ఈ భాగంలో అనుభవాలు:
- స్వప్నంలో బాబా అడిగిన దక్షిణ
- అన్ని అనారోగ్యాలకు, సమస్యలకు వైద్యం చేసే నేల శిరిడీ
స్వప్నంలో బాబా అడిగిన దక్షిణ
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన స్వప్నానుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకి నమస్కారం. ఇంతకుముందు ఒకసారి నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు నిన్ననే(2020, ఏప్రిల్ 5) నాకు వచ్చిన ఒక కల గురించి మీతో పంచుకోబోతున్నాను.
ఆరోజు ఆదివారం. ఉదయం సుమారు 6 గంటల సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను, మా చెల్లి ఒక చోటికి వెళ్తున్నాము. దారిలో ఒక దుండగుడు మమ్మల్ని అటకాయిస్తున్నాడు. మేమిద్దరం ఎంతో భయంతో వణికిపోతున్నాము. నేను ఆ సమయంలో “శిరిడీ సాయిబాబా, శిరిడీ సాయిబాబా” అని గట్టిగా అరుస్తున్నాను. ఇంతలో ఒక వృద్ధురాలు మా దగ్గరికి వచ్చింది. (ఆ వచ్చింది బాబానే, నేను ఆమెను బాబాలానే స్వీకరిస్తున్నాను.) తను నాతో, “అస్సీ రూపైయా (80 రూపాయలు) ఇవ్వు, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది” అని చెప్పింది. నేను నా జేబుల్లో చెయ్యి పెట్టి చూశాను, నా దగ్గర డబ్బు లేదు. నేను మనసులోనే, “బాబా! నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా, మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారు, ఇప్పుడెలా?” అని బాబాతో చెప్పుకుంటున్నాను. అప్పుడు ఆ వృద్ధురాలు, “నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు, ఉన్నప్పుడు ఇవ్వు” అని చెప్పింది. తరువాత నేను, మా చెల్లి మేము చేరాల్సిన చోటికి క్షేమంగా చేరుకున్నాము.
“థాంక్యూ బాబా! మీరే ఆ వృద్ధురాలి రూపంలో వచ్చారు. బాబా! నేను ఏ సమస్యలో ఉన్నానో మీకు బాగా తెలుసు, మీ సమాధానం కోసం వేచిచూస్తున్నాను బాబా. నాకు చాలా ఆందోళనగా ఉంది. మీరు ద్వారకామాయిలో చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. బాబా! నాలుగు సంవత్సరాల నుంచి వేచిచూస్తున్నాను, దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు. కనీసం మీ మందిరానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంచారు మీరు. నాకు ఈ ట్రైనింగ్ నచ్చట్లేదు, వేరే ఉద్యోగ ఫలితాల కోసం వేచి చూస్తున్నాను. ఆ ఫలితాలు త్వరగా వచ్చేలా అనుగ్రహించండి బాబా!”
అన్ని అనారోగ్యాలకు, సమస్యలకు వైద్యం చేసే నేల శిరిడీ
సాయిభక్తురాలు దివ్య వాలియా తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
2009 నుండి మేము సాయిబాబా భక్తులం. ఆయన ప్రేమతో, దయతో మమ్మల్ని తమ నీడలోకి తీసుకొని ఆదరిస్తున్నారు. ఏదైనా కోరిక నెరవేరినందుకు లేదా సహాయాన్ని పొందినందుకు బదులుగా మన అనుభవాన్ని పంచుకుంటామని బాబాతో బేరం కుదుర్చుకోవడం సరైనది కాదని తెలిసినప్పటికీ కొన్నిసార్లు మనం పూర్తిగా నిస్సహాయంగా ఉంటాం. అవసరం వలన అలాంటి వాగ్దానాలు చేస్తాము. సరే, ఇక నా అనుభవంలోకి వస్తాను.
ఒకసారి మేము మరో రెండు రోజుల్లో శిరిడీ వెళ్ళవలసి ఉండగా నా భర్త నోటిలో తీవ్రంగా అల్సర్లు (నోటి పూత) ఏర్పడ్డాయి. దాంతో తనకి తినడం, మాట్లాడటం చాలా బాధాకరంగా ఉండేది. ప్రయాణానికి ముందే అది నయం కావాలని మావారు అల్లోపతి మరియు హోమియోపతి మందులు తీసుకున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేదిలేక ఆ సమస్యతోనే మేము శిరిడీ ప్రయాణమయ్యాము. మేము మధ్యాహ్నానికి శిరిడీ చేరుకున్నాము. అప్పటికీ మావారికి బాధ తీవ్రంగానే ఉంది. సాయంత్రం బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా దయవల్ల చక్కటి దర్శనం అయ్యింది. నేను అల్సర్లతో బాధపడుతున్న మావారి గురించి బాబాకి చెప్పుకుంటూ, "బాబా! మేము మరో రెండు రోజులు ఇక్కడే ఉంటాము. మేమిప్పుడు అన్ని అనారోగ్యాలకు, సమస్యలకు వైద్యం చేసే నేల మీద ఉన్నాము. దయచేసి ఉదయానికల్లా నా భర్త అల్సర్లు నయమయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. అద్భుతం! ఉదయానికల్లా మావారికి నొప్పి లేదు. నోటిపూత దాదాపు 80% తగ్గిపోయింది. సాయంత్రానికి పూర్తిగా మాయమైపోయింది. "కృతజ్ఞతలు బాబా! నేను చేసిన తప్పులేమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మీరు మా సమస్యలను పట్టించుకోనప్పుడు నేను కలత చెందుతుంటాను. కానీ, బాబా! మేము మిమ్మల్ని కాక ఎవరిని ఆశ్రయిస్తాము. అలాంటి మీరే పట్టనట్లుంటే మాకు దిక్కెవరు? దయచేసి మీ అమృతహస్తాలను మీ భక్తులందరి శిరస్సుపై ఉంచండి. మీ ప్రేమను, ఆశీస్సులను ఎల్లప్పుడూ మాపై కురిపించండి".
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2619.html

very nice leelas.in dream sai gave darshan in old womens foarm.lucly that devotee.to see sai.om saimaa
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteom sairam
ReplyDeletesai naa gunde moddubaripoindi sai
ReplyDeleteee alochananundi bhayata padeyandi deva
naa meda nake asahyam vestundi sai
please sairam