సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 245వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నాకు సాయి పునర్జన్మనిచ్చారు
  2. మా పాపపై బాబా అనుగ్రహం
  3. బాబా లీల

సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నాకు సాయి పునర్జన్మనిచ్చారు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయి! 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్' నిర్వహిస్తున్న సాయికి నమస్కారములు. బాబా ప్రసాదించిన అనుభవాలను సాటి సాయిబంధువులతో పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్న మీకు, సాయిబంధువులకు నా ధన్యవాదాలు. 2014లో నేను నా మిత్రులతో కలిసి ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాను. ఆ వ్యాపారంలో మోసపోయి నష్టాల పాలయ్యాను. చాలా సమస్యలలో చిక్కుకొని రోజురోజుకీ మానసిక వేదన పెరిగి అనారోగ్యం పాలయ్యాను. నా అనుకున్నవాళ్ళు, నా ఆత్మీయులు అనుకున్నవాళ్ళు నాకు ఎలాంటి సహాయం చేయక‌పోగా నన్ను దూరంగా పెట్టారు. దిక్కుతోచని సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆ సమయంలో ఆ సాయినాథుడే రమణానందమహర్షి వారి ప్రవచనాల ద్వారా నాకు పునర్జన్మనిచ్చారు. అతను సాయే నిత్యం, సాయే సత్యం, సాయే శాశ్వతం అని తెలిపి, సాయిని ఏవిధంగా ధ్యానించాలో, ఎలా ప్రేమించాలో తెలియజేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, శతకోటి నమస్కారములు. అప్పటినుండి సాయి ప్రేమను తనివితీరా ఆస్వాదిస్తున్నాను. సాయే నాకు తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధుబలగం. నా జీవితాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న శ్రీ శిరిడీ సాయినాథునికి పాదాభివందనాలు. "సాయీ! సర్వం నీవే తండ్రీ. నీ ప్రేమ వర్ణనాతీతం. మాటలకందని నీ ప్రేమ అందరిపై కురవాలని మనసారా కోరుకుంటున్నాను".

ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

మా పాపపై బాబా అనుగ్రహం

యు.ఎస్.ఎ. నుండి సాయిభక్తురాలు ప్రియ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

నా పేరు ప్రియ. నేను మహాపారాయణ గ్రూపులో భాగస్వామిని. నేను నా జీవితంలో ఎన్నో బాబా లీలలను అనుభూతి చెందాను. కానీ, ఈ లీల నా మనసుకి ఎంతో దగ్గరైన లీల. ఎందుకంటే, ఈ లీల ద్వారా బాబా మా పాప అనారోగ్యాన్ని తొలగించారు.

ఒకసారి మా పాప 105 డిగ్రీల జ్వరంతో బాధపడింది. నేను, మావారు ఎంతగానో భయపడిపోయాము. అది రాత్రి సమయం కావడంతో రెగ్యులర్ డాక్టర్లెవరూ అందుబాటులో ఉండరు కాబట్టి ఎమర్జెన్సీకి ఫోన్ చేసి పిలిపించమని మా కుటుంబసభ్యులు చెప్పారు. ఎమర్జెన్సీకి ఫోన్ చేసే ముందు బాబాను ప్రార్థించి ఆయన ఆశీస్సులు పొందాలని అనుకుని నేను పూజామందిరంలోకి వెళ్లాను. బాబా పాదాలపై పడి, "బాబా! మా పాపను కాపాడండి. తన జ్వరం తగ్గి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేలా అనుగ్రహించండి. నేను పూర్తిగా మీమీదే ఆధారపడ్డాను. మీరు మాత్రమే మా పాపను ఈ పరిస్థితి నుండి కాపాడగలరు" అని మనస్పూర్తిగా బాబాను  ప్రార్థించాను. తర్వాత కొద్దిగా బాబా ఊదీని పాలల్లో కలిపి మా పాపకి తాగించాను. ఆశ్చర్యకరంగా పదినిమిషాల్లోనే పాపకు జ్వరం తగ్గి చెమటలు పట్టడం మొదలైంది. అది చూసి మా కళ్ళను మేమే నమ్మలేకపోయాము. నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. బాబాకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆయన ఎప్పుడూ మాతోనే ఉండి మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. "మాపై ఇంత అనుగ్రహం చూపుతున్నారు, చాలా చాలా ధన్యవాదాలు బాబా!" బాబాపై నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆయన మనల్ని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటారు, మన ప్రార్థనలు వింటారు. నన్ను మహాపారాయణ గ్రూపులో భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు.


బాబా లీల

హైదరాబాదు నుండి రాగశ్రీ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. నేను మహాపారాయణ గ్రూపులో (ఎంపీ-327) సభ్యురాలిని. బాబా ఊదీ, మహాపారాయణ చాలా శక్తివంతమైనవి. మహాపారాయణ చేస్తున్నప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నా అనుభవానికి వస్తే...

మా ఆఫీసులో మా మేనేజరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రతిరోజూ నేను నా రిపోర్టును మా మేనేజరుకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల నేను ఎప్పుడూ టెన్షన్ పడుతుంటాను. ఒకరోజు నేను మేనేజరు క్యాబిన్‌కి వెళ్లాను. అతను నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. నేను వెంటనే 'నాకు సహాయం చేయమ'ని బాబాను మనసులోనే ప్రార్థించాను. సాధారణంగా ప్రతిరోజూ 30 నిమిషాల సమయం తీసుకునే అతను ఆరోజు పదినిమిషాలలోపే నన్ను వెళ్ళమన్నాడు. నా ప్రార్థన విని బాబా నాకు సహాయం చేసినందుకు ఎంతో ఆనందించాను. బాబాకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా!"

3 comments:

  1. Sainathmaharajuki jai sadguru sainathaya namaha om sairam

    ReplyDelete
  2. ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు!
    అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo