లక్ష్మణరావు పోడార్ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను అతని కుమారుడు వసంతరావు సాయిలీల పత్రికతో పంచుకున్నారు. అవి ఈవిధంగా ఉన్నాయి.
వసంతరావు 1903, డిసెంబర్ 4న ఎడ్వాన్ అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి లక్ష్మణరావు బాబాపట్ల భక్తివిశ్వాసాలు కలిగి ఉండేవాడు. 1911వ సంవత్సరంలో అతనొక ఇంజనీరింగ్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండేవాడు. ఒకసారి ఒక వ్యాపార ప్రతిపాదన నిమిత్తం అతనికి, అతని యజమానికి మధ్య చర్చ జరిగింది. అది కంపెనీకి ప్రయోజనకరం కాదని అతను భావించాడు. కానీ ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్న అతని యజమాని అతనిని తీవ్రంగా మందలించి, ఆ ప్రతిపాదనను అమలుపరచడంలో ముందుకు వెళ్ళాడు. లక్ష్మణరావు దానిని అవమానంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బాగా సంపాదన వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాక భార్య, ముగ్గురు చిన్న పిల్లల పోషణ గురించి ఆలోచనలో పడ్డాడు.
లక్ష్మణరావు ఇంటికి వెళ్లి బాబా పటం ముందు నిలబడి, "బాబా, దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి. శిరిడీ వచ్చి, మొదటి నెల జీతం మీ పాదాల వద్ద సమర్పించుకుంటానని మాట ఇస్తున్నాను" అని ప్రార్థించాడు. రెండురోజుల తరువాత పాత కంపెనీకి చెందిన కార్మికుడొకడు "యజమాని తన తప్పు తెలుసుకొని, లక్ష్మణరావుని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు" అన్న సందేశంతో తన ఇంటి ద్వారం వద్ద నిలిచాడు. దాంతో అతను తిరిగి తన మునుపటి ఉద్యోగంలో చేరాడు. మొదటి నెల జీతం రాగానే, తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకొని, తన చిన్నకొడుకు వసంతరావుని వెంటబెట్టుకొని శిరిడీ ప్రయాణమయ్యాడు.
వాళ్ళు రైలులో కోపర్గాఁవ్ వరకు వెళ్లి, అక్కడినుండి ఎడ్లబండిలో శిరిడీ చేరుకున్నారు. వెంటనే ద్వారకామాయికి వెళ్లారు. బాబా తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు. అప్పుడే ఒక చిన్న గుర్రం బాబా వద్దకు వచ్చి, ప్రదక్షిణ చేసి, ఆయన ముందు సాష్టాంగపడి వెళ్లిపోయింది. సభామండపలో కూర్చొని ఉన్న భక్తులందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. తరువాత బాబా భక్తసమూహం వైపు చూస్తూ, "అరే, లక్ష్మణా! నా జీతం నాకివ్వు" అన్నాడు. లక్ష్మణరావు ఆశ్చర్యపోతూ తన పేరుతో ఇంకెవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూశాడు. కానీ ఎవరూ స్పందించలేదు. అప్పుడు బాబా అతని వైపు చూస్తూ, "అరే లక్ష్మణరావ్! నేను నిన్నే పిలుస్తున్నాను. వచ్చి, నా మొదటినెల జీతం ఇవ్వు" అన్నారు. 'మొదటినెల జీతం' అన్న మాట వినగానే బాబా తనతోనే మాట్లాడుతున్నారని అతను గ్రహించాడు. లక్ష్మణరావు, వసంతరావు ఇద్దరూ బాబా వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. లక్ష్మణరావు జీతం డబ్బులను బాబా చేతిలో ఉంచాడు. అప్పుడు బాబా ఒక పెద్దావిడ వైపు తిరిగి, "వీరికి భోజనం పెట్టు" అన్నారు.
లక్ష్మణరావు, అతని కుమారుడు సంతుష్టిగా భోజనం చేశాక ముంబాయి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవడానికి ద్వారకామాయికి వెళ్లారు. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయగా, బాబా వాళ్ళని ఆశీర్వదించి, తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కోపర్‌గాఁవ్‌లో సాయంత్రం ఉన్న రైలును అందుకోవాలని ఇద్దరూ ఎడ్లబండిలో బయలుదేరి సమయానికి స్టేషన్ చేరుకున్నారు. అక్కడ లక్ష్మణరావు బండివానికి డబ్బులిస్తూ తన వద్ద డబ్బులు తక్కువగా ఉన్నాయని గ్రహించాడు. దాంతో రైలు టిక్కెట్లు ఎలా తీసుకోవాలా అని ఆందోళన చెందాడు. కోపర్‌గాఁవ్‌లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేనందున అప్పు తీసుకొనే అవకాశం కూడా లేదు. అందువలన ఏమి చేయాలో తెలియక నిస్సహాయస్థితిలో ఉన్నాడు. అకస్మాత్తుగా ఎవరో తనను పిలుస్తున్నట్లు వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా తన ప్రియమిత్రుని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ స్నేహితుడు అతనిని పలకరించి, "నేను కూడా టికెట్ కొనుక్కోవాలి, కాబట్టి మనందరికీ నేను టిక్కెట్లు తీసుకుంటాను" అని చెప్పి స్టేషన్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి టిక్కెట్లతో వచ్చి, ఆ టిక్కెట్లను లక్ష్మణరావుకు ఇచ్చాడు. తరువాత వాళ్ళు స్టేషన్లోకి నడిచారు. స్టేషన్ లోపలికి వెళ్ళాక జనంలో అతని స్నేహితుడు అదృశ్యమయ్యాడు. లక్ష్మణ్ అతనికోసం అంతా వెతికాడు కానీ ఫలితం లేకపోయింది. చివరికి బాబాయే తన స్నేహితుని రూపంలో వచ్చారని అతనికి అర్థం అయ్యింది. బాబా చేసిన సహాయానికి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ సంఘటనతో బాబాపై అతనికున్న విశ్వాసం వందరెట్లు అధికమైంది.
సుమారు తెల్లవారుఝామున 5 గంటల సమయంలో నాన్న నిద్రలేచి తనకు తినడానికి ఏదైనా కావాలని అమ్మని అడిగారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడితే తిన్నారు. తరువాత ఆయన, "మీరు నా మంచం ప్రక్కన ఎందుకున్నారు? నేను బాగున్నాను" అని అన్నారు. ఆ మాటలు చెప్తూనే తను తలుపువైపు చూస్తున్నారు. నాన్న ఎందుకు అటువైపు చూస్తున్నారా అని నేను కూడా అటువైపు చూశాను. అక్కడ తలుపు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన రెండడుగుల వెండి సట్కాను తన చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆయన ఆ సట్కాను ఊపుతూ, "నేను ఇక్కడ ఉండగా ఎవరు ఈ గది లోపలికి ప్రవేశిస్తారో చూస్తాను" అన్నారు. నేను వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆ వృద్ధుడు అచ్చం నేను నా చిన్నవయస్సులో చూసిన సాయిబాబా లాగానే ఉన్నారు. యమదూతలను తరిమివేయడానికి ఆయన ద్వారంవద్దనే కూర్చొని ఉన్నారు. తన భక్తులపై ఆయన చూపే కరుణ ఎనలేనిది.
ఆ తరువాత తొందరలోనే నాన్న పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. కారుణ్యంతో అంతలా నా తండ్రిని సంరక్షించిన బాబాకు మా కుటుంబమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ సంఘటన బాబాపట్ల నాకు భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసింది.
సమాప్తం.

ద్వారంవద్ద కూర్చుని మరణాన్ని తరిమివేసిన బాబా.
ఒకప్పుడు మా నాన్నగారు తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. నాన్నను పరీక్షించిన డాక్టర్, "ఇంక ఆశలు లేవు. ఎవరైనా దగ్గర బంధువులను పిలిపించుకోవాలంటే పిలిపించుకోండి" అని చెప్పారు. మేము మా మామయ్య యశ్వంత్‌రావుగారిని పిలిపించాం. ఆ రాత్రి నాన్న పరిస్థితి మరింత క్షీణించింది. తను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. రాత్రంతా నేను, మా అమ్మ, మామయ్య నాన్న మంచం ప్రక్కనే కూర్చొని ఉన్నాము. మధ్యరాత్రిలో నాన్న లేచి, తలుపువైపు చూస్తూ తన చేతులు జోడించి నమస్కరించారు. ఆ తరువాత తనెంతో ప్రశాంతంగా నిద్రపోయారు.
సుమారు తెల్లవారుఝామున 5 గంటల సమయంలో నాన్న నిద్రలేచి తనకు తినడానికి ఏదైనా కావాలని అమ్మని అడిగారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు పెడితే తిన్నారు. తరువాత ఆయన, "మీరు నా మంచం ప్రక్కన ఎందుకున్నారు? నేను బాగున్నాను" అని అన్నారు. ఆ మాటలు చెప్తూనే తను తలుపువైపు చూస్తున్నారు. నాన్న ఎందుకు అటువైపు చూస్తున్నారా అని నేను కూడా అటువైపు చూశాను. అక్కడ తలుపు దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన రెండడుగుల వెండి సట్కాను తన చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆయన ఆ సట్కాను ఊపుతూ, "నేను ఇక్కడ ఉండగా ఎవరు ఈ గది లోపలికి ప్రవేశిస్తారో చూస్తాను" అన్నారు. నేను వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆ వృద్ధుడు అచ్చం నేను నా చిన్నవయస్సులో చూసిన సాయిబాబా లాగానే ఉన్నారు. యమదూతలను తరిమివేయడానికి ఆయన ద్వారంవద్దనే కూర్చొని ఉన్నారు. తన భక్తులపై ఆయన చూపే కరుణ ఎనలేనిది.
ఆ తరువాత తొందరలోనే నాన్న పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. కారుణ్యంతో అంతలా నా తండ్రిని సంరక్షించిన బాబాకు మా కుటుంబమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ సంఘటన బాబాపట్ల నాకు భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసింది.
సమాప్తం.
మూలం: శ్రీ సాయిలీలా మ్యాగజైన్, ఫిబ్రవరి 1985. (విన్నీ చిట్లూరి రచించిన 'డివైన్ సింఫనీ ఆఫ్ బాబా')
Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏
ReplyDeleteOm sai Sri Sai jaya jaya sai
ReplyDeleteOm sai Sri Sai jaya jaya sai
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Samrtha sadguru sainath maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha