సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - శ్రీవసంతరావు నారాయణ్


శ్రీవసంతరావు నారాయణ్ అలియాస్ బాబాసాహెబ్ గోరక్షకర్ పఠారేప్రభు కులానికి చెందినవాడు. అతడు సాయిబాబాకు చాలా గొప్ప భక్తుడు. 1911వ సంవత్సరం నుండి అతడు శ్రీసాయిబాబాను సేవిస్తుండేవాడు. అతను ముంబైలో పనిచేస్తున్నప్పుడు నెలలో ప్రతి వారం-పదిహేను రోజులకు ఒకసారి శిరిడీ సందర్శించేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా దర్శనం చేసుకోవడంలో విఫలం అయ్యేవాడు కాదు.

1918, జూలై 23, పవిత్రమైన గురుపూర్ణిమనాడు శ్రీసాయిబాబా గోరక్షకర్‌ను మొదటిసారి శిరిడీ గ్రామంలో రథయాత్ర చేయమని ఆదేశించారు. తరువాత శ్రీసాయిబాబా 1918, అక్టోబరు 15న సమాధి చెందారు. అలా తాము సమాధి చెందడానికి ముందే బాబా అతని చేత శిరిడీలో నేడు జరిగే రథయాత్రకు అంకురార్పణ చేశారు. బాబా సమాధి చెందిన తరువాత పదమూడవ రోజున, అంటే 1918, అక్టోబర్ 28న గోరక్షకర్ సాయిభక్తులతో కలిసి “సమర్థ సాయినాథ్ కోటి” ప్రారంభించారు.

1922వ సంవత్సరంలో భక్తులు “శ్రీ సాయిబాబా సంస్థాన్” ఏర్పాటు కోసం అవసరమైన అనుమతిని అహ్మద్‌నగర్ కోర్టు నుండి పొందారు. ఆ భక్తులలో శ్రీగోరక్షకర్ కూడా ఒకరు. అప్పటినుండి అతను సంస్థాన్ మేనేజింగ్ కమిటీలో ఒకరిగా ఉన్నారు. 1939వ సంవత్సరంలో సంస్థాన్ ఐదుగురు సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కూడా శ్రీగోరక్షకర్ ఒకరు. అతడు ధర్మకర్తగా, కార్యదర్శిగా, కోశాధికారిగా విధులు నిర్వహించారు. 1945లో సంస్థాన్ పూర్తి నిర్వహణను చూసేందుకు మేనేజింగ్ ట్రస్టీగా కూడా అతడు ఎంపికయ్యాడు. ఇతడు ఆ బాధ్యతలు స్వీకరించడానికి ముందు శ్రీఎస్.డి.బాలావల్లి మేనేజ్‌మెంట్ ట్రస్టీగా, కార్యదర్శిగా పనిచేశారు. అతను ఒక మోసానికి పాల్పడ్డాడని సంస్థాన్ అతనిని తొలగించింది. 1950వ దశకంలో 69 సంవత్సరాల వయసులో అతడు వృద్ధాప్యం వలన పని భారాన్ని మోయలేక సంస్థాన్ మేనేజింగ్ ట్రస్టీ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడు తన పదవీకాలంలో సంస్థాన్‌కు చేసిన ఎనలేని సేవకు బాబా ప్రసాదంగా బాబా శేషవస్త్రాలతో సంస్థాన్ అతనిని సత్కరించింది. అతడు పదవీవిరమణ చేసిన తరువాత కూడా శ్రీసాయిబాబా సంస్థాన్ మేనేజ్‌మెంట్ కమిటీ తరచూ అతనిని సంప్రదించి విలువైన సలహాలను తీసుకునేది. ఇలా అతడు తన తుదిశ్వాస వరకు శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహణలో పూర్తి నిబద్ధతతో పనిచేసి శ్రీసాయిసేవలో ధన్యతనొందాడు.

సమాప్తం 

Source: శ్రీసాయిలీలా మ్యాగజైన్ 1952, http://www.saiamrithadhara.com/mahabhakthas/vasanthrao_narayan.html

3 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo