".
లోకా సమస్తా సుఖినో భవంతు.
అకస్మాత్తుగా బాబా అద్భుతం చేశారు
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఒకసారి నేను నా పుట్టినరోజును బెంగళూరులో ఉన్న నా బంధువులతో కలిసి జరుపుకోవాలని అనుకున్నాను. కానీ అప్పటికి కొద్దిరోజుల క్రితమే నేను బెంగళూరు వెళ్లి వచ్చినందున మళ్ళీ పుట్టినరోజు కోసం బెంగళూరు వెళ్లడమంటే పూర్తిగా అసాధ్యమైన విషయం. ఆగష్టు మొదటివారంలో నా పుట్టినరోజనగా, జూలై 28 వరకు బెంగళూరు వెళతానన్న సూచనే లేదు. అప్పుడు నేను నా కోరికను బాబా ముందుంచి ఆయనను ప్రార్థించాను. బాబా మన ప్రతి ప్రార్థనా వింటారు. అకస్మాత్తుగా అద్భుతం జరిగింది. మరుసటిరోజు, అంటే జూలై 29న మా నాన్న అకస్మాత్తుగా నన్ను, నా సోదరిని పిలిచి, "సెలవులు ఉన్నాయి కదా, బెంగళూరు వెళ్లాలనుకుంటున్నారా?" అని అడిగారు. అది విని నా నోట మాట లేదు. వెంటనే నేను, నా సోదరి మా బ్యాగులు సర్దుకుని అదేరోజు బెంగళూరు చేరుకున్నాము. ఆనందంగా నేను నా పుట్టినరోజుని నా బంధువులతో జరుపుకున్నాను. అంతేకాదు, నా కుటుంబం ఒక అందమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. అది నేను చాలా ఆశీర్వాదపూర్వకంగా అనుభూతి చెందాను. ఇదంతా బాబా వల్లనే జరిగింది. "ధన్యవాదాలు బాబా".
మన ప్రార్థనలు చిన్నవైనా, పెద్దవైనా బాబా వాటిని నెరవేరుస్తారు. మనం ప్రార్థించకపోయినా, మనసులోనే గుసగుసలాడినా మన హృదయం బాబాకు తెలుసు, ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారు. మనకుండాల్సింది ఆయనపై చెదరని విశ్వాసం, తిరుగులేని సహనం, సంపూర్ణ శరణాగతి మాత్రమే. ఎందుకంటే బాబా చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు, ఆయన సమాధానాలు ఎప్పటికీ అవాస్తవం కావు. బాబా ఎల్లప్పుడూ మనం కోరిన దానికంటే ఎక్కువే ఇస్తారు. నా అనుభవాన్ని చదివిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. "ఈ అనుభవాన్ని చాలా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు క్షమించండి బాబా. చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నదానికి ధన్యవాదాలు అన్న పదం కూడా చాలా చిన్నది. లవ్ యు సాయీ. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".
🙏🌺🙏ఓం సాయి రామ్🙏🌺🙏
ReplyDeleteom sai ram every day i read all experiences.i want to share my experiences with baba in this blog .how to share. i don't know. please explain me
ReplyDelete
Deletehttps://youtu.be/Tq3BY-vaF3c
👆Hope this link will help you out.
Om Sairam🙏
సాయి మీరు బ్లాగులో ఇంకాస్త కిందికి వెళితే, అక్కడ వివరంగా మీ అనుభవాలు ఎలా పంచుకోవాలో తెలియజేశాం. అయినా మీకోసం ఇక్కడ ఇస్తున్నాను
Deleteవిజ్ఞప్తి: సాయి భక్తులకు మనవి. బాబా మీకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటే మీ అనుభవాలను...
1. వీలయితే తెలుగులో టైపు చేయండి.
2. లేకుంటే ఇంగ్లీషులో అంటే *'sai bandhuvulaku namaskaram'* ఇలా టైపు చేయండి.
3. లేకుంటే స్పష్టంగా పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి పంపండి.
4. తెలుగు వ్రాయడం రాని వారు ఇంగ్లీషులో టైపు చేసి పంపొచ్చు.
5. పైవేవీ మీకు సాధ్యపడనిచో చివరి ప్రయత్నంగా మాత్రమే ఆడియో రూపంలో పంపండి.
అలా సిద్ధం చేసిన మీ అనుభవాలను క్రింద ఇవ్వబడిన మెయిల్ఐడి/వాట్సాప్/టెలిగ్రామ్ నెంబరుకి పంపించండి.
saimaharajsannidhi@gmail.com
+917842156057
Jai sairam
ReplyDeleteEvery body posting about question and answers , can someone post the website link of question and answer here, thanks in advance
ReplyDeletehttps://www.yoursaibaba.com/import.php#.XzkEQpBN00O
DeleteOm Sai Ram
https://www.yoursaibaba.com/
Deleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete