సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 382వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అంతులేని ప్రేమను పంచిన సాయి - రెండవ భాగం...

యు.ఎస్.ఏ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలలో నిన్నటి తరువాయి భాగం:


చివరికి అసలైన రోజు వచ్చింది. మేము, నా తల్లిదండ్రులు కలిసి శిరిడీయాత్రను ప్రారంభించాము. మా తిరుగు ప్రయాణ టిక్కెట్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నందున నాన్న చాలా టెన్షన్ పడుతుంటే, "చింతించకండి. బాబా అన్నీ ఏర్పాటు చేస్తార"ని చెప్పాను. వెయిటింగ్ లిస్టు నెంబర్లు చాలా పెద్దవైనందున నా సమాధానంతో నాన్న సంతృప్తి చెందలేదు. కానీ బాబా తమ బిడ్డల క్షేమాన్ని చూసుకుంటారని నాకు తెలుసు. అందువలన నేను టెన్షన్ పడలేదు. మేము గురువారం శిరిడీలో దిగాము. నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత శిరిడీ నేలపై అడుగుపెట్టినందుకు నేను చాలా సంతోషించాను. మేము స్నానాలు చేసుకొని ద్వారకామాయి, చావడిలలో బాబా దర్శనం చేసుకొని ధూప్ ఆరతికి వెళ్ళాము. ఆరతికోసం చాలాసేపు ఎదురుచూడటం వలన నా కుటుంబసభ్యులంతా కలతచెందారు. తరువాత కూడా మేము లోపల ఆ జనంలో ఎక్కడో ఉన్నందున సాయిని కూడా సరిగా చూడలేకపోయాము. అయితే నా హృదయం నాతో, "నేను నా సాయితో ఉన్నానని, నా చెవులు సాయి ఆరతి వినగలవని, ఆరతి తర్వాత నాకు మంచి దర్శనం లభిస్తుంద"ని చెప్తోంది. అందువలన నేను కలతచెందలేదు. నా భర్త, "టిక్కెట్లు బుక్ చేసుకున్నందుకు కొంతైనా ప్రత్యేకత ఇవ్వాలి. పైగా ఆడవాళ్లను, మగవాళ్ళను విడదీస్తున్నారు. ఆరతి అయిన తరువాత అందరూ కలుసుకోవడం పెద్ద సమస్య" అంటూ చాలా కలత చెందారు. ఆ పరిస్థితులేవీ నా సంతోషానికి భంగం కలిగించలేదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. 'నేను బాబాను చూస్తాను, హాలులో నలభై నిమిషాలపాటు ఆయనతో గడుపుతున్నాను' అన్నదే నా మనసులో ఉంది. అలాగే నేను మొదటిసారి ధూప్ ఆరతిని తృప్తిగా ఆస్వాదించి, బాబాను దర్శించుకుని ఆనందంగా బయటకు వచ్చాను.

తరువాత డిన్నర్ చేసి సాయి పల్లకి ఉత్సవాన్ని చూశాము. ఆ తరువాత హోటల్‌కు చేరుకున్నాము. మరుసటిరోజు ఉదయం కాకడ ఆరతికి మాకు టిక్కెట్లు ఉన్నాయి. అయితే నాన్న తను రానని చెప్పడంతో పిల్లలను తన దగ్గర వదిలిపెట్టి నేను, మావారు ఆరతికి వెళ్లాలని నిశ్చయించుకొని ఉదయాన్నే నిద్రలేచి రూమ్ నుండి బయలుదేరాము. నేను బాబా కోసం పేడా కొనాలనుకున్నాను, కానీ నా భర్త ఏమంటారోనని భయపడ్డాను. ముందురోజు దర్శనంతో కలత చెంది ఉన్న మావారు కాకడ ఆరతి దర్శనం పట్ల ఆసక్తిగా లేరు, 'మళ్ళీ ఎక్కడో నిలుచుంటాము, బాబాను చూడలేము' అని అంటూ ఉన్నారు. మేము ఆలయ ప్రవేశద్వారం దగ్గరకు వెళుతుండగా, మేము మా చెప్పులు వదిలిపెట్టిన చోట ఉన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి, "సిస్టర్, బాబా కోసం ఈ పేడా తీసుకో" అన్నాడు. నేను చాలా సంతోషంగా ఆ పేడా తీసుకొన్నాను. తరువాత మేము లోపలికి వెళ్ళాము. అనుకున్నట్లుగానే లైన్లో ఎక్కడో ఉన్నాము. బాబాను సరిగా చూడలేకపోతున్నప్పటికీ బాబా ఆరతి పాడటం సంతోషంగా అనిపించింది. తెల్లవారుఝామున బాబాను శిరిడీలో చూడటం, బాబాతో సమయం గడపడం నాకు చాలా గొప్ప విషయంగా అనిపించింది. ఆరతి పాడుతున్న సమయంలో అసాధ్యమని నా మనసుకు అనిపిస్తున్నా బాబాతో, "నా జీవితకాలంలో నేను చనిపోయేలోపు కనీసం ఒక్కసారైనా నేను మీ ముందు నిలుచుంటానా?" అని ఏదో మాములుగా అన్నాను. తరువాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. కొంతమంది స్నేహితులు బాబాకి మంగళస్నానం చేసిన తీర్థం లభిస్తుందని చెప్పడంతో అందుకోసం నేను ప్రయత్నించాను, కానీ ఆ పవిత్ర తీర్థాన్ని సేకరించలేకపోయాను. దాంతో నాకు బాధగా అనిపించింది.

తరువాత మేము మా గదికి తిరిగి వెళ్లి కొంతసమయం విశ్రాంతి తీసుకున్నాము. పిల్లలు లేచి స్నానాలు చేశాక మధ్యాహ్న ఆరతికి వెళదామంటే, ఎవరూ రావడానికి సిద్ధంగా లేరు. నేను వాళ్లతో, "ఆరతి తరువాత కనీసం బాబా దర్శనమైనా చేసుకోవచ్చు" అన్నాను. 'గం.11:30 ని.లకి క్లోజ్ చేస్తారనగా ఒక్క నిమిషం ముందు గం.11:29 ని.లకి లైన్లోకి వెళ్దాం' అన్న షరతు మీద వాళ్లంతా అంగీకరించారు. నాకు వేరే దారిలేక సరేనని అన్నాను. ఆలోగా నేను నాన్నను తీసుకొని ద్వారకామాయికి వెళ్ళాను. మాకు చక్కని దర్శనం అయ్యింది. తరువాత మేము కొంతసేపు అక్కడ కూర్చున్నాము. సంస్థాన్‌కి చెందిన ఒక వ్యక్తి వచ్చి, బాబా కూర్చున్న రాయిని శుభ్రంచేస్తున్నాడు. నేను అక్కడ నిలబడి అతను ఏమి చేస్తున్నాడో గమనిస్తున్నాను. అక్కడ నేను కాక ఇంకా చాలామంది ఉన్నారు. అతను నావైపు చేయి చూపిస్తూ రమ్మని పిలిచాడు. నేను ఏమిటా అని ఆలోచిస్తూ దగ్గరకు వెళ్ళాను. అతను బాబా కూర్చొనే ఆ రాయి మీద ఉన్న పువ్వు తీసి నాకిచ్చాడు. ఒక్క క్షణం నేను నిశ్చేష్ఠురాలినయ్యాను. నాకు ఏమీ అర్థం కాలేదు. చుట్టూ అంతమంది ఉంటే నన్నే పిలిచి మరీ ఇవ్వడంతో నేను చాలా ఆనందం పొందాను. నా సాయి తన ఒడిలో నాకు చూపిన మొదటి అందమైన అద్భుతమిది.

బాబా ఇచ్చిన అద్భుతమైన ఆ అనుభవంతో చాలా సంతోషిస్తూ, ఆరతి సమయం దగ్గర పడుతుండటంతో అందరితో కలిసి నేను మందిరానికి వెళ్ళాను. గం.11:29 ని.లకి మేము లైన్లోకి ప్రవేశించాము. సెక్యూరిటీ గార్డు మాతో, "గేటు మూసివేయబోతున్న సమయానికి వచ్చారు. మీరే చివరి వాళ్ళు" అని అన్నాడు. లైన్లో ఎవరూ లేరు, నేరుగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళాము. మేమే చివరిగా లోపలి ప్రవేశించినందువల్ల అందరికన్నా వెనుక ఉన్నాము. నేను అస్సలు బాబాను చూడలేకపోయాను. ముందు దర్శనాలలో కనీసం కొంచెం కొంచెంగా అయినా బాబాను చూడగలిగాను. ఇప్పుడు అది కూడా లేదు. దాదాపు హాల్ వెలుపల ఉన్నట్లు ఉన్నాను. అయినా ఆరతి తర్వాతైనా బాబాను చూస్తానన్న సంతోషంలో ఉన్నాను. నా భర్త, నా తల్లిదండ్రులు మునుపటిలానే కలత చెందారు. "అవకాశం లేనప్పుడు ఎందుకు వేచి ఉండటం" అని వాళ్ళు అనుకుంటున్న మాటలు నేను విన్నాను. కానీ నేనేమీ మాట్లాడలేదు. నాన్న, నా భర్త, పిల్లలు పురుషుల వరుసలోకి వెళ్లారు. నేను, అమ్మ మహిళల వరుసలో ఉన్నాము. అప్పుడు నా జీవితంలో నేనెప్పుడూ ఊహించని అతిపెద్ద అద్భుతం జరిగింది.

ఆ అద్భుతంతో సహా మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో... 


6 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. sai enni rojulu ee natakalu adali
    please sai do smothing
    please sairam , please sairam

    ReplyDelete
  3. omsaisreesaijayajayasai
    baba pls nannu tondaraga karuninchandi,saisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisaisai

    ReplyDelete
  4. love u so much baba,be with me forever

    ReplyDelete
  5. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo