సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 244వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  • భయాందోళనలను అధిగమించడంలో బాబా చేసిన సహాయం

యు.కె. నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

గత 10 సంవత్సరాలుగా నేను సాయిభక్తురాలిని. ముందుగా నేను ఈ బ్లాగ్ నిర్వాహకులకు, తమ అనుభవాలు పంచుకుంటున్న తోటి భక్తులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఈ అనుభవాలు సాయిపై ఉన్న విశ్వాసం మరింత పెంపొందేందుకు దోహదం చేస్తున్నాయి. నేను ఈ అనుభవాలు చదువుతూనే నా రోజును ప్రారంభిస్తాను. ఇటీవల నా కొడుకుకి వినికిడి సమస్య అన్న విషయంలో నేను అనుభవించిన భయాందోళనలను అధిగమించడంలో బాబా చేసిన సహాయాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

3 సంవత్సరాల నా కొడుకు నర్సరీ చదువుతున్నాడు. మా మాతృభాష ఇంగ్లీష్ కాదు. ప్రధాన భారతీయ భాషలు కూడా కావు. ఇంట్లో మేము మా మాతృభాషనే మాట్లాడుతుంటాము. మాకు సమీపంలో ఉన్న కొంతమంది భారతీయ స్నేహితులతో మాత్రం దక్షిణ భారత భాషలో మాట్లాడతాము. కానీ స్కూలులో ఇంగ్లీషులోనే అంతా మాట్లాడతారు. అందువలన నేను నా కొడుకు చదువు గురించి పెద్దగా ఆలోచించేదాన్ని కాదు గానీ, తనకి భాష సమస్య కాకపోతే చాలు అనుకునేదాన్ని. అయితే తను త్వరలోనే ఇంగ్లీషుకి అలవాటుపడతాడు, అంతా బాగానే ఉంటుందని అనుకున్నాను. నేను అప్పుడప్పుడు తన క్లాస్ టీచరుని తన గురించి అడుగుతూ ఉండేదాన్ని. నేను అడిగినప్పుడల్లా ఆమె, "బాబు గురించి ఆందోళన చెందడానికి ఏమీలేదు. అంతా బాగుంది" అని చెప్తుండటంతో నేను ప్రశాంతంగా ఉండేదాన్ని.

3 నెలల తరువాత పేరెంట్స్ మీటింగ్ అని మమ్మల్ని పిలిచారు. అప్పుడు మేము బాబు గురించి అడిగినప్పుడు, "మీ అబ్బాయికి వినికిడి సమస్య ఉన్నట్లుంది. తను సరిగా వినట్లేదు. ఒకసారి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లి పరీక్ష చేయించండి" అని చెప్పారు. ఒక్కసారిగా నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. నేనస్సలు నమ్మలేకపోయాను. ఈ మీటింగ్ తరువాత హాలిడేస్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత నేను ఆ టీచరుతో "సమస్య భాష కావచ్చు, నాకు తెలిసి వినికిడి సమస్య కాదు. తను చిన్న చిన్న శబ్దాలకు కూడా స్పందిస్తాడు. మేము చెప్పేవి తను చక్కగా వింటాడు" అని అన్నాను. కానీ ఆమె అస్సలు అంగీకరించక బాబు యొక్క వినికిడి సమస్యకు సంబంధించి చాలా ఉదాహరణలు చెప్పింది. అయితే ఒక తల్లిగా నేను ఆమె అభిప్రాయాన్ని అస్సలు అంగీకరించలేకపోయాను. కానీ ఏమి చేయాలో అర్థంకాక నేను తీవ్రమైన నిరాశకు లోనయ్యాను. ఆమె నాకొక నంబర్ ఇచ్చి, వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్ తీసుకుని సమస్యను పరిష్కరించుకోమని చెప్పింది. నేను చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి, బాబా ముందు కూర్చుని చాలా ఏడ్చాను. దేశం కాని దేశంలో నాకిలాంటి పరిస్థితి ఎందుకిచ్చారని కొన్నిసార్లు బాబాపై కోపం కూడా వచ్చింది. రాత్రీపగలూ నా కొడుకు విషయంలో ఆందోళనపడుతూ సరిగ్గా తినలేకపోయేదాన్ని, నిద్రపోలేకపోయేదాన్ని. నాభర్త నాతో, "ఎందుకింత బాధపడతావు? పిల్లల గురించి అందరికంటే బాగా తల్లిదండ్రులకే తెలుస్తుంది. మరి మన బిడ్డ గురించి మనకు తెలియదా? అయినా కేవలం చెక్ చేయడమే కదా, దానికే ఇంత ఆందోళన చెందనవసరంలేదు" అని చెప్పి నన్ను ఓదార్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ తల్లి మనసు కుదుటపడలేదు. ఈలోగా స్కూల్ మళ్ళీ మొదలైంది. టీచర్ మా బాబు వినికిడి సమస్యకు సంబంధించిన రిపోర్టు కోసం నన్ను సతాయించడం మొదలుపెట్టింది. నేను ఆమెతో, "ఇంకా డాక్టర్‌ అపాయింట్‌మెంట్ తీసుకోలేదు. త్వరలో అపాయింట్‌మెంట్ తీసుకుని మీకు తెలియజేస్తాను" అని చెప్పి ఇంటికి వచ్చాను. బాబాతో నా బాధ చెప్పుకుని ఏడ్చాను. తర్వాత మావారి వద్ద కూడా ఏడ్చాను. చివరకు మేము మార్చి చివరిలో అపాయింట్‌మెంట్ కోసం ఫోన్ చేస్తే, "చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది. మీరు చాలా రోజులు వేచి ఉండాలి. మేము అపాయింట్‌మెంట్ గురించి మీకు తర్వాత తెలియజేస్తామ"ని చెప్పారు. నేను నిరంతరం సాయి నామాన్ని జపిస్తూ, బాబాతో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకరోజు, "బిడ్డా! ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నీ ప్రార్థనలను విన్నాను. మీ సమస్యలన్నీ త్వరలో ముగియనున్నాయి" అని బాబా మెసేజ్ వచ్చింది. అంధకారంలో ఉన్న నాకు ఆ మెసేజ్ ఆశాజ్యోతి అయ్యింది.

ఆ తరువాత, సాయంత్రం ఆరతికి హాజరుకమ్మని మా పక్కింటి వారినుండి ఆహ్వానం వచ్చింది. నేను గురువారం సాయంత్రం బాబా ఆరతికి హాజరై, "నా కొడుకు విషయంలో అంతా బాగుండాలి" అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. తరువాత వచ్చిన శనివారంరోజున 'జూన్ 6, ఉదయం 9.15 గంటలకి హాస్పిటల్‌కి రమ్మ'ని అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చింది. ఆరోజు గురువారం కావడం చూసి నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అపాయింట్‌మెంట్ గురువారమే రావడం నాకు బాబా మిరాకిల్ అనిపించి, 'బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నార'ని నాకు అర్థమై మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను బాబాతో, "మీరు నాతో ఉన్నానని తెలియజేశారు. ఇక నేను ఎటువంటి భయం లేకుండా డాక్టర్ వద్దకు వెళ్తాను. ఆ రోజంతా మంచి జరిగితే నేను మీకు ప్రత్యేక పూజలు చేస్తాను" అని మ్రొక్కుకున్నాను. అప్పటినుండి అపాయింట్‌మెంట్ రోజు వరకు నేనెప్పుడు సాయియుగ నెట్‌వర్క్ లోని భక్తుల అనుభవాలు చూసినా సాయిబాబా ఫోటోపై, ప్రధానంగా ఆయన చెవులపై నా దృష్టి పడేది. దాంతో మా బాబు యొక్క వినికిడి పరీక్ష గురించి భయపడవద్దని బాబా చెబుతున్నట్లు నాకు అనిపించేది.

చివరికి అపాయింట్‌మెంట్ రోజు రానే వచ్చింది. ఆరోజు నేను ఉదయాన్నే మేలుకొని బాబాకు 108 నామాలతో పూజచేసి, నా కొడుకుని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ నా కొడుకుని నిశితంగా పరీశీలించి, "తను చాలా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలడు. ఇది కేవలం భాషకు సంబంధించిన సమస్య. అసలు నర్సరీ పిల్లలకు విద్య నేర్పించే పద్ధతులను మార్చాలి" అని అన్నారు. నేను పట్టలేని ఆనందంతో ఇంటికి వచ్చి, నేను మ్రొక్కుకున్నట్లు బాబాకు పూజ, ఆరతి చేశాను. సాయే నా సంరక్షకుడు.

ఆ రాత్రి బాబా కలలో నాకు దర్శనమిచ్చారు. కలలో నేను బాబా మందిరానికి వెళుతున్నాను. నేను బాబా విగ్రహం ముందు నిలుచుని, కళ్ళు మూసుకుని బాబాని ప్రార్థిస్తున్నాను. కళ్ళు తెరిచేసరికి చక్కటి చిరునవ్వుతో బాబా నాకు ఊదీ ఇస్తున్నారు. మరుసటిరోజు ఉదయాన లేచి కలలో బాబా చిరునవ్వుతో నాకు ఊదీ ఇచ్చి ఆశీర్వదించారని చాలా చాలా సంతోషించాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ!"

3 comments:

  1. 🙏🙏🙏Om Sai Ram 🙏🙏🙏
    🙏🙏🙏ఓం సాయినాథాయ నమః!🙏🙏🙏
    🙏🙏🙏ఓంరోగ్య క్షేమదాయ నమః!🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo