సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 262వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి మహరాజ్ అనుగ్రహం
  2. చిన్న అనుభవంతో సరైన మార్గంలోకి తెచ్చారు బాబా

సాయి మహరాజ్ అనుగ్రహం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి మహరాజ్ పాదాలకు నా శతకోటి వందనాలు. నేను గత 22 సంవత్సరాలుగా, అంటే 1997 నుండి సాయిభక్తుడిని. నేను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా నా అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. శ్రీ శ్రీ సిద్ధయోగి గురురాం రతన్‌జీ మహరాజ్ 2018 ఆగస్టులో ఒకరోజు మా ఇంట సాయి అఖండజ్యోతి ప్రజ్వలన చేశారు. ఆరోజు నుండి నా జీవితంలో ప్రతిరోజు బాబాకు కాకడ ఆరతి ఇవ్వటంతో ప్రారంభమవుతుంది. జ్యోతి ప్రజ్వలన తరువాత మా పూజామందిరంలో సాయి మహరాజ్ కొలువై ఉన్నట్లు మాకు కొన్ని సంకేతాలు లభించాయి. అందువలన నేను మా ఇంట ఆరతి ఆపకుండా కొనసాగిస్తూ ఉన్నాను.

శ్రీవారిమెట్ల మార్గం గుండా కాలినడకన కొండ ఎక్కి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలనే మ్రొక్కు ఒకటి నాకు ఉండేది. అయితే చాలాకాలంగా నా కుడి మోకాలు చాలా నొప్పిగా ఉంది. పైగా నేను డయాబెటిక్ పేషేంటుని. నాకు బి.పి. కూడా ఉంది. అందువలన మ్రొక్కు తీర్చుకొనే విషయంలో నేను చాలా భయపడ్డాను. కానీ నా సాయి మహరాజ్ నాపై అపార అనుగ్రహాన్ని కురిపించారు. కేవలం రెండున్నర గంటల సమయంలో ఎటువంటి మోకాలి నొప్పి లేకుండా కాలినడకన సుమారు 2,399 మెట్లు సునాయాసంగా ఎక్కగలిగాను. అంత తేలికగా నా మ్రొక్కు నెరవేర్చుకోగలిగేలా చేసిన బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు. "బాబా! భవిష్యత్తులో అన్ని పరిస్థితులందు మీరు నాకు మీ సహాయాన్ని అందజేస్తూ, ఎప్పటికీ నాకు తోడుగా ఉండండి"

చిన్న అనుభవంతో సరైన మార్గంలోకి తెచ్చారు బాబా

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబిడ్డని. 2013 నుండి ఈ క్షణం వరకూ ఆయన దయను, అద్భుతాలను నేను అనుభవిస్తున్నాను. మా అబ్బాయి తనకు నచ్చిన స్కూలులో చేరితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటిభక్తులతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు. మంచి విద్యార్థిగా పేరుంది. అయినా తనకి నచ్చిన స్కూలులో చేరేందుకు అవకాశం వచ్చేది కాదు. తనలాంటి మంచి విద్యార్థికి రాకపోవడమేమిటని మేము చాలా బాధపడ్డాము. నా కొడుకు కూడా చాలా బాధపడుతుండటం తల్లిగా నా మనసుకు చాలా కష్టమైంది. అందువలన ప్రతి నిమిషమూ నేను, "తనకి నచ్చిన స్కూల్లో ప్రవేశం కల్పించమ"ని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. చివరికి బాబా దయవల్ల తనకి ఆ స్కూల్లో ప్రవేశం లభించింది. అయితే బాబా చేసే ప్రతి చర్య వెనుక ఏదో విషయం ఉంటుంది. తరువాత మొదటి ప్రయత్నంలోనే బాబా తననెందుకు అనుగ్రహించలేదనేది మాకు అర్థమైంది. తను తన క్లాసులో అన్నింట్లో ముందుండటం తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ కు కారణమైంది. అందువలన ప్రతిదీ తనకు చాలా సులభంగా లభిస్తుందని అనుకునేవాడు, తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు. స్కూలులో ప్రవేశం లభించే ప్రక్రియలో తనతోపాటు మాకు కూడా బాబా సరైనమార్గం చూపించారు. ఇప్పుడు తను చాలా వినయవిధేయతలతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. గతంలో మేము కూడా బాబా ఇచ్చినవి తీసుకోవడమే తప్ప వాటి ప్రాధాన్యతను గుర్తించేవాళ్ళం కాదు. అది మాకు తెలిసి వచ్చేలా చేశారు బాబా. "మాకు సరైన మార్గాన్ని చూపించి, నా కొడుకు తన తప్పులు తాను తెలుసుకునేలా చేసి తనకి కావలసినదాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా!"

బాబా దయగలవాడు. ఆయన బాధలలో ఉన్నవారికి ఏకైక ఆశ్రయం. గత నెల నాకు చాలా కష్టమైంది. చాలాసార్లు నేను సహనాన్ని కోల్పోయాను. బాబాను, 'ఎందుకు మా బాధను అర్ధం చేసుకోలేకపోతున్నార'ని అడిగాను. అయితే బాబాకు తనకంటూ కొన్ని మార్గాలున్నాయి. సరైన సమయంలో అన్నీ సరిచేస్తారు. "బాబా! మమ్మల్ని సరైన మార్గంలో ఉంచండి. నా కుటుంబాన్ని, ప్రతి ఒక్కరినీ మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు కలిగివుండేలా ఆశీర్వదించండి. మీ పాదకమలములకు నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. మీపై మా నమ్మకం స్థిరంగా ఉండేలా అనుగ్రహించండి. ప్రణామాలు బాబా!" 

6 comments:

  1. Om sai sri sai Jaya jaya sai.Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sadguru sainathmaharajuki jai please bless me sai

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo