సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 392వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో నయమైన గొంతునొప్పి
  2. ప్రేమ ఉంటే బాబా పూజకి ఏదీ అడ్డంకి కాదు

నా పేరు శ్రావణి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

బాబా అనుగ్రహంతో నయమైన గొంతునొప్పి

ఒకసారి మా ఇంటిలో కొన్నిరోజులు పెయింటింగ్ వర్క్ జరిగింది. ఆ సమయంలో రేగే దుమ్ము, ధూళి కారణంగా డస్ట్ అలెర్జీ ఉన్న నాకు గొంతునొప్పి వచ్చింది. తినే సమయంలో ఆ నొప్పి మరీ తీవ్రంగా ఉండేది. కానీ, 'బాబా ఉన్నారు, ఆయనే చూసుకుంటారు' అనుకుని నేను నా ఇబ్బంది ఎవరికీ తెలియకుండా రెండురోజులు సంబాళించుకున్నాను. అయితే 2020, ఏప్రిల్ 5వ తేదీన చపాతీ తినడానికి నేను చాలా కష్టపడుతుంటే, మా నాన్న నా ఇబ్బంది గమనించి 'ఏమైంద'ని అడిగారు. నేను విషయం చెపితే, "డాక్టరుని సంప్రదించవచ్చు కదా?" అన్నారు. అతికష్టం మీద ఎలాగో తినడం ముగించాను. తరువాత ఆ రాత్రి నేను, “నా గొంతునొప్పి త్వరగా తగ్గేలా చెయ్యండి బాబా” అని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి నిద్రపోయాను. మరుసటిరోజుకి నొప్పి తగ్గినట్లుగా అనిపించింది. అయినా మావారు (కర్ఫ్యూ కారణంగా హాస్పిటల్స్ అన్నీ మూసివుండటంతో) తెలిసిన ENT డాక్టరుని ఫోనులో సంప్రదించగా, ఆమె నా లక్షణాలని బట్టి అది అలెర్జీ అని చెప్పి ఫోనులోనే మందులు సూచించారు. బాబా దయవల్ల రెండురోజులలో గొంతునొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

ప్రేమ ఉంటే బాబా పూజకి ఏదీ అడ్డంకి కాదు

సాధారణంగా మనం బాబాకి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ఎన్నో అనుకుంటుంటాం. కానీ పరిస్థితులకు లోబడి, “మన బాబాయే కదా, ఆయన ఏమీ పట్టించుకోరు, ఆయనకు మన పరిస్థితి తెలుసు” అని సాకులు చెప్పుకొని, మనం చేయాలనుకున్నది చేయము. అయితే 2020, ఏప్రిల్ 9, గురువారంనాడు మా బాబు ద్వారా బాబా నాకు గొప్ప సందేశాన్ని ఇచ్చారు.

నేను ప్రతి గురువారం మా ఇంటి మేడపైన గదిలో ఉన్న బాబాకి అభిషేకం చేసి, 108 పుష్పాలతో పూజ చేస్తాను. అయితే ఆరోజు నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన గాలివాన మొదలైంది. గాలివాన కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపేశారు. ఆ వానలో పైకి వెళ్ళడం కుదరదని క్రింద ఉన్న బాబాకి పూజ చేసుకున్నాను. సాయంత్రానికి వాన కొంచెం తెరిపిచ్చింది. అప్పుడు నేను, మా బాబు మేడపైకి వెళ్ళాము. కొద్దిసేపటికి మాబాబు(7 సం.) నాతో, “ఈరోజు గురువారం కదా, బాబాకి స్నానం చేయించవా?” అని అడిగాడు. “ఈరోజు నేను బాబాకి క్రిందనే పూజ చేసేశాను. కరెంటు లేదు కదా, చీకటిలో ఇప్పుడిక్కడ చెయ్యలేము. రేపు ఉదయం చేసుకుందాంలే” అని అన్నాను. దానికి వాడు, “ఈరోజు గురువారమైతే రేపు చేస్తానంటావేమిటి? చీకటైనా ఈరోజు బాబాకి స్నానం చేయించాల్సిందే” అని పట్టుబట్టాడు. తరువాత వాడంతట వాడే బాబాకి వేసివున్న మాలలు, బట్టలు తీసేసి ఒక పెద్ద పళ్ళెంలో బాబాను, బాబా పాదుకలను పెట్టాడు. వాడికి బాబాపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమను చూసి సంతోషంగా అనిపించి, "సరే, నేను క్రిందకి వెళ్లి అన్నీ తీసుకొని వస్తాను, చీకటిలో నువ్వు రాకు, ఇక్కడే ఉండు" అని చెప్పేసి క్రిందకి వెళ్ళాను. నేను మళ్ళీ పైకి వెళ్లేసరికి వాడు బాబా పాదాలు పట్టుకొని పడుకొని ఉన్నాడు. వాస్తవానికి వాడికి చీకటంటే చాలా భయం. అలాంటిది ఏమాత్రం భయపడకుండా ఆనందంగా నాకోసం ఎదురుచూస్తున్నాడు. తరువాత వాడు ఎంతో ప్రేమగా బాబాకి అభిషేకం చేశాడు. ఇంకో విషయమేమిటంటే, నా ఫోన్ బ్యాటరీ 12 శాతం ఉన్నప్పుడు మేము పైకి వెళ్ళాము. సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేసి, ఆ వెలుగులో దాదాపు గంటన్నరపాటు మేము పూజ చేసినా బ్యాటరీ డౌన్ అయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోలేదు. అంతసేపు లైట్ వెలుగుతున్నప్పటికీ కేవలం ఒక్క శాతం బ్యాటరీ మాత్రమే ఖర్చు అయ్యింది. చివరి పుష్పాన్ని బాబాకి పెట్టగానే కరెంటు వచ్చింది

ప్రేమ ఉంటే తమ పూజకి ఏదీ అడ్డంకి కాదని ఈ అనుభవం ద్వారా బాబా నాకు తెలియజేశారు. బాబా ప్రసాదించిన ఆ అనుభవంతో నాకు గొప్ప అనుభూతి కలిగింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక మా అన్నయ్యకి ఫోన్ చేసి పంచుకున్నాను. తను కూడా చాలా సంతోషించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


8 comments:

  1. Baba is great. Meeru kuda adrustavanthulu
    🙏

    ReplyDelete
  2. సాయి రామ్! ఇదియే బాబా గారు చెప్పిన 'శ్రద్ధ'
    ప్రేమ తో కూడినటువంటి భక్తి అని

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete
  5. Sri satchitananda sadguru sainath Maharaj ki jai
    For five baba
    Please help me baba
    Save me baba
    Love you baba
    Bless me and all of us baba

    ReplyDelete
  6. Forgive me and save me baba
    Om sai ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo