సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 258వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • పిలిచినప్పుడల్లా బాబా అండగా నిలిచారు

కెనడా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. నేను కెనడాలోని టొరంటోలో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సాయి ఆశీస్సులతో మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

సంఘటన 1: 

నాకున్న ఒక ఇంటిని అమ్మే విషయంలో నేను చాలా భయపడ్డాను. అయితే సాయి ఆశీస్సులతో త్వరగానే అంతా సెటిల్ అయింది. దాంతో నేను తక్కువ వ్యవధిలో ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అవి అసలే సెలవు దినాలైనందున నా సామాన్లన్నీ వేరే చోటుకు తరలించడం అంత సులభమేమీకాదు. అందువలన నేను నా ప్రియమైన బాబాను ప్రార్థించాను. ఆయన నేను ఆ స్థలాన్ని ఖాళీచేసి వేరే చోటుకి మారడాన్ని కేవలం ఒక వారంలో చాలా తేలికగా సాధ్యమయ్యేలా చేశారు.

సంఘటన 2: 

నేను  పనిచేసే చోట నా సహోద్యోగులలో ఒకతను నన్ను వేధిస్తూ ఉండేవాడు. ఆ విషయాన్ని నేను మేనేజ్‌మెంటుకు, హెచ్‌ఆర్‌కు రిపోర్టు చేశాను. నా సహోద్యోగి తన అనుచితమైన/అసభ్యకరమైన ప్రవర్తనను అంగీకరించినప్పటికీ మేనేజ్‌మెంట్‌, హెచ్ఆర్ వాళ్ళు దానికి ఎటువంటి ఋజువు లేనందున నా ఫిర్యాదుని కొట్టిపారేస్తున్నట్లుగా వ్రాతపూర్వకంగా ఇచ్చారు. నా మనసు వికలమైపోయింది. నాకు ఏమి చేయాలో తెలియలేదు. అదే చోటుకి తిరిగి నేను పనికి వెళ్ళడం, అదే వ్యక్తిని మళ్ళీ ఎదుర్కోవడం అనేవి నా మనసుకెంతో  కష్టంగా అనిపించాయి. "ఈ క్లిష్ట పరిస్థితిలో నాకు సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. వెంటనే యూనియన్ ప్రతినిధి నాకు మద్దతునివ్వడానికి ముందుకొచ్చారు. తనని సాయిబాబా మాత్రమే పంపించారని నాకు తెలుసు. యూనియన్‌తో కలిసి నేను విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్ళాను. ఇదంతా జరుగుతున్న సమయంలో నేను నిత్యం, "సమస్య సజావుగా ముగియాల"ని బాబాను ప్రార్థిస్తూ, సచ్చరిత్ర చదువుతుండేదాన్ని. చివరకు సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినప్పటికీ నా సహోద్యోగి తప్పు చేశాడని, తనని వేరే విభాగానికి తరలించమని తీర్పు వచ్చింది. అలా బాబా సమస్యను సుఖాంతం చేశారు. "ధన్యవాదాలు బాబా!"

సంఘటన 3: 

నాకున్న కారు పాతదైపోయిన కారణంగా నేను క్రొత్త కారు తీసుకోవడానికి చూస్తున్న తరుణంలో, నేను దరఖాస్తు చేసుకున్న ఋణం ఆమోదం పొందుతుందో, లేదోనని చాలా భయపడ్డాను. ఫైనాన్షియర్‌కు ఫోన్ చేసే ముందు నేను చేసిన ఏకైక పని ఏంటంటే, సచ్చరిత్ర చదివి, అనుగ్రహించమని బాబాను ప్రార్థించడం. సాయిబాబా తన భక్తులను ఎప్పుడూ నిరుత్సాహపరచరు. ఋణం ఆమోదించబడింది, నాకు క్రొత్త వాహనం వచ్చింది.

భక్తులందరికీ నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి బాబాపై నమ్మకం ఉంచండి, ఆయనకు శరణనండి. ఆయన అద్భుతాలు చేస్తారు. మనకన్నీ ఇచ్చేది ఆయనే! మీకు శ్రేయస్కరం కాని సందర్భంలో మాత్రమే ఆయన మీరు అడిగింది ఇవ్వడానికి నిరాకరిస్తారు.

నేను మరొక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాను. సరైన సమయంలో ఆయన తన ఆశీస్సులు నాపై కురిపిస్తారని నాకు తెలుసు. అది జరిగినప్పుడు నేను ఖచ్చితంగా నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఎందుకంటే, ఆయనపై విశ్వాసం పెంచుకునేందుకు చాలామందికి అది ఉపయోగపడుతుంది. అందరినీ బాబా ఆశీర్వదించాలి. "నేను పిలిచినప్పుడల్లా నాకు అండగా ఉంటున్నందుకు మీకు ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2483.html

3 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo