ఈ భాగంలో అనుభవం:
- సాయినామజపంతో పొందిన అనుభవాలు
సాయిభక్తురాలు శ్వేత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను.
1. కొన్ని రోజుల క్రితం 7 సంవత్సరాల మా అబ్బాయి తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. తను మందులు తీసుకోవడానికి చాలా ఏడుస్తుండేవాడు. ఒకరోజు అర్థరాత్రి మందులు ఇవ్వడానికి తనని నిద్రలేపడానికి నేను చాలా భయపడ్డాను. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థంకాక 'సాయిరామ్, సాయిరామ్' అని జపిస్తూ కూర్చున్నాను. 5 నిమిషాల్లో తనంతట తానే మేల్కొని మందులు వేసుకుని నీళ్లు త్రాగి నిద్రపోయాడు. కొన్ని సెకన్లలో తనకి చెమటలుపట్టి, జ్వరం తగ్గిపోయింది. అది బాబా ఆశీర్వాదమే. ఆయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆ సంఘటన ద్వారా నేను అర్థం చేసుకోగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా!"
2. మరోసారి మా అబ్బాయి తనకి కడుపునొప్పిగా ఉందని చాలా ఏడ్చాడు. నేను తనకి బాబా ఊదీ ఇచ్చి నేను, మావారు సాయినామజపం చేశాము. 5 నిమిషాల్లో తన కడుపునొప్పి మాయమైపోయింది.
3. నేను శిరిడీ సందర్శించినప్పుడు పసుపు, కుంకుమ తెచ్చుకున్నాను. 'అవి పూర్తయ్యేలోగా దయచేసి నన్ను మళ్ళీ శిరిడీకి పిలవండి' అని బాబాను ప్రార్థించాను. 2019 ఏప్రిల్ 26న ఆ పసుపు, కుంకుమ పూర్తయ్యాయి. అదేరోజు నేను శిరిడీ ప్రయాణమయ్యేలా బాబా అనుగ్రహించారు.
4. ఒకసారి మా అబ్బాయిని మరొక సిటీలో ఉన్న యోగా తరగతులకు తీసుకెళ్ళాలని అనుకున్నాను. కానీ అది సాధ్యం అవుతుందో, లేదోనని నేను ఆందోళనపడ్డాను. అయితే బాబా నాకు తోడుగా ఉండి దానిని సాధ్యం చేశారు. మేము వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మా బస్సులో ఆయన ఉన్నారు. రెండు సందర్భాలలోనూ మా కోసమే బస్సులు వేచి చూస్తున్నట్లు ఉన్నాయి. మేము ఉన్నచోటనుండి యోగా క్లాసులు జరిగే చోటుకు వెళ్ళడానికి ఆయన మాకు సౌలభ్యంగా వాహనాలను ఏర్పాటు చేశారు. బాబా దయచూపకుంటే చిన్నపిల్లవాడితో విపరీతమైన ఎండలో నడవడం భయంకరంగా ఉండేది.
5. ఇటీవల నా జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని నేనిప్పుడు మీకు చెప్తాను. 2019, మార్చిలో నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. మార్చి 30న నేనొక ఇంటర్వ్యూకి హాజరయ్యాను. అయితే నా ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా 4వ రౌండులో ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాను. తరువాత ఏప్రిల్ 18న అదే ఎం.యెన్.సి కంపెనీ నుండి ఇంటర్వ్యూకి హాజరు అవ్వమని నాకు కాల్ వచ్చింది. నిజానికి ఒకసారి ఇంటర్వ్యూకి హాజరయ్యాక మళ్ళీ అదే కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్లాలంటే కనీసం 2 నెలల గ్యాప్ ఉండాలని నియమముంటుంది. అదే విషయం నేను ఆమెతో చెప్పాను. ఆమె, "ఇంతకుముందు హాజరైన ఇంటర్వ్యూ మరొక విభాగానికి చెందినది, ఇప్పుడు మళ్ళీ అన్ని రౌండ్ల ఇంటర్వ్యూ చేస్తార"ని చెప్పి, ఆన్‌లైన్ పరీక్షకి సంబంధించిన ఒక లింక్ నాకు పంపింది. నేను ఏప్రిల్ 20న ఆ పరీక్ష వ్రాద్దామని అనుకున్నాను. ఇక జరిగిన అద్భుతాలు చూడండి. ఏప్రిల్ 19న ఆమె నాకు ఫోన్ చేసి నేను ఆన్లైన్ పరీక్షను క్లియర్ చేశానని, రెండో రౌండ్ వీడియో ఇంటర్వ్యూ ఏప్రిల్ 22న షెడ్యూల్ చేస్తున్నానని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. తరువాత ఏప్రిల్ 22, మధ్యాహ్నం ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేసి, నేను 'హాజరుకాని' ఇంటర్వ్యూను క్లియర్ చేశానని, చివరి రౌండ్ ఇంటర్వ్యూ కోసం కంపెనీకి రమ్మని చెప్పింది. జరుగుతున్న అద్భుతాలు చూస్తూ నేను ఆశ్చర్యపోతుండేదాన్ని. ఇంటర్వ్యూ కోసం చదవాల్సింది చాలా ఎక్కువగా ఉండటంతో నాకు సాధ్యమైనంతవరకూ చదివి, "నాకేది మంచిదో బాబాకి తెలుసు. నాకు మంచిదైతే ఇంటర్వ్యూలో నన్ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయనదే" అనుకుని 21 నిమిషాలపాటు సాయినామజపం చేశాను. తరువాత నేను కంపెనీకి వెళ్ళినప్పుడు 2 రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. నేను చాలా ఆందోళనపడుతూ సాయినామజపం చేయడం ప్రారంభించాను. మొదట నేనొక రౌండ్ ఇంటర్వ్యూకి హాజరయ్యాను. అది కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. ఆశ్చర్యకరంగా హెచ్.ఆర్ నాతో నన్ను హెచ్.ఆర్ డిస్కషన్ కి ఎంపిక చేశానని చెప్పారు. ఆ డిస్కషన్లో నేను ముందు సంపాదిస్తున్న దానికంటే 30% అధిక జీతం, బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. నిజానికి నేను 10% పెంపుకోసమే చూస్తున్నాను. అలాంటిది బాబా నన్ను 30% పెంపుతో గొప్పగా అనుగ్రహించారు. "థాంక్యూ సో మచ్ బాబా!"
source:http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2494.html

Sai bhagavanki jai. Sainathaya namaha. Subam bhavat.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏