ఈ భాగంలో అనుభవాలు:
- నమ్ముకున్న వాళ్లకి బాబా రక్షణ ఎప్పుడూ ఉంటుంది
- ఎక్కడో పోగొట్టుకున్న చెవిరింగు వేరేచోట దొరికేలా చేసిన బాబా లీల
నమ్ముకున్న వాళ్లకి బాబా రక్షణ ఎప్పుడూ ఉంటుంది
సాయి భక్తురాలు శ్రీమతి అంజలి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను గత 15 సంవత్సరాల నుండి బాబాకు భక్తురాలిని. ఒక వారం క్రితం బాబా నాపై చూపిన దయవలన నేను తీవ్రమైన జ్వరం నుండి బయటపడ్డాను. డిసెంబరు 22న నాకు 103 డిగ్రీల కంటే ఎక్కువ తీవ్రతతో జ్వరం వచ్చింది. అసలు లేచి హాస్పిటల్‌కు వెళ్ళే ఓపిక కూడా లేదు. బాబా ఊదీ నుదుటికి రాసుకొని, కొంచెం ఊదీని నీళ్ళలో కలుపుకొని తాగుతూ వున్నాను. సోమవారం ఉదయం హాస్పిటల్‌కి వెళ్ళాను. జ్వరతీవ్రత ఎక్కువగా ఉండటంతో డాక్టర్ నన్ను హాస్పిటల్లో అడ్మిట్ అవమన్నారు. రక్తపరీక్షల్లో నాకు టైఫాయిడ్ ఉన్నదని తెలిసింది. దాంతో 4 రోజుల కోర్సు అని చెప్పి, సెలైన్ ద్వారా నాకు ఇంజక్షన్స్ ఇచ్చారు. బాబా దయవలన జ్వరం రెండు రోజుల్లోనే అదుపులోకి వచ్చింది. కేవలం బాబా కృపతోనే నేను చాలా తొందరగా తీవ్రమైన జ్వరం నుండి బయటపడ్డాను. జ్వరం తగ్గితే నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. "ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా!" బాబా ఎప్పుడూ తన భక్తులను చల్లగా చూస్తుంటారు. ఆయన కరుణ అపారం. బాబా ఇలాంటి అనుభవాలు నాకు చాలా ప్రసాదించారు.
మరో అనుభవం:
పదిరోజుల క్రితం గురువారంరోజు నేను, నా భర్త, మా పాప బైక్ మీద వెళుతున్నాం. ఒకచోట మావారు యు-టర్న్ తీసుకుంటున్నారు. ఇంతలో వెనుకనుండి ఒకతను బైక్ మీద చాలా వేగంగా వచ్చాడు. బాబా దయవలన వెంట్రుకవాసిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాము. లేదంటే ఆ రోడ్డు డివైడర్‌కి తగిలి అందరం చాలా ప్రమాదంలో పడేవాళ్ళం. అంతా బాబా దయ. ఆయనకు జన్మజన్మలకు ఋణపడివుంటాము. బాబాను నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి అన్యాయం జరగదు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా వుండి కాపాడుతూ వుంటారు.

ఎక్కడో పోగొట్టుకున్న చెవిరింగు వేరేచోట దొరికేలా చేసిన బాబా లీల
సాయిభక్తురాలు భార్గవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! సాయిభక్తులందరికీ ప్రణామం. నా పేరు భార్గవి. నేను పూణే నివాసిని. నేనొక ఎం.ఎన్.సి. సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. గత 8 సంవత్సరాల నుండి నేను బాబా భక్తురాలిని. అంతకుముందు నేను బాబాను అందరు దేవుళ్ళలా చూసేదాన్నే కానీ, ఆయనపట్ల పూర్తి భక్తి చూపేదాన్నికాదు. నా జీవితంలో చాలా అనుభవాలు మరియు అద్భుతాల ద్వారా బాబా తన ఉనికిని చూపించారు. అలాంటి అనుభవాలలో ఒకటి నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను.
మంగళప్రదమైన అక్షయతృతీయనాడు (మంగళవారం - 7 మే 2019) నేను ఒక బంగారు చెవిరింగును పోగొట్టుకున్నాను. అందరూ ఆరోజు శుభదినమని బంగారం కొంటూ ఉంటే నేను బంగారాన్ని పోగొట్టుకున్నందుకు చాలా కలత చెందాను. అయితే అది నాకు దక్కాల్సి ఉంటే ఖచ్చితంగా నా వద్దకు వస్తుందనే బలమైన నమ్మకం నాకుంది. కాబట్టి ఏది జరిగినా మన మంచికోసమే అని అనుకుని, "బాబా! నాకేది మంచిదో మీకు బాగా తెలుసు" అని చెప్పుకుని ఆ విషయాన్ని బాబాకే వదిలిపెట్టాను. కానీ బంగారం కదా, ఎక్కడైనా దొరుకుతుందేమోనని ఇంట్లో అన్నిచోట్లా వెతుకుతూ ఉన్నాను. మరుసటిరోజు, అంటే బుధవారంనాటి రాత్రి నేను నిద్రపోయేముందు యూట్యూబ్‌లో సాయి అద్భుత లీలలకు సంబంధించిన వీడియోలు చూద్దామని నా ఫోన్ తీసుకుని యాదృచ్ఛికంగా ఒక వీడియో ప్లే చేశాను. ఆ వీడియోలో గోవాకు చెందిన బాబా భక్తురాలు 'ఆయీ' ఒక అనుభవాన్ని వివరిస్తున్నారు. ఆమె, ఆమె పనిమనిషి తన వాకిట్లో నిలుచుని మాట్లాడుకుంటున్నారు. ఆమె పనిమనిషి తనకెంతో విలువైన చెవిపోగును ఎక్కడో పొలంలో పోగొట్టుకున్నానని చెప్పింది. అంతలో అకస్మాత్తుగా 'ఆయీ'కి తన కాలి బొటనవ్రేలు క్రింద బురదలో ఏదో ఉన్నట్లు అనిపించింది. చూస్తే, అది ఆమె పనిమనిషి పోగొట్టుకున్న చెవిపోగు. నిజంగా అది ఒక అద్భుతం! ఎందుకంటే, ఆమె ఎక్కడో పోగొట్టుకున్నది 'ఆయీ' ఇంట దొరికింది. నేను ఆ అద్భుతాన్ని చూసి ఖచ్చితంగా బాబా నేను పోగొట్టుకున్న చెవిరింగును తిరిగి నాకిస్తారని అనుకున్నాను.
గురువారం ఉదయం నేను నిద్రలేచిన తరువాత నాకు కేటాయించిన అధ్యాయాలను పారాయణ చేశాను. తరువాత భక్తితో బాబాకు పూజ చేశాను. ఆ తరువాత కంప్యూటర్‌లో నా పని మొదలుపెట్టాను. ఆ వారమంతా నేను ఇంటినుండి పని చేస్తున్నాను. ఆ సమయంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ బాబా సందేశాలను చూస్తున్నాను. ఏదో యథాలాపంగా స్క్రోల్ చేస్తుంటే ఒక సందేశం మీద నా దృష్టి పడింది. ఆ సందేశంలో బాబా ఇలా చెప్తున్నారు: “పోగొట్టుకున్న చిన్న వస్తువు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు బాబా మీద నమ్మకం లేదా? అది నీ వద్దకు వస్తుంది, ఆ విషయాన్ని నాకు వదిలేయ్" అని. నేను ఆ సందేశాన్ని మామూలుగానే చదివానుగానీ, దీనితో నేను పోగొట్టుకున్న చెవిపోగుకు సంబంధం ఉన్నట్లు గ్రహించలేదు. అయితే అదే సందేశం మళ్ళీ కనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, ఆ సందేశం బాబా నాకే ఇస్తున్నారని. వెంటనే నేను మనస్సులో బాబాతో, "నేను దానిని మీకే వదిలిపెట్టాను బాబా. దాని గురించి నేను డిమాండ్ చేయను" అని చెప్పుకున్నాను. కొద్దిసేపటి తర్వాత ఏదో పనిమీద నేను కుర్చీలోనుండి లేచి, పని చూసుకుని, మళ్ళీ వచ్చి కుర్చీ దగ్గర నిలుచున్నాను. ఆశ్చర్యం! ఎవరో అక్కడ పెట్టినట్లుగా నా కాలి దగ్గర నా చెవిరింగు ఉంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే, ఆ రెండు రోజుల్లో నేను ఇల్లంతా వెతికినా దాన్ని కనుగొనలేకపోయాను. అలాంటిది హాలులోని విశాలమైన ప్రదేశంలో అది దొరకడం నిజంగా అద్భుతం. నిజానికి అది ఎక్కడో పడిపోయింది. కానీ ఇక్కడ దొరికింది. ఈ అనుభవం ద్వారా బాబా నా విశ్వాసాన్ని, సహనాన్ని పెంపొందింపజేయాలనుకున్నారు. సాయి ఇప్పటికీ తన భక్తులకోసం ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. "లవ్ యూ బాబా! ఇప్పటివరకు నా జీవితంలో మీరు నాపై కురిపించిన ఆశీస్సులకు నా ధన్యవాదాలు బాబా!"
source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2500.html
Om sai srisainathya jayajayasai om sairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏