సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 251వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నాకిచ్చిన సంతోషం
  2. సాయి ఆలోచనలను ఇచ్చి నొప్పినుండి ఉపశమనం కలిగించారు

సాయి నాకిచ్చిన సంతోషం

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 2007 నుండి సాయిభక్తురాలిని. ఆయన నా సర్వస్వం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది ఆయన కృపే. ఆయన నాకు క్రొత్త జీవితాన్ని ఇచ్చారు. అందుకు నేను ఎప్పటికీ ఆయనకు ఋణపడివుంటాను. పెళ్ళైన తరువాత 7 సంవత్సరాలలో నాకు ఎన్నోసార్లు గర్భస్రావాలు జరిగాయి. సంతానం కోసం మేము తీసుకున్న చికిత్సలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. అలాంటిది మా జీవితంలో బాబా తీసుకొచ్చిన ఆనందం గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

అనుకోకుండా, మేము ఆశ్చర్యపోయేలా నేను 2018, జనవరిలో గర్భం దాల్చాను. అయితే రానున్న ఉపద్రవాన్ని మేమస్సలు ఊహించలేదు. మా సంతోషం ఎక్కువకాలం నిలవకముందే ఒక ప్రాణాంతక పరిస్థితి కారణంగా గర్భస్రావం చేయాల్సి వచ్చింది. ఆరోజు రాత్రి నేను సచ్చరిత్ర చదువుతూ, 'గతం దృష్ట్యా మళ్ళీ నేను గర్భం ధరిస్తానో లేదో'నని కన్నీళ్ళు పెట్టుకుంటూ నిద్రపోయాను. రెండు నిమిషాలకి నాకొక కల వచ్చింది. కలలో బాబా దర్శనమిచ్చి, నాకొక రుద్రాక్ష ఇచ్చారు. అకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది. బాబా ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కాలేదు. జరిగిన అనర్థాన్ని తలచుకుంటూ నేను నెలరోజులపాటు బాబా ముందు చాలా ఏడ్చాను. సరిగ్గా నెలరోజులకు బాబా అద్భుతం చూపించారు. సాధారణంగా గర్భస్రావం జరిగిన వెంటనే అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యమయ్యేలా చేశారు బాబా. మరుసటి నెలలోనే నేను గర్భం దాల్చాను. ఎటువంటి సమస్య లేకుండా నా ప్రెగ్నెన్సీ కాలమంతా సాఫీగా సాగి, ఇప్పుడు బాబా దయవల్ల మాకు అందమైన ఆడపిల్ల ఉంది. ఆయన నన్ను ఈ విధంగా ఆశీర్వదించారు. "మీరు నాపై చూపిన కృపను ఎప్పటికీ మరువలేను బాబా. అందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు".

మరో అనుభవం:

నా సోదరుడు ఒక సంవత్సరంపాటు ఉద్యోగం కోసం ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి తను బాబా పాదాలకు శరణని, నవగురువార వ్రతం మొదలుపెట్టాడు. వ్రతం 3వ వారంలో ఉండగానే తనకి చాలా మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు తను బాబా దయతో క్రొత్త ఇల్లు కూడా తీసుకున్నాడు.

పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాబాను నమ్మండి, ఆయన ఖచ్చితంగా మనకి రక్షణనిస్తారు.

సాయి ఆలోచనలను ఇచ్చి నొప్పినుండి ఉపశమనం కలిగించారు

USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ప్రతిరోజూ ప్రేమగా సాయిధ్యాసలో ఉండేందుకు బ్లాగు ఎంతగానో సహకరిస్తుంది. నేనిప్పుడు పంచుకోబోయే అనుభవం నేను 36 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు జరిగింది. ఒకరోజు రాత్రి భోజనమయ్యాక నేను పళ్ళు తోముకున్నాను. ఆ తరువాత నుండి నా దంతాలలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఆ నొప్పిని తట్టుకోలేక నేను చాలా ఆందోళన చెందాను. ఎందుకంటే నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఏదైనా శస్త్రచికిత్స చేయటం చాలా సంక్లిష్టతలో కూడుకున్నది. అది కడుపులోని బిడ్డకు మంచిది కాదు. అప్పటికే ఉన్న చిన్న చిన్న నొప్పులతోపాటు, ఈ పంటినొప్పి తోడై నన్ను చాలా బాధపెట్టింది. సాధారణంగా ప్రతిరోజూ నేను బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగుతాను. కానీ, ఆరోజు త్రాగానో లేదో సరిగా నాకు గుర్తులేదు. కానీ, "సాయీ! ఈ నొప్పినుండి ఉపశమనం కలిగించండి. ఈ నొప్పి తగ్గితే నేను కాసేపు నిద్రపోగలను. రేపు ఆఫీసుకు వెళ్ళగలను" అని సాయిని ప్రార్థించడం మాత్రం నాకు గుర్తుంది. తరువాత నేను లవంగం తిన్నాను, మరికొన్ని ఇతర చిట్కాలు కూడా ప్రయత్నించాను (అవన్నీ సాయి ప్రేరణలే ఎందుకు కాకూడదు?). తరువాత, 'S A I అనే అక్షరాలను నోటిలో నొప్పి ఉన్నచోట వ్రాసుకుంటే?' అనే ఆలోచన నా మనసుకు తట్టింది. వెంటనే S A I అని నొప్పి ఉన్నచోట వ్రాస్తున్నట్లు ఊహించుకుంటూ నొప్పి నయం అవుతున్నట్లు నమ్మకంగా భావించాను. వాస్తవానికి అలా చేసినందువల్ల నాకు కొంత ఉపశమనం లభించింది. తరువాత నా ఎడమచేతిని ఉపయోగిస్తూ నా చెంపపై S A I అని వ్రాసేలా సాయి నన్ను ప్రేరేపించారు. అదేవైపు పన్నునొప్పి నాకుంది. సాయి నొప్పిని తగ్గిస్తున్నట్లు ఊహించుకుంటూ పదేపదే నా చెంపపై S A I అని వ్రాస్తూ గడిపాను. ఏమి జరిగిందో ఊహించగలరా? చాలా తక్కువ సమయంలో నొప్పి పూర్తిగా తగ్గిపోయింది, నేను హాయిగా నిద్రపోయాను. మరుసటిరోజు రాత్రి మళ్ళీ నొప్పి రాగా, నేను అదే పద్ధతిని అనుసరించాను. దాంతో నొప్పి తగ్గిపోయింది. నొప్పి ఉన్న చోట తన పేరు వ్రాసేలా చేసి సాయి నా నొప్పిని తగ్గించారు. మన సాయి నాకు ఆలోచనలను ఇవ్వడం, తద్వారా ఉపశమనం కలిగించి ఆశీర్వదించడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనం ఆయనిచ్చిన సూచనలను కేవలం అనుసరించాలంతే. ఆరోజు రాత్రే నేను నా ఈ అనుభవాన్ని భక్తులతో పంచుకోవాలని అనుకున్నాను, తద్వారా అది ఎవరికైనా సహాయపడుతుందని నాకనిపించింది. ఆయన లీల అద్భుతంగా లేదూ! "థాంక్యూ దేవా! దయచేసి అందరినీ ఆశీర్వదించండి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము సాయీ!" 

5 comments:

  1. Sai sadguru maharajuki jai sai please bless me please baba

    ReplyDelete
  2. NAVA GURUVAR VRATAM ANTE ELA CHESTARU..PL TELL ME

    ReplyDelete
    Replies
    1. book stalls lo book dorukutundi. andulo vivaralu untayi sai

      Delete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo