ఈ భాగంలో అనుభవం:
- స్వస్థత చేకూర్చిన బాబా
మలేషియా నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
బాబా నా సోదరుడికి ఎలా నయం చేశారనే దానిపై నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇది అతనిపై వ్యాధి 3వ దాడి.
2019, సెప్టెంబర్ 13న బాక్టీరియల్ మెనింజైటిస్ (మెనింజైటిస్ అనేది మెదడు మరియు వెన్నెముక ప్రాంతంలో వచ్చే వ్యాధి. అనేక రకాల వైరస్‌లు, శిలీంధ్రాలు, కొన్ని పరాన్నజీవులు, బాక్టీరియాలు ఈ వ్యాధికి ముఖ్య కారకాలు. అధిక జ్వరం, వాంతులు, కండరాల నొప్పి, వికారం, దద్దుర్లు, చేతులు, పాదాలు చల్లబడడం మొదలైనవి ప్రధాన లక్షణాలు.) అనే ప్రాణాంతకమైన వ్యాధి కారణంగా నా సోదరుడు ఆసుపత్రి పాలయ్యాడని నాన్నకు డాక్టర్ నుండి కాల్ వచ్చింది. ఆ మాట విని మేమంతా షాక్ అయ్యాము. వెంటనే నా తల్లిదండ్రులు నా సోదరుడిని చూడటానికి బస్సులో బయలుదేరారు. తనకి ఆ బ్యాక్టీరియా ఎలా సంక్రమించిందో తెలీదుగానీ ఇది 3వ సారి బయటపడింది. నిరంతర పర్యవేక్షణ అవసరం కనుక తనని ఐసియులో ఉంచారు. నా సోదరుడు 5 రోజులపాటు అపస్మారక స్థితిలో ఉన్నాడు. తరువాత డాక్టర్ తనకి చికిత్స చేసేందుకు అంటువ్యాధి నిపుణుడున్న మరొక హాస్పిటల్‌కి తరలించమని నా తల్లిదండ్రులతో చెప్పారు. అప్పటికే హాస్పిటల్ ఛార్జీలకు నా సోదరునికి ఉన్న ఇన్సూరెన్సంతా అయిపోయింది. అందువల్ల మేము తనని స్పెషలిస్ట్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించాలని నిర్ణయించుకున్నాము.
ఒక గురువారంనాడు తెల్లవారుఝామున 4.30 గంటలకు నేను మేల్కొని బాబా ముందు దీపాలు వెలిగించి, "బాబా! నా సోదరుడు స్పృహలోకి వచ్చేలా చేయండి. తన మెదడు, జ్ఞాపకశక్తి అంతా బాగుండాలి" అని ప్రార్థించాను. పిలిచిన వెంటనే పలికే బాబా వెంటనే కృప చూపించారు. గవర్నమెంట్ హాస్పిటల్లోని స్పెషలిస్ట్ డాక్టర్ నాన్నకు ఫోన్ చేసి, "మీ అబ్బాయి ఆరోగ్యంలో మెరుగుదల కనిపించింది. సాయంత్రం వరకు అతన్ని పర్యవేక్షణలో ఉంచి తనంతట తాను శ్వాస తీసుకోగలిగితే సాధారణ వార్డులోకి మారుస్తామ"ని చెప్పారు. మేమంతా చాలా సంతోషించాము. కానీ ఆ రోజంతా మళ్ళీ ఎటువంటి వార్తా రాకపోవడంతో మేము కాస్త ఆందోళన చెందాము. అయితే బాబా నిజంగా అద్భుతం చేశారు. శుక్రవారం నా సోదరుడిని సాధారణ వార్డుకు మార్చారన్న వార్త వచ్చింది.
నా సోదరుడిని నార్మల్ వార్డుకి మార్చినప్పటికీ, తను అందరినీ గుర్తించగలుగుతున్నప్పటికీ తన పరిస్థితి దయనీయంగా ఉంది. అందువలన తనని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక కేర్ టేకర్‌ను నియమించాము. నా సోదరుడు పూర్తిగా కోలుకోవాలని నేను బాబాను ప్రార్థిస్తూ నామజపం చేస్తూ ఉండేదాన్ని. దూరాన ఉన్నందున నేరుగా తనకి ఊదీ పెట్టలేక బాబాని తలుచుకుని ఊదీని నా నుదుటిపై పెట్టుకున్నాను. చక్కెర తినడం మానేశాను. గర్భవతిగా ఉన్న నాకు అది అసాధ్యమైనప్పటికీ నాకు ఇష్టమైన చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీంలు తినకుండా ఉండిపోయాను. రోజులు గడిచేకొద్దీ నెమ్మదిగా తను సాధారణ స్థితికి చేరుకున్నాడు. మూడువారాల తరువాత తనని డిశ్చార్జ్ చేశారు. చివరికి మేము చేసిన ప్రార్థనలకు, ఏడుపులకు మా దయగల బాబా సమాధానం ఇచ్చారు. ఆయన మమ్మల్ని పరీక్షించారు, కానీ రక్షించారు కూడా. ఆయన దయవల్ల ఇప్పుడు నా సోదరుడు బాగానే ఉన్నాడు. "మా ప్రార్థనలన్నిటికీ సమాధానమిచ్చినందుకు ధన్యవాదాలు బాబా. నా సోదరుడికి జీవితంలో మళ్లీ మెనింజైటిస్ రాకూడదు. జాలితో తన కర్మలన్నింటినీ తొలగిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే 3 సార్లు మెనింజైటిస్ రావడమన్నది తేలికగా తీసుకునే విషయం కాదు. మీరు లేని జీవితం ఆక్సిజన్ లేకుండా శ్వాసించడం లాంటిది. మీరు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించలేను. నా డార్లింగ్ బాబా! మీరు నా జీవితంలో ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు".
భక్తులారా! మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎప్పుడూ ఆశను కోల్పోకండి. బాబా మీకు తప్పక మార్గనిర్దేశం చేస్తారు. బాబాను విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. "ఐ లవ్ యు బాబా! దయచేసి నా సోదరుడిని త్వరలో మీ భక్తునిగా చేసుకోండి. మీ పాదకమలాల వద్దకు పిచ్చుకలాగా లాగుకోండి".
సాయిరామ్!
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2600.html

very very nice leela sai.baba can do any thing for his devotees.we must trust him.he takes care.om sai ram om sai ram om sai ram
ReplyDeletebaba please cure my-sister-inlaws health problem.she is not eating,and suffering.please be with her.bless herwith health.omsaimaa
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm sairam🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDelete