ఈ భాగంలో అనుభవాలు:
- బాబా కృప
- గొంతునొప్పి తగ్గించి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
- బాబా కృపతో నెగిటివ్ వచ్చిన కోవిడ్ ఫలితాలు
బాబా కృప
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నా నమస్కారం. ‘బాబాను గట్టిగా నమ్మితే అన్నీ ఆయనే నడిపిస్తారు’ అని అంటారు కదా! బాబా మరోసారి ఆ విషయాన్ని నిరూపించిన అనుభవాన్ని మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను. మా పిన్ని(మా అమ్మ చెల్లెలు) బాబా భక్తురాలు. జులై నెల చివరి వారంలో వాళ్ళింటికి కరోనా పాజిటివ్ ఉన్న ఒకావిడ వచ్చి వెళ్ళారు. మా పిన్నికి, తన కుటుంబసభ్యులకు ఆ విషయం తెలియక ఆవిడతో సన్నిహితంగా మెలిగారు. తరువాత ఆవిడకి కరోనా ఉందని తెలిసి మా పిన్ని కుటుంబసభ్యులంతా చాలా భయపడ్డారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. కరోనా భయంతో ఉన్న వాళ్ళకు దానికి సంబంధించి కొన్ని లక్షణాలు కనిపించటం మొదలుపెట్టాయి. దాంతో మా పిన్ని కుటుంబం మొత్తం కోవిడ్ పరీక్షలు చేయించుకుంది. నాకు ఆ విషయం తెలిశాక నేను బాబాకు నమస్కరించి, “వాళ్ళందరికీ కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రావాలి బాబా! అలా వస్తే నేను ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. అక్కడ వారందరూ క్షేమంగా ఉండాలని నేను ఇక్కడ బాబాను తలచుకుని బాబా ఊదీని నా నుదుటన దిద్దుకున్నాను. ఆ సాయితండ్రి అద్భుతం చేశారు. వాళ్ళ కోవిడ్ రిపోర్టులు వచ్చాయి. బాబా దయవల్ల అందరికీ నెగిటివ్ వచ్చింది. ఆ వార్త విని నేను ఎంతో సంతోషంతో బాబాకు నమస్కరించి, మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ సాయితండ్రి కరుణ అందరిమీదా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గొంతునొప్పి తగ్గించి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగుని నిర్వహిస్తూ మా అనుభవాల్ని సాటి సాయిభక్తులతో పంచుకోవటానికి అవకాశం కల్పించిన సాయికి ప్రత్యేక ధన్యవాదాలు.
బాబా నన్ను ఎంతో ప్రమాదం నుంచి తప్పించారు. అదేమిటంటే, కరోనా కేసులు విపరీతంగా పెరిగినందుకు మేము చాలా భయపడుతున్న ఈ సమయంలో, అంటే 2020, ఆగష్టు 8వ తేదీ రాత్రి నాకు గొంతునొప్పి మొదలైంది. ఆ విషయం నేను మావారితో చెప్తే, “నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఏమి ఉండదులే!” అన్నారు. కానీ నొప్పి ఎక్కువగా ఉన్నదని చెప్పేసరికి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమని చెప్పి, ఆవిరి పట్టమనీ, వేడినీటితో స్నానం చేయమనీ చెప్పారు. అవన్నీ చేసినా నాకు ఉపశమనంగా అనిపించలేదు.
తరువాత నా తండ్రి బాబాతో, “బాబా! నాకు చాలా భయమని నీకు తెలుసు. ఈ కరోనాతో భయపడుతున్న సమయంలో ఈ నొప్పివలన ఇంకా చాలా భయంగా ఉంది. నా గొంతునొప్పి తగ్గించు తండ్రీ!” అని చెప్పుకుని, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని రెండుసార్లు త్రాగి బాబానే స్మరించుకుంటూ పడుకున్నాను. 9వ తారీఖు అంతా మగతగా ఉండి, నిదానంగా సాయంత్రానికి గొంతునొప్పి తగ్గిపోయింది. నాకు తోడుగా ఉండి నాకు నొప్పి తగ్గించినందుకు బాబా ఋణం ఏ విధంగా తీర్చుకోవాలి? “బాబా! నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను. మా భారాలు నీ భుజాలమీద వేసుకుని మమ్మల్ని నడిపించు తండ్రీ!”
బాబా కృపతో నెగిటివ్ వచ్చిన కోవిడ్ ఫలితాలు
పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఈమధ్యన లాక్‌డౌన్ సమయంలో ఒకసారి నా భార్యకు దగ్గు, జ్వరం వచ్చాయి. డాక్టర్ కోవిడ్ పరీక్ష చేయించుకోమని సలహా ఇచ్చారు. మేము చాలా భయపడి బాబాను ప్రార్థించాము. తరువాత నేను, నా భార్య, మా అబ్బాయి కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాము. బాబా ఆశీస్సుల వలన మా అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. "బాబా! మీ పాదపద్మములకు మా శతకోటి ప్రణామములు. ఎల్లప్పుడూ ఇలాగే మీ అనుగ్రహం మాపై ఉండాలి తండ్రీ!"
om sai ram when sai is there no worry.he takes care of us.he blesses us
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు శ్రీ శ్రీ సాయినాథ మహారాజుకి జై. బాబా గారి గురించి సద్గురు లీలలు గురించి చెప్పాలంటే నాకు ఈ జన్మ సరిపోదు. నాకు డెలివరీ అయ్యాక అబ్బాయి పుట్టాడు.హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను నేను ఇంకా ఇంటికి పంపలేదు. ఒక రోజు రాత్రి నాకు కలలో బాబా కనిపించారు. షిర్డీ లో సమాధి మందిర్ లో కుర్చిన్నట్లుగానే.కానీ చాలా చిన్నగా అంటే అప్పుడే పుట్టిన మా అబ్బాయి లాగ.వాడి నక్షత్రానికి వచ్చే అక్షరాలు జ్ఞా తో రావాలి జ్ఞాన సాయి అని పెట్టుకున్నాము. అప్పటి నుంచి బాబా మాతోనే ఉన్నారు. ఎలాగంటే నేను గవరన్మెంట్ ఆఫీసులో పని చేస్తాను.ప్రభుత్వ విధానాల వల్ల జిల్లాల విభజన జరిగింది.నా పరిస్థితి అగమ్యగోచరం. నేను ఏ విధంగా చూసినా కొత్త జిల్లాకి కేటాయింపు జరగాలి. బాబాను వేడుకున్నాను నాకు మరి దిక్కు ఆయనే కదా.ఉద్యోగుల కేటాయింపులో నిర్ణయం తీసుకొనే అధికారికి బాబా ఏమి చెప్పారో కానీ నన్ను మార్చలేదు ఆ అధికారి.ఇది అసాధ్యం.దీనిని సాధ్యం చేయ గలిగిన దైవము సాయినాధుడే.9 గురువారము నోము అనుకోని చేసుకున్నను బాబా నాకు తోడు ఎలా ఉన్నారో అని తెలిసింది ఈ రోజే. ఎందుకంటే గత 4 రోజులుగా జ్వరం తో బాధ పడుతున్నాను. మేము అద్దె ఇంట్లో ఉంటాం మా కాంప్లెక్స్ లో దాదాపు అందరికీ కోవిద్ పాజిటివ్ వచ్చింది.నా పరిస్థితి అంతా బాబా కు చెప్పుకున్నా. ఈ రోజు టెస్ట్ కి వెళ్ళాను. టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. నన్ను ఈ గడ్డు స్థితి నుండి కాపాడేది బాబానే. నిన్న అనుకున్న నా అందు బాబా చూపుతున్న కరుణను మీ అందరికీ తెలియ చేయాలని బ్లాగ్ లో రాయాలని. జై సాయిరామ్
ReplyDeleteOm sai ram samatha saduguru sainath maharaj ki jai... Naku arthritis undi baba thaginchu baba naku.. Niku ellavelala pooja stand... Om sai ram
ReplyDeleteOme Sai Ram. Sai Baba Ki Jai
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba mamalini ellavella kanipetukoni vundadi baba
ReplyDelete🌼🌻🌸🌹🙏🙏🙏🙏🙏🌹🌸🌻🌼
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om sai ram��
ReplyDelete