ఈ భాగంలో అనుభవాలు:
- భక్తురాలినైన మూడునెలలకే అనుగ్రహించిన బాబా
- బాబాను ప్రార్థించినంతనే వర్క్ రావడం మొదలైంది
భక్తురాలినైన మూడునెలలకే అనుగ్రహించిన బాబా
నా పేరు అనూష. మాది హైదరాబాద్. నాకు వివాహమై మూడేళ్ళు అయినా మాకు పిల్లలు కలగలేదు. నాకు థైరాయిడ్, పి.సి.ఓ.డి సమస్యలు ఉన్నాయి. ఇంకా నాకున్న ఇన్‌ఫెర్టిలిటీ సమస్యల కారణంగా నేను ప్రెగ్నెంట్ కాలేకపోయేదాన్ని. నాకు మూడుసార్లు ఐ.యు.ఐ. చికిత్స జరిగింది. లాపరోస్కోపీ శస్త్రచికిత్స కూడా అయింది. కానీ ఫలితం కనపడలేదు. డాక్టర్లు నాకు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లెమ్ ఉందని, AMH లెవెల్ తక్కువగా ఉన్న కారణంగా సహజంగా గర్భం దాల్చడం కష్టమని చెప్పి, నన్ను ఐ.వి.ఎఫ్. చేయించుకోమని సలహా ఇచ్చారు. ఇలా 2018 నుండి మేము పిల్లలకోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎంతో వేదన అనుభవించాం. మరో సమస్య ఏమిటంటే, నేను బ్యాంకు ఉద్యోగిని. మేముండే చోటునుండి పనిచేసే చోటు చాలా దూరం. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఇంటినుండి బయలుదేరి వెళితే, రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చేదాన్ని. పిల్లల కోసం చికిత్స జరుగుతున్నప్పుడు అంత దూరప్రయాణం నా ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్ చెప్పారు. దాంతో బదిలీ కోసం ప్రయత్నిస్తే బదిలీ అయింది కానీ, సంవత్సర కాలం నన్ను రిలీవ్ చేయలేదు.
ఇక బాబా నన్ను అనుగ్రహించిన తీరు చూడండి. నిజానికి నేను మొదటినుండి బాబా భక్తురాలిని కాదు. కేవలం మూడు నెలల క్రితం నాకు తెలిసిన ఒకామె 'సాయి దివ్యపూజ' చేయమని చెప్తే, ఆ పూజ చేశాను. మరొకామె వద్ద ‘సాయిలీలామృతం’ పుస్తకం తీసుకొని పారాయణ చేశాను. తరువాత ఈ బ్లాగు గురించి కూడా తెలిసి, ఒళ్ళంతా ఇంజెక్షన్ల పోట్లతో విసిగిపోయిన నేను ఒకరోజు, "బాబా! మీ అనుగ్రహంతో ఏ మందులూ లేకుండా నేను సహజంగా గర్భం దాలిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబా నాపై అపారమైన కరుణ చూపించడం ప్రారంభించారు. ముందుగా, సంవత్సర కాలంగా రిలీవ్ చేయని అధికారులు నన్ను రిలీవ్ చేశారు. నేను క్రొత్త చోట చేరి ఇప్పటికి నెలరోజులవుతోంది.
తరువాత 2020, జులై 6న మెయిల్ ద్వారా ఒక సాయిబంధువుకి నా సమస్యను వివరించి, 'నా సమస్యను సాటి సాయిభక్తులకు తెలియజేసి నా కోసం బాబాను ప్రార్థించమని అడగండి' అని అభ్యర్థించాను. అందుకు తను, "దయచేసి మరోలా అనుకోకండి. నేను ప్రత్యేకించి ప్రేయర్ రిక్వెస్టులు హ్యాండిల్ చేయలేను. అవి మొదలుపెడితే నాకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సమయం అస్సలు సరిపోవడంలేదు. మీ గురించి నేను బాబాను ప్రార్థించాను. ఆయన అనుగ్రహంతో త్వరలో మీ మనోభీష్టం నెరవేరుతుందని ఆశిస్తున్నాను. మరో విషయం, నాకు తెలిసిన ఒక సాయిబంధువు ప్రేయర్ గ్రూపు నడుపుతున్నారు. మీ ప్రేయర్‌ను వాళ్ళ గ్రూపులో షేర్ చేయమని తనను అడిగాను. అందుకు తను అంగీకరించారు. మీరు ఆ గ్రూపులో చేరండి. వాళ్లంతా మీ గురించి బాబాను ప్రార్థిస్తారు. మీరు బాబాపై విశ్వాసంతో, సహనంతో ఉండండి. త్వరలోనే బాబా అనుగ్రహం మీకు లభిస్తుంది" అని చెప్పారు. నేను దానికి అంగీకరించి ఆ గ్రూపులో చేరాను. ఆ గ్రూపులో ఉన్నవాళ్ళందరూ నా గురించి బాబాను ప్రార్థించారు.
పదిహేను రోజుల క్రితం నెలసరి రాలేదని అనుమానంతో నేను ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొంటే నెగిటివ్ వచ్చింది. తరువాత కూడా నెలసరి రాకపోవడంతో 2020, జులై 28న హాస్పిటల్‌కి వెళ్ళాను. నన్ను పరీక్షించిన డాక్టర్లు నేను 'ఐదు వారాల గర్భవతిన'ని చెప్పారు. నేను, మావారు ఆశ్చర్యంతో "పదిహేను రోజుల క్రితం పరీక్షించుకుంటే నెగిటివ్ వచ్చింద"ని చెప్తే, "అదెలా సాధ్యం?” అంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తరువాత మళ్ళీ పరీక్షిద్దామని స్కాన్ చేసి, 'నేను ఐదు వారాల గర్భవతిన'ని నిర్ధారించారు. మా ఆనందానికి అవధులు లేవు. మూడేళ్ళ మా వ్యధను బాబా ఇట్టే తీసేశారు. నాకోసం ప్రార్థించిన సాటి సాయిభక్తులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా ప్రియమైన సాయి సోదర, సోదరీమణులారా! ఏ అడ్డంకులు లేకుండా ఈ తొమ్మిది నెలలు నేను ఆనందంగా ఉండాలని, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని నన్ను ఆశీర్వదించండి. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ తొమ్మిది నెలలు మీ అనుగ్రహంతో సాఫీగా సాగి నేను పండంటి బిడ్డకు జన్మనివ్వాలి బాబా".
బాబాను ప్రార్థించినంతనే వర్క్ రావడం మొదలైంది
నా పేరు శ్వేత. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను చదువుతూ ఉంటాను. నేను జూన్ 23న ఒక వర్క్ కోసం ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసుకున్నాను. “వెరిఫికేషన్ జరిగాక వర్క్ వస్తుంది” అని చెప్పారు. చాలా రోజులు గడిచినా వర్క్ రాలేదు. జులై 19 ఆదివారం ఉదయం బాబాను ప్రార్థించి, “బాబా! వెరిఫికేషన్ పూర్తయి నాకు వర్క్ త్వరగా వచ్చేలా అనుగ్రహించండి” అని చెప్పుకున్నాను. బాబాను ప్రార్థించిన వెంటనే అదేరోజు సాయంత్రం నుండి నాకు వర్క్ రావడం మొదలైంది. బాబా చూపిన కరుణకు ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “సాయితండ్రీ! మీకు అనేకవేల సాష్టాంగ ప్రణామాలు”.
🙏🛕🙏💐🙏🌹🙏🌷🙏💐🙏🌺🙏🌟🙏
ReplyDeleteపామరుడ నేను యేభాష పల్కగలను
నీవె తల్లివి తండ్రివి నీవెగాదె ?
సంతులకు సంతు - రక్షింపవంతు నీదె
సద్గురూత్తమ శిరిడీశ సాయినాథ🙏🌷🙏
Good morning
ReplyDeleteCan any one pl share the link of the prayer group
https://chat.whatsapp.com/C2ezXOAalUiCey41c42vtU
DeleteTq, Sai
DeleteOm sai ram
ReplyDeletePlease prayer chese group link pettandi
ReplyDeleteOm sai ram
prayer group link
Deletehttps://chat.whatsapp.com/C2ezXOAalUiCey41c42vtU
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాధయ నమః🙏
ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhavya sree
ఓం సాయిరామ్!
ReplyDeleteOm sairam
ReplyDeletesai always be with me
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete