ఈ భాగంలో అనుభవాలు:
- సాయిబాబా అద్భుతాలు
- ఆపద నుండి ఆదుకున్న బాబా
సాయిబాబా అద్భుతాలు
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను 2004 నుండి బాబాను ప్రార్థించడం ప్రారంభించాను. ఆయన నాకు చాలా అనుభవాలు ఇచ్చారు.
1) నా 10వ తరగతి పరీక్షా ఫలితాలు రావడానికి ముందురోజు కలలో బాబా కనిపించి నాకు పెరుగన్నం ఇచ్చారు. మరుసటిరోజు వచ్చిన ఫలితాల్లో నాకు 95% వచ్చింది.
2) 2012లో నా పెళ్లికి ఆహ్వానించడానికి నా తల్లిదండ్రులు ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్న ఆంటీ అప్పుడే శిరిడీ నుండి వచ్చారు. ఆమె శిరిడీలోని సాయిబాబాకు కప్పిన శాలువాను నా తల్లిదండ్రులకు ఇచ్చింది. నా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఆ శాలువాను నాకు ఇచ్చినప్పుడు, బాబా నా పెళ్ళికి కానుక పంపారని, ఆ రూపంలో తమ ఆశీస్సులు అందజేశారని నేను చాలా సంతోషించాను. నేను దానిని భద్రంగా నా అల్మరాలో దాచుకున్నాను.
3) ఒకసారి నాకు ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాన్ని అదుపులో ఉంచి బాబా నాకు చాలా సహాయం చేశారు.
4) ఒకసారి మా అమ్మ అనారోగ్యం పాలైంది. డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలన్నారు. శస్త్రచికిత్స మరుసటిరోజు ఉందనగా ఆమెకు పెట్టెలో ఒక బాబా ఫోటో కనిపించింది. ఆ ఫోటోను నేను అందులో పెట్టానని ఆమె అనుకుంది. కానీ నేను పెట్టలేదు. అదెలా అందులోకి వచ్చిందోనని మేమంతా ఆశ్చర్యపోయాం. ఇక అసలు అద్భుతం చూడండి! శస్త్రచికిత్స అస్సలు అవసరం లేదని డాక్టర్ చెప్పారు.
5) ఇటీవల నాన్నకు టి.బి ఉందని పరీక్షలో వెల్లడైంది. తదుపరి మరికొన్ని పరీక్షలు చేసినప్పుడు కూడా ఫలితాలన్నీ ప్రతికూలంగా వచ్చాయి. మేమంతా చాలా ఆందోళనపడ్డాము. నేను, "బాబా! నాన్నకు టి.బి లేదని నిర్ధారణ అయితే, నా అనుభవాన్ని పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. అంతే! బాబా ఏమి జాదూ చేశారో గానీ ఆ భయంకరమైన వ్యాధి నాన్నకు లేదని తెలిసింది.
"ప్రియమైన సాయిబాబా! దయచేసి నా కుటుంబానికి రక్షణ నివ్వండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. నా కుటుంబంలో ఎవరికీ టి.బి రాకుండా చూసుకోండి. నా తండ్రి ఇప్పటికే చాలా మందులు వాడుతున్నారు. అది మీకు తెలుసు. దయచేసి మమ్మల్ని రక్షించండి బాబా. మీరు ఇప్పటివరకు చేసిన అన్ని అద్భుతాలకు నా ధన్యవాదాలు".
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2595.html

ఆపద నుండి ఆదుకున్న బాబా
గుంటూరు నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ముందుగా శ్రీసాయి దివ్య పాదపద్మాలకు నా శతకోటి నమస్కారాలు. మేము ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి కష్టపడి పనిచేసుకుంటూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాము. కానీ సన్నిహితులు చేసిన మోసం వలన మరియు పలురకాల కారణాల వలన మేము కోలుకోలేని విధంగా భారీగా నష్టపోయాము. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి తెచ్చిన అప్పులు, బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నాం. బ్యాంకు వారికి రెండు లక్షలు వడ్డీ కట్టాలి. నిర్ణీత సమయం లోపు వడ్డీ కడితే మిగిలిన లోను తీర్చటానికి మూడు నెలలు సమయం ఇస్తామన్నారు. కట్టలేకపోతే ఆస్తి వేలం వేస్తామన్నారు. కానీ మా వద్ద వడ్డీ కట్టే శక్తి లేదు. దాంతో బాబా మీదే భారం వేసి డబ్బు కోసం ప్రయత్నించాము. సమయానికి ధనసహాయం అందితే మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు మొక్కుకున్నాను. బాబా దయతో మా బంధువులలో ఒకరు సమయానికి డబ్బిచ్చి మాకు సహాయం చేశారు. ఆపద నుంచి గట్టెక్కించి ఆస్తి వేలం వేయకుండా ఆపారు బాబా. బాబా చేసిన సహాయానికి మనస్పూర్తిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రస్తుత సమస్యను తీర్చిన బాబా, మూడు నెలలలోపే బ్యాంకు నుండి తీసుకున్న ఋణాన్నించి మమ్మల్ని విముక్తులను చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. నా అనుభవాన్ని మీతో పంచుకుంటుంటే స్వయంగా బాబాకే చెప్పుకుంటున్నంత ఆనందం కలుగుతోంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

Om sai sree sai Jaya Jaya sai,Baba pls Naku kuda oka anubhavam panchukone chance ivvandi
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDelete🙏🙏🙏
ReplyDelete