సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 260వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి ఉద్యోగంతో నన్ను ఆశీర్వదించారు
  2. ప్రార్థించిన మరుక్షణంలో బాబా రక్షణనిచ్చారు 

సాయి ఉద్యోగంతో నన్ను ఆశీర్వదించారు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

6 సంవత్సరాల క్రితం ఎందరో సాయిభక్తులలో నేనూ ఒకడినయ్యాను. ఈ 6 సంవత్సరాల కాలంలో నేను లెక్కలేనన్ని అనుభవాలను చూశాను. గతంలో నేను కోరుకున్న వస్తువులను నాకు ఇవ్వలేదని నేను సాయితల్లితో పోరాడాను, దానికి కారణం 'ఆయనే నా ఆత్మ, నా జీవితం' అని ఇప్పుడు గ్రహించాను. ఆయన లేని జీవితాన్ని నేను ఊహించలేను. ప్రతిక్షణం ఆయన మనకు రక్షణనిస్తున్నారు. బ్లాగులోని కొన్ని అనుభవాలను చదవడం ద్వారా సాయి ఆశీస్సులు పొందుతున్న అనుభూతి కలుగుతుంది.

నా సాయి ప్రతినిమిషం నాకు అందిస్తున్న సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ, అదే సమయంలో ఉద్యోగం కోసం వెతుకుతుండేవాడిని. ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ముందుగా వ్రాతపరీక్ష నిర్వహించి తదుపరి రౌండుకి ఎంపికైనట్లు కొంతమంది పేర్లను ప్రకటించారు. అందులో నా పేరు లేకపోవడంతో నేను బాబాను ప్రార్థిస్తూ అక్కడే ఉన్నాను. 30 నిమిషాల తరువాత అనూహ్యమైన సంఘటన జరిగింది. తదుపరి రౌండుకి నన్ను ఎంపిక చేసి నా పేరు పిలిచారు. టెక్నికల్ రౌండు చాలా బాగా జరిగింది. ఆ తరువాత వారంరోజులైనా కంపెనీ నుండి ఫోన్ రాకపోయేసరికి నేను చాలా నిరాశకు గురయ్యాను. కానీ తరువాత నాకు ఫోన్ రావడంతో నేను చాలా సంతోషించాను. వాళ్ళు నా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయమని అడిగారు. అయితే నా సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయి. వాటిని ప్రిన్సిపాల్ ఇస్తారో లేదోనని చాలా ఆందోళనపడుతూ కాలేజీకి బయలుదేరాను. దారిలో రెండుసార్లు సాయిపల్లకి ఎదురైంది. గొప్ప అద్భుతం! సర్టిఫికెట్లను ఇవ్వడానికి ప్రిన్సిపాల్ వెంటనే అంగీకరించారు. వాటిని పట్టుకుని కంపెనీకి వెళ్ళాను. కంపెనీ ప్రవేశద్వారం వద్ద ఒక పెద్ద బాబా విగ్రహం దర్శనమిచ్చింది. ఆయన నన్ను తన వద్దకే లాక్కున్నారని సంతోషంగా బాబాకు నమస్కరించుకున్నాను. జీతం చాలా తక్కువ కావడంతో ఆ ఉద్యోగంలో చేరాలా, వద్దా అని బాబాను అడిగాను. బాబా చేరమని ఆదేశించినందువలన నాకేది మంచిదో ఆయనకు తెలుసునని నేను ఇంకేమీ ఆలోచించకుండా ఆ ఉద్యోగంలో చేరాను. నేను నా జీవితాన్ని సాయి పాదాలకు అప్పగించాను. శ్రీసాయి దివ్యపాదాలు తప్ప మనకు ఇతర విషయాలు అవసరం లేదు. సాయి యందు శ్రద్ధ, సబూరీ కలిగి ఉంటే చాలు, జీవితంలో మనం ఆశించేవన్నీ మనకు దక్కుతాయి. ఎట్టి పరిస్థితులలో మనం ఆశను కోల్పోనవసరంలేదు. సాయికి మాట ఇచ్చినట్టుగా నేను ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. జైసాయిసమర్థ!

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2474.html

ప్రార్థించిన మరుక్షణంలో బాబా రక్షణనిచ్చారు 

సాయిభక్తురాలు దుర్గ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ నా నమస్కారములు. నా పేరు శ్రీనివాస దుర్గ. నేను వైజాగ్ నివాసిని. నేను సాయిభక్తురాలిని. నేను 25 సంవత్సరాలుగా శిరిడీ సాయిబాబాను నమ్మి కొలుస్తున్నాను. నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈమధ్య నాకు తెలిసిన వాళ్లొకరు నాకు సంబంధం లేని ఒక దస్త్రం మీద నన్ను సంతకం చేయమన్నారు. ఆ పని చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే చాలా కష్టంలో ఉన్న నాకు ఆ పని చేయడం వల్ల కొంత డబ్బు వస్తుందని భావించి వాళ్ళతో ఆఫీసుకి వెళ్ళాను. కానీ నా మనసు అస్సలు అంగీకరించడంలేదు. అందువల్ల నేను, "బాబా! ఇష్టంలేని పని చేయనివ్వకుండా నన్ను ఇక్కడ నుంచి తప్పించండి" అని బాబాను ప్రార్థించాను. దయగల సాయి నన్ను వెంటనే ఆదుకున్నారు. నేను ప్రార్థించిన మరుక్షణంలో ఆఫీసులోని కంప్యూటర్లు పనిచెయ్యడం మానేశాయి. దాంతో జరగాల్సిన పని ఆగిపోయింది. సంతోషంతో మనసులోనే బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. బాబాయే నన్ను కాపాడారు.

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

4 comments:

  1. Sri sainathmaharajuki jai om sai ram

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం...,🌹🙏🏻🌹

    ReplyDelete
  4. ఓం సాయిరాం....🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo